వారఫలాలు: ఓ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి..!

First Published | Oct 8, 2023, 10:00 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం  అనుకూల శుభ ఫలితాలు పొందగలరు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Shani with astro signs


వార ఫలాలు :08-10-2023 నుంచి 14-10-2023 వరకూ

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ... ఈ వారం  రాశి ఫలాలు లో తెలుసుకుందాం

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ రాశి వారికి ఈ వారం చతుర్దాదిపతి అయిన చంద్రుడు చతుర్థ స్థానము మరియు శత్రు స్థానం నందు  సంచరించిను. ఈ సంచారం వలన ఇబ్బందులు రాగలవు. ఆరోగ్య సమస్యలు రాగలవు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించవలెను. స్థిరాస్తి విషయాలలో వివాదాలు రాగలవు.భూ గృహ క్రయ విక్రయాలు ఈవారం వాయిదా వేయుట మంచిది. భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రాగలవు.నమ్మిన వారి వలన మోసపోగలరు. మానసికంగా భయాందోళన గా ఉంటుంది. చేయు పనులలో బుద్ధి కుశలత తగ్గును.పని వారి తో వివాదాలు రాకుండా జాగ్రత్త అవసరము .తలపెట్టిన కార్యాలలో ప్రతిబంధకాలు ఏర్పడగలవు.  వారాంతం లో  వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

ఈ రాశి వారికి ఈ వారం తృతీయాధిపతి అయిన చంద్రుడు తృతీయ మరియు పంచమస్థానం లో సంచారము.ఈ సంచారం వలన అనుకూల శుభ ఫలితాలు పొందగలరు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. గృహ భూ క్రయ విక్రయాలు ఈవారం అనుకూలించును. శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతోషకరమైన చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలం. కీలకమైన సమస్యలు పరిష్కారమగును. అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుంది. ధైర్య సాహసాలతోటి కీలకమైన సమస్యలను పరిష్కరించు కుంటారు. సంతాన అభివృద్ధి ఆనందం కలిగించును.వారాంతం లో అనవసరమైన ఖర్చులు చేయవలసిన వస్తుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగించును. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రములు
(కా-కి-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఈ రాశి వారికి ఈ వారం ధనాధిపతి అయిన చంద్రుడు ధన స్థానము మరియు మాతృస్థానము లో చంద్రసంచారం. ఈ సంచారము వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. అనవసరమైన ఖర్చులు పెరుగును. ఆదాయానికి సమానంగా ఖర్చులు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ధన నష్టం రాకుండా  జాగ్రత్త వహించాలి. సమాజంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించవలెను. కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు రాగలవు. వచ్చిన అవకాశాలలో బుద్ధి స్థిరత్వం లేక చేజారి పోవును. నిరాశ నిస్పృహలకు లోనవుతారు.దాచిన డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది.అనారోగ్య సమస్యలు రాగలవు. సమాజం నందు అపనిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు పుట్టించును. వారాంతం లో  నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు.
 

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రములు
(హీ-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2

ఈ రాశి వారికి జన్మరాశ్యాధి పతి అయిన చంద్రుడు ఈ వారం జన్మ రాశి లోమరియు తృతీయ స్థానము లో సంచారం. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందగలరు. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. సమాజంలో మీ మాట తీరుతోటి అందరినీ ఆకట్టుకుంటారు. అకారణ కోపావేశాలు తగ్గించుకొనవలెను.తలపెట్టిన కార్యాలలో మిత్రుల సహాయ సహకారాల తో పూర్తి చేయగలుగుతారు . ఆరోగ్యవంతులుగా ఉంటారు.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.ఆర్థిక మరియు కుటుంబ విషయాలలో అభివృద్ధి కనబడుతుంది. ఉద్యోగాలలో అధికార అభివృద్ధి కలుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు.వారాంతం లో  అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో అకారణంగా విరోధాలు రాగలవు.

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మే-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1

ఈ రాశి వారికి ఈవారం వ్యయాధిపతి అయిన చంద్రుడు వ్యయస్థానం  మరియు ధన స్థానము నందు సంచరించును. ఈ సంచారము వలన వ్యతిరేక ఫలితాలు కలుగును. మానసికంగా భయాందోళనగా ఉంటుంది .తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి ఆగిపోవును. శారీరకంగా బలహీనతగా ఉంటుంది .వ్యవహారాలలో కఠినంగా మాట్లాడడం లేదా ఆతురత వలన వ్యవహారాలు చెడిపోగలవు. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. వృత్తి వ్యాపారాలలో తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగవలెను. ఉద్యోగాలలో అధికారులు తో నిరాదరణకు గురికావడం.ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. సమాజము నందు ప్రతికూలత వాతావరణ. కొన్ని సందర్భాల్లో మిత్రుల వలన నష్టము కలగవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి.వారాంతం లో  శరీర సౌఖ్యం లభిస్తుంది. జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అన్ని రంగాలు వారు అభివృద్ధి చెందుతారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఢ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఈ రాశి వారికి ఈవారం లాభాధిపతి అయిన చంద్రుడు లాభ స్థానము  మరియు జన్మరాశి  లో     సంచారము. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం సమకూరి ప్రశాంతత లభిస్తుంది.చేయు పనులు అనుకూలం గా ఉండును. ఉద్యోగాలలో అధికారుల యొక్క మన్ననలు పొందగలరు.ఆర్ధికపరంగా లాభము కలుగును. కుటుంబములో సుఖశాంతులు లభిస్తాయి.బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. ఉద్యోగమునందు అధికారుల అభిమానాలు పొందగలరు. అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. వారాంతం లో  తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు రాగలవు. వ్యవహారాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించాలి.
 

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రే-రో-త-తీ-తూ-తే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

ఈ రాశి వారికి ఈ వారం రాజ్యాధిపతి అయిన చంద్రుడు రాజ్యస్థానము  మరియు వ్యయస్థానములో  సంచారం. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. ప్రతిభావంతులుగా గుర్తింపు లభిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారులు పెట్టుబడికి తగ్గ లాభం కలుగుతుంది. ఉద్యోగాలలో  అధికారుల అభిమానం పొందగలరు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.కోర్టు వ్యవహారాలు అనుకూలముగా ఉండును.నూతన  కార్యాలకు శ్రీకారం చేస్తారు. మానసిక ఆలోచనలు అమలు చేస్తారు. సన్నిహితులు నుంచి శుభ వార్తలు అందుకుంటారు. మధ్యలో ఆగిపోయిన పనులు అప్రయత్నముగా పూర్తి అగును.వ్యవహారాలలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు.తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. కుటుంబము నందు సంతోషకరమైన వాతావరణం. ఉద్యోగమునందు అధికారవృద్ధి పొందగలరు.వారాంతం లో  సమాజము లో అవమానాలు కలగవచ్చు.తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడను.
 

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ రాశి వారికి ఈ వారం భాగ్యాధిపతి అయిన చంద్రుడు భాగ్యస్థానం మరియు లాభ స్థానము లో సంచారం. ఈ సంచారం వలన మిశ్రమ ఫలితాలు కలుగును. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రాగలవు. అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులతో అకారణ కలహాలు రాగలవు. రావలసిన ధనము చేతికి అందక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. అనుకోని సంఘటనలు ఎదురయి మానసిక ఆందోళన పెరుగుతుంది. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. స్థిరాస్తి విషయాలలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరము.వారాంతం లో  స్త్రీ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలించును. వృత్తి వ్యాపారాలలో ధనలాభం పొందగలరు.
 

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈ రాశి వారికి ఈ వారం అష్టమాధిపతి అయిన చంద్రుడు అష్టమ స్థానము  మరియు రాజ్యస్థానము లో సంచారం. ఈ సంచారం వలన ప్రతికూల ఫలితాలు కలుగును. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు. బంధు వర్గం తో  అకారణంగా కలహాలు రాగలవు. తలపెట్టిన పనులలో ప్రతిభందకాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును. ఉద్యోగాలలో అధికారులతో విభేదాలు రాగలవు. శ్రమ అధికంగా ఉండి అలసట చెందుతారు. మానసిక దుఃఖం మరియు భయాందోళనగా ఉండును.పరామర్శ చేయవలసి వస్తుంది. . ఊహించని పరిణామాలు ఎదురయి మానసిక ఆవేదనకు గురి అవుతారు.వారాంతం లో అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. కుటుంబము నందు సంతోషకరమైన వాతావరణం. ఉద్యోగాలలో అధికారవృద్ధి పొందగలరు.
 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈ రాశి వారికి ఈ వారం కళత్రాధిపతి అయిన చంద్రుడు కళత్ర స్థానము మరియు  భాగ్యస్థానము లో సంచారం. ఈ సంచారం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. సంఘములో కీర్తి ప్రతిష్టలు పెరుగును. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో  ధన లాభం లభిస్తుంది. శత్రువులపై పై చేయి సాధిస్తారు. తలచిన కార్యాలలో విజయం లభిస్తుంది. నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును. ఆర్థికంగా బలపడతారు.సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు. చేపట్టిన కార్యాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.వారాంతం లో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి ఆలోచనలు చేస్తారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు.
 

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈ రాశి వారికి ఈ వారం షష్ఠమాధిపతి అయిన చంద్రుడు శత్రు స్థానం మరియు ఆయుః స్థానం లో సంచారము.ఈ సంచారం వలన సకల శుభ ఫలితాలు పొందగలరు.వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం కలుగుతుంది. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. కొద్ది రోజులుగా పడుతున్న అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. భూ గృహ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. సమాజములో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. గత కొద్దిరోజులుగా ఉన్న అనారోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజములో ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో పనులు సజావుగా పూర్తి చేయగలుగుతారు.వారాంతం లో అనారోగ్య సమస్యలు రాగలవు. పరామర్శ చేస్తారు .మానసిక ఆవేదనకు గురి అవుతారు. ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈ రాశి వారికి ఈ వారం పంచమాధిపతి అయిన చంద్రుడు పంచమ స్థానము మరియు కళత్ర స్థానములో  సంచారము. ఈ సంచారము వలన వ్యతిరేక ఫలితాలు రాగలవు.అకారణంగా బంధు వర్గముతో విరోధాలు . వ్యాపార నిమిత్తం తెచ్చుకున్న వస్తువులు చెడిపోయి నష్టం రాగలదు.కుటుంబంలో కలహాలు వలన మానసిక ఆవేదనకు గురి అవుతారు. అనేక రకమైన క్రూరమైన ఆలోచనలు కలుగును. నమ్మిన వారి వలనే మోసం జరిగే ప్రమాదం. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు.మానసికంగా భయంగా ఉండుట. చేయు కార్యాలలో నిరాశ స్పృహలకు గురి అవుతారు. సమాజములో అవమానాలు కలగవచ్చు. వ్యవహారమంతా తికమక్కగా ఉండును.వారాంతం లో కొద్ది రోజులుగా ఉన్న అనారోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజము నందు ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో పనులు సజావుగా పూర్తి చేయగలుగుతారు.

Latest Videos

click me!