వారఫలాలు: ఓ రాశి వారికి పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయి.

First Published Sep 3, 2023, 10:00 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు.అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు.

daily horoscope 2023 New 06

వార ఫలాలు :03 సెప్టెంబర్  2023 నుంచి 09 సెప్టెంబర్ 2023 వరకూ

 
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం  ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ  వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈవారం చంద్రుడు జన్మ రాశి లో సంచరించును. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందగలరు. శరీర సౌఖ్యం లభిస్తుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.వివాహ ప్రయత్నాలు చేయువారు శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. అభివృద్ధి విషయాలలో అనుకూలత లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలించును. ఇతరులు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తారు .తద్వారా మీ సమస్యలను సులభంగా ఎదుర్కొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుట వలన అదనపు బాధ్యతలు పెరుగుతాయి.అన్ని పనులలో సులభంగా విజయం సాధిస్తారు. అన్ని రంగముల వారికి ప్రోత్సాహకరంగా నుండును. ఉద్యోగమునందు అధికార వృద్ధి కలుగును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు.అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు.
 

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ వారం గోచార రీత్యా చంద్రుడు వ్యయస్థానం  నందు సంచరించును. ఈ సంచారము వ్యతిరేక ఫలితాలు కలుగును. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడను. ధనాధాయ మార్గాలు ఆర్థిక విషయాలు బాగుండును.వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. మంచి స్వభావముతోటి అందరిని కలుపుకుని వెళ్లాలని ప్రయత్నిస్తారు. కుటుంబ సౌకర్యం లభిస్తుంది. సోదర సోదరీల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. కొద్దిపాటి మానసిక ఆందోళన పెరగగలదు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విద్యార్థులు పట్టుదలతోటి చదవండి. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరం. పిల్లలతోటి సరదా కాసేపు గడపండి. బంధువర్గము తోటి సహాయ సహకారాలు లభిస్తాయి. గృహవనందు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. నూతన పరిచయాలు వలన అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలరు. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగం నందు అధికారుల యొక్క ఆదర అభిమానాలు పొందగలరు‌. వివాహ ప్రయత్నాలు ఫలించును ‌

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రములు:-(కా-కి-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

ఈ వారం చంద్రుడు లాభ స్థానము నందు సంచారము. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందుతారు. స్త్రీ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలించును. వృత్తి వ్యాపారాలలో ధనలాభం పొందగలరు.చేయి పనులలో శారీరక శ్రమ తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇతరులతోటి మీరు అనుకున్న విధంగా పనులు పూర్తి చేసుకుంటారు.విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యవహారములలో బుద్ధి కుశలత పెరిగి వ్యవహారములు తెలివితేటలుగా పూర్తి చేసుకుంటారు. సమాజం నందు గౌరవ ప్రతిష్టలు లభించును. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. కొద్దిపాటి రుణాలు తీరును. శత్రువులపై విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడను. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. అభివృద్ధి ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఆధ్యాత్మిక చింతన పై యొక్క దృష్టి కేంద్రీకరిస్తారు. విదేశీ ప్రయాణాల ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడను. కోర్టు విషయాలలో అనుకూలమైన తీర్పులు రావచ్చును.
 

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రములు:-(హీ-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2

ఈ వారం చంద్రుడు రాజ్య స్థానము నందు సంచరించిను. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. ఉద్యోగం నందు అధికార అభివృద్ధి కలుగును. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అగును. శారీరక శ్రమ పెరుగుతుంది.వృత్తి వ్యాపారములు యందు అనుకోని మార్పులు రాగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.వృథా ధనవ్యయం. కుటుంబంలో చికాకులు మరియు చేయు  పని వారి తో చికాకులు ఏర్పడగలవు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తగు సమయానికి ధనము లభించును. భార్య భర్తల మధ్య అనుకూలత దెబ్బతినకుండా చూసుకోవడం మంచిది. విద్యార్థులు కష్టపడి చదివిన విజయం సాధిస్తారు. కోర్టు సంబంధమైన విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకొనవలెను. గృహ నిర్మాణ పనులు సజావుగా ముందుకు సాగును.భూ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం లభించును. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగము నందు అధికారుల తోటి ఆకారణంగా విరోధాలు రాగలవు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.
 

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మే-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1

ఈ వారం చంద్రుడు భాగ్యస్థానం నందు సంచరించిను. ఈ సంచారం వలన కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు కలుగును. శారీరక పీడ పెరుగును.అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండును.చేయు పనులలో అలసత్వం పెరుగుతుంది.నూతన పరిచయాలు ద్వారా పనులను సకాలంలో పూర్తి అగును. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజము నందు అందరి అభిమానాలు పొందగలరు. వృత్తి వ్యాపారములు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అధిక లాభాలు పొందగలరు. ఉద్యోగమనందు అధికారులతోటి ఇబ్బందులు రాగలవు. విదేశీ ప్రయాణాల ప్రయత్నాల్లో ఇబ్బందులు ఏర్పడిన చివరకు ఫలిస్తాయి. కొన్ని సంఘటన వలన మానసిక ఆందోళన కలుగును. ఆరోగ్య విషయంలో మరియు వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్తలుతీసుకొనవలెను. కోర్టు తీర్పులు అనుకూలంగా రాగలవు. నూతన కాంట్రాక్టులు పొందుతారు. రుణాల తీరి ప్రశాంతత లభిస్తుంది. సంతానము నందు ప్రతికూలత వాతావరణం. విద్యార్థులకు నూతన విద్యా అవకాశములు పొందగలరు.భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి.

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఢ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

ఈవారం చంద్రుడు అష్టమ స్థానము నందు సంచారం. ఈ సంచారం వలన ప్రతికూల ఫలితాలు కలుగును. మానసిక ఉద్రేకత పెరుగుట. ఆకస్మిక పరిణామాలు ఎదురవుతాయి.ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును. ఆర్థికంగా బాగుండను. గృహ జీవితం సంతోషం కలిగిస్తుంది . కుటుంబ సభ్యులతో అభివృద్ధి విషయాల గూర్చి ఆలోచన చేస్తారు. మానసిక ధైర్యం తోటి అన్ని వ్యవహారాలు సులభంగా పూర్తి చేసుకుంటారు. చిన్నపాటి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. రచనా ఆలోచనలు శక్తి పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. సమాజము నందు పేరు ప్రతిష్టలు పెరుగును. చేజారిన అవకాశాలు తిరిగి లభించును. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన కార్యము లందు అధిక ఉత్సాహాన్ని చూపిస్తారు.
 

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రే-రో-త-తీ-తూ-తే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

ఈవారం చంద్రుడు కళత్ర స్థానము నందు సంచారం. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందుతారు. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. శరీర సౌఖ్యం లభిస్తుంది. సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు. ఆనందంగా సుఖ సంతోషాలతో  గడుపుతారు.ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సంపదలు చేకూరుతాయి. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభించును. నూతన అభివృద్ధి కార్యక్రమాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. తలచుకున్న పనులన్నీ నెరవేరతాయి. వృత్తి వ్యాపారము నందు ధన లాభం పొందగలరు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి.పోయిన వస్తువులు తిరగ లభిస్తాయి. బంధుమిత్రులతో కలసి విందు వినోదములలో పాల్గొంటారు. ఉద్యోగం నందు అధికారుల అనుగ్రహము పొందగలరు. శత్రువులే మిత్రులై సహాయ సహకారాలు అందిస్తారు. ఆదాయ మార్గాలు బాగుంటాయి.ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. విశేష సౌఖ్యం కూడా పొందుతారు.

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9


ఈ వారం చంద్రుడు శత్రు స్థానం నందు సంచారము. ఈ సంచారం వలన సామాన్య ఫలితాలు ఉండగలవు. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. ఆదాయానికి మించిన ఖర్చులు చేయవలసి వస్తుంది. అనవసర విషయాలలో జోక్యం చేసుకోకుండా కలహాలకు దూరంగా ఉండటం మంచిది. శారీరక మానసిక అనారోగ్యాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. సమాజము నందు అపవాదములు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారములు లాభసాటికా జరుగును. తలపెట్టిన పనులలో ఆలస్యమైన అనుకున్న పనులు చివరకు సఫలీకృతం అవుతాయి. మిత్రుల సహాయ సహకారాలు పొందగలరు.సంతానమునకు ఉన్నత విద్య ఉద్యోగం లభించును. ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగవనందు అధికారుల తోటి మనస్పర్ధలు రాగలవు.

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-బా-బి-బూ-ధా-భా-ఢా-బే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈవారం చంద్రుడు పంచమ స్థానము నందు సంచారము. ఈ సంచారము వలన వ్యతిరేక ఫలితాలు కలుగును.చేయు పనులలో అశ్రద్ధ పెరిగి ఆటంకముల ఏర్పడను. అనారోగ్య సమస్యలు రాగలవు. ప్రతి విషయం నందు ఆచితూచి వ్యవహరించవలెను. ఇతరులతో వాదోపవాదములకు దూరంగా ఉండాలి.  మనసు ఆందోళనగా ఉంటుంది.వాహన ప్రయా ణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించు కోవాలి .పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదల తోటి చేసిన పూర్తి అగును . వ్యవహారాలలో కోపావేశాలు తగ్గించి వ్యవహరించవలెను . వృత్తి వ్యాపారులు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగం నందు అధికారుల యొక్క ఒత్తిడిలు పెరుగును. కీలకమైన సమస్యలు పరిష్కారం లభిస్తుంది.  ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యలు రాగలవు. సమాజం నందు అవమానాలు కలగ గలవు. అసూయా ద్వేషాలకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవుతాయి.

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రములు:-(బో-జా-జి-జూ-జే-జో-ఖా-గా-గీ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈ వారం చంద్రుడు చతుర్థ స్థానము నందు సంచరించిను. ఈ సంచారం వలన అనుకూల ఫలితాలు ఏర్పడను. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతోటి అకారణంగా విరోధాలు రాగలవు. మానసిక చాంచల్యం. చేసిన పనిని మరలా చేయవలసి వస్తుంది. వివాదాలు తీరి ప్రశాంతత లభిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా నూతన అవకాశాలు సాధిస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.మానసిక ప్రశాంతత పొందగలరు. కొంతకాలంగా పరిష్కారం కానీ సమస్యలు పరిష్కారం అగును. నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే అంది చేజారును. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. ముఖ్యమైన విషయాలలో ఆందోళనలు పెరుగును.

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈ వారం చంద్రుడు తృతీయ స్థానము నందు సంచరించును. ఈ సంచారం వలన అనుకూల శుభ ఫలితాలు పొందగలరు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.వృత్తి వ్యాపారములు యందు అనుకున్న విధంగా అభివృద్ధి సాధిస్తారు. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అగును. ఉద్యోగము నందు సహోద్యోగులు మరియు పై అధికారుల ఆదరణ అభిమానాలు పొందగలరు. అనుకున్న విధంగా పదోన్నతి లభిస్తుంది.సమాజంలో  కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహమునందు ఆహ్లాదకరమైన వాతావరణం.ఆకస్మిక ధన లాభం పొందగలరు.స్థిరాస్తి గృహ నిర్మాణాలకు అనుకూలం. సంతాన మూలకంగా లాభం.  నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి అనుకూలంగా ఉంటుంది. గృహమునందు శుభ కార్యక్రమాలు జరుగును .జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మొండి బాకీలు వసూలు అగును. ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలు లాభసాటిక జరుగును. పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించవలెను.

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రములు:-(ది-దు-శ్యం-ఝా-థా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈ వారం గోచార రీత్యా చంద్రుడు వ్యయ స్థానము నందు సంచరించును. ఈ సంచారము వ్యతిరేక ఫలితాలు ఇవ్వగలడు. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడను. అనవసరపు ఖర్చులు పెరుగును. అనారోగ్య సమస్యలు రాగలవు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన చివరకు పూర్తి చేస్తారు. పాత బాకీలు వసూలు చేయుట సవాళ్లుగా మారును. కీలకమైన సమస్యల యందు మధ్య వర్తుల ద్వారా పరిష్కరించడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పటికి అవసరములకు తగిన ధనం సమకూరును. ఎంతో శ్రమతో ఓర్పుతో  కష్టపడిన పనులకు సామాన్య ఫలితం లభించును. గృహము నందు దైవ పుణ్య కార్యాలు చేస్తారు.వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. సమాజము నందు అపవాదములు రాగలవు జాగ్రత్త పడాలి.

click me!