వార ఫలాలు :30 జూలై 2023 నుంచి 05 ఆగస్ట్ 2023 వరకూ
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
చతుర్దాధిపతి అయిన చంద్రుడు నవమ స్థానము నందు సంచారముఇతరులతోటి అనవసరమైన గొడవలు ఏర్పడతాయి జాగ్రత్త అవసరము. ఉద్యోగం నందు అధికారుల నిందారోపణలు రాగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును. శారీరకంగా మానసికంగా బలహీనంగా నుండును. అనుకున్న పనులు ఇబ్బందులు ఏర్పడిన సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్రలు చేస్తారు. చేయు వ్యవహారము నందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.వృత్తి వ్యాపారులు లాభసాటిగా జరుగును. సంతానముకు ఉన్నత విద్య ఉద్యోగం లభిస్తుంది.
ఈ వారం అశ్విని నక్షత్రం వారికి శుభదినములు:- 31-7/సోమవారం 2-8/బుధవారం 4-8/శుక్రవారం
ఈ వారం భరణి నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 5-8/శనివారం
ఈ వారం కృత్తిక నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 31-7/సోమవారం 2-8/బుధవారం 4-8/శుక్రవారం
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
తృతీయాధిపతిఅయిన చంద్రుడు అష్టమ స్థానము నందు సంచారము ఈ సంచారము వలన అన్నదమ్ముల తోటి అకారణంగా కలహాలు రాగలవు. కొన్ని సంఘటనలు వలన మానసిక ఉద్రేకత మానసిక ఆందోళన పెరుగును. ఇతరులతోటి వాధోపవాదములకు దూరంగా ఉండటం మంచిది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగము నందు అధికార వృద్ధి కలుగును. అభివృద్ధి ఆలోచనలు ఇతరులతోటి చర్చలు జరుపుతారు. వ్యాపారమునందు పెట్టుబడులు ఆలోచించి నిర్ణయం తీసుకొనవలెను. వ్యవహారములలో బుద్ధి కుశలత పెరిగి వ్యవహారములు అనుకూలంగా పూర్తి అవుతాయి.
ఈ వారం కృత్తిక నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 31-7/సోమవారం 2-8/బుధవారం 4-8/శుక్రవారం
ఈ వారం రోహిణి నక్షత్రం వారికి శుభదినములు:- 31-7/సోమవారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 5-8/శనివారం
ఈ వారం మృగశిర నక్షత్రం వారికి శుభదినములు:-30-7ఆదివారం/ 2-8బుధవారం/ 3-8 గురువారం/ 5-8శనివారం/
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ద్వితీయాధిపతి అయిన చంద్రుడు సప్తమ స్థానము నందు సంచారము వలన వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఆదాయ మార్గాలు బాగుంటాయి. మానసిక శారీరక సంతోషాలు పొందగలరు. వృత్తి వ్యాపారములందు ధన లాభం లభించును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభించును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అనవసరమైన ఖర్చు యందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. శత్రు వర్గం తోటి అపకారం జరిగే అవకాశం. ఆకస్మిక ధన లాభం పొందగలరు.
ఈ వారం మృగశిర నక్షత్రం వారికి శుభదినములు:-30-7ఆదివారం/ 2-8బుధవారం/ 3-8 గురువారం/ 5-8శనివారం/
ఈ వారం ఆరుద్ర నక్షత్రం వారికి శుభదినములు:- 31-7/సోమవారం2-8/బుధవారం 3-8/ గురువారం 5-8/శనివారం
ఈ వారం పునర్వసు నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 4-8/శుక్రవారం
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
జన్మరాశి అధిపతి అయిన చంద్రుడు షష్టమ స్థానం నందు సంచరించును ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందగలరు. ఆరోగ్యం అనుకూలించను. శుభవార్తలు వింటారు. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. శత్రువర్గంపై పై చేయి సాధిస్తారు. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగును. కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన లాభం పొందగలరు. ఉద్యోగమునందు అధికారుల ఆదర అభిమానాలు బహుమానాలు పొందగలరు.
ఈ వారం పునర్వసు నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 4-8/శుక్రవారం
ఈ వారం పుష్యమి నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 4-8/శుక్రవారం
ఈ వారం ఆశ్రేష నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 4-8/శుక్రవారం
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥
అనవసరమైన ఖర్చులు పెరుగును. మానసిక ఒత్తిడి. సమాజము నందు అవమానాలు కరగవచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడను. ఈర్ష ద్వేషములు పెరుగును. చేయని పనికి అపవాదములు రాగలవు. నమ్మిన వారే అపకారం చేయాలని చూస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితోటి అకారణ కలహాలు రాగలవు. ఆకస్మిక పరిణామాలు ఆందోళన కలిగిస్తాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఉద్యోగమునందు అధికార వృద్ధి. వృత్తి వ్యాపారములు యందు ధనలాభం పొందగలరు.
ఈ వారం మఖ నక్షత్రం వారికి శుభదినములు:- 31-7/సోమవారం 2-8/బుధవారం 4-8/శుక్రవారం
ఈ వారం పూ.ఫల్గుణి నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 5-8/శనివారం
ఈ వారం ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 31-7/సోమవారం 2-8/బుధవారం 4-8/శుక్రవారం
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
మానసిక భజ ఆందోళన కలిగిస్తాయి. వృత్తి వ్యాపారం నందు ఆచితూచి అడుగులు వేయవలెను. అనవసరమైన ఖర్చులు యందు నియంత్రణ అవసరము. ఇతరులతోటి విరోధాలకు దూరంగా ఉండవలెను. చేయు వ్యవహారములలో బుద్ధి కుశలత తగ్గి ఇబ్బందులు ఎదురవుతాయి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మానసిక అశాంతి. ఉద్యోగము నందు అధికారులతోటి ఆకారణ మనస్పర్ధలు. విచిత్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. తొందరపాటు నిర్ణయాలు వలన ఇబ్బందులు పడతారు.
ఈ వారం ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 31-7/సోమవారం 2-8/బుధవారం 4-8/శుక్రవారం
ఈ వారం హస్త నక్షత్రం వారికి శుభదినములు:- 31-7/సోమవారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 5-8/శనివారం
ఈ వారం చిత్త నక్షత్రం వారికి శుభదినములు:-30-7ఆదివారం/ 2-8బుధవారం/ 3-8 గురువారం/ 5-8శనివారం/
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈవారం అనుకూలమైన శుభ ఫలితాలు పొందగలరు. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యవహారాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి పనిలోనూ నూతన ఉత్సాహం చూపిస్తారు. అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ విషయాలలో చురుగ్గా ఉంటారు. ఆరోగ్య విషయాలలో ప్రశాంతత ఉంటుంది. బందోవర్గంతోటి కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక విషయాలలో కూడా మంచి ఫలితాలు పొందగలరు.
ఈ వారం చిత్త నక్షత్రం వారికి శుభదినములు:-30-7ఆదివారం/ 2-8బుధవారం/ 3-8 గురువారం/ 5-8శనివారం/
ఈ వారం స్వాతి
నక్షత్రం వారికి శుభదినములు:- 31-7/సోమవారం2-8/బుధవారం 3-8/ గురువారం 5-8/శనివారం
ఈ వారం విశాఖ నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 4-8/శుక్రవారం
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
ఈ వారం గ్రహాచారం అనుకూలంగా లేదు. అనవసరమైన ఖర్చులు. అనారోగ్య సమస్యలు. సమాజం నందు అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాగ్రత్త అవసరము. మానసిక వ్యాపారమునందు కొద్దిపాటి ఇబ్బందులు కలిగిన అభివృద్ధి కనపడుతుంది. ఈ వారం వివాదాలు రాకుండా జాగ్రత్త అవసరం. వీలైనంతవరకు చిత్రల యొక్క వ్యవహారాలకు దూరంగా ఉండవలెను. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన బుద్ధి కుశల తోటి పూర్తి చేస్తారు. సమాజం నందు వ్యవహారములు చికాకు పుట్టించును. వృత్తి ఉద్యోగమునందు ఓర్పుగా వ్యవహరించవలెను. పిల్లల యొక్క అభివృద్ధి కనబరుస్తారు.
ఈ వారం విశాఖ నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 4-8/శుక్రవారం
ఈ వారం అనూరాధ నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 4-8/శుక్రవారం
ఈ వారం జ్యేష్ట నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 4-8/శుక్రవారం
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ఈవారం గ్రహచారం అనుకూలంగా ఉన్నది. శారీరక సుఖం లభిస్తుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. సమాజము నందు గౌరవ మర్యాదలు పెరుగును. మిత్రుల యొక్క ఆదరణ అభిమానాలు పొందగలరు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. తలపెట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఉద్యోగమునందు అధికారుల మన్ననలు పొందగలరు. వృత్తి వ్యాపారులు సజావుగా సాగును. కుటుంబ అవసరాలు చక్కగా నెరవేర్చుకుంటారు. గౌరవ జీవనం సాగిస్తారు. శుభ కార్యక్రమాల ఆలోచనలు చేస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలం.
ఈ వారం మూల నక్షత్రం వారికి శుభదినములు:- 31-7/సోమవారం 2-8/బుధవారం 4-8/శుక్రవారం
ఈ వారం పూ.షా నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 5-8/శనివారం
ఈ వారం ఉ.షా నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 31-7/సోమవారం 2-8/బుధవారం 4-8/శుక్రవారం
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
చంద్రసంచారం అంత అనుకూలంగా లేదు. పొదుపు చేసిన ధనాన్ని తీసి ఖర్చు పెట్టవలసి వస్తుంది. కొన్ని అనుకోని ఆకస్మిక విపత్తులు ఎదురవుతాయి. సమాజము నందు అపవాదములు. బంధుమిత్రులతో అకారణ కలహాలు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన కోణాలలో ఆటంకాలు రాగలవు. కుటుంబ సభ్యులతో ప్రతికూలత వాతావరణ. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి కలహాలు రాగలవు. అనవసర కాలక్షేపానికి చర్చలకు కలహాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక విషయాలు స్వయంగా చూసుకోవడం మంచిది.
ఈ వారం ఉ.షా నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 31-7/సోమవారం 2-8/బుధవారం 4-8/శుక్రవారం
ఈ వారం శ్రవణంనక్షత్రం వారికి శుభదినములు:- 31-7/సోమవారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 5-8/శనివారం
ఈ వారం ధనిష్ఠ నక్షత్రం వారికి శుభదినములు:-30-7ఆదివారం/ 2-8బుధవారం/ 3-8 గురువారం/ 5-8శనివారం/
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
ఈవారం అనుకూలమైన ఫలితాలు పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపగలరు. వృత్తి వ్యాపారములు సాటిగా జరుగును. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు. ఆరోగ్యం అనుకూలించను. వ్యవహారములలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రతీ పని సానుకూలంగా జరుగును. భూ గృహ వస్తు వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు పలుస్తాయి. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగము నందు పనులు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
ఈ వారం ధనిష్ఠ నక్షత్రం వారికి శుభదినములు:-30-7ఆదివారం/ 2-8బుధవారం/ 3-8 గురువారం/ 5-8శనివారం/
ఈ వారం శతభిషం నక్షత్రం వారికి శుభదినములు:- 31-7/సోమవారం2-8/బుధవారం 3-8/ గురువారం 5-8/శనివారం
ఈ వారం పూ.భాద్ర నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 4-8/శుక్రవారం
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన ఫలితాలు పొందగలరు. ఆరోగ్యం అనుకూలించును. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబము నందు అనుకూలమైన వాతావరణ. ఉద్యోగము నందు అధికార వృద్ధి పొందగలరు. నూతన వస్తూ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల యొక్క కలయక. శుభవార్తలు వింటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. దైవ సంబంధిత కార్యక్రమాలు ఆచరిస్తారు. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తవును. సమాజం నందు పేరు ప్రతిష్టలు లభించును. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.
ఈ వారం పూ.భాద్ర నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 4-8/శుక్రవారం
ఈ వారం ఉ.భాద్ర నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 4-8/శుక్రవారం
ఈ వారం రేవతి నక్షత్రం వారికి శుభదినములు:-30-7/ఆదివారం 1-8/మంగళవారం 3-8/ గురువారం 4-8/శుక్రవారం