Solar Eclipse on October 24- Beware of this zodiac sign!
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
Zodiac Sign
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ వారంలో గృహమునందు శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రమ పెరుగుతుంది. సంఘమునందు మీ మాట తీరుతోటి అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. రావలసిన పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణాధి పనులు ముందుకు సాగును.మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. మీ ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపార యందు ధన లాభం కలుగును. వారాంతంలో ఇతరులతోటి వాదనలు వలన కొత్త సమస్యలు ఏర్పడగలవు. వివాదాలకు దూరంగా ఉండండి. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
Zodiac Sign
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ వారం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. కొత్త వివాదాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలిక అనారోగ్యములు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. వ్యాపారములో పెద్దలు సూచన మేరకు పెట్టుబడులు పెట్టవలెను. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకొనవలెను. అన్నదమ్ముల తోటి సఖ్యతగా మెలగవలెను.ఉద్యోగమనందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారాలు అందుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేయు పనులలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విలువైన వస్తువులు యందు జాగ్రత్తగా ఉండవలెను. వారాంతంలో గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. శరీర ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
Zodiac Sign
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమాధిక్యం. కోపాన్ని అదుపు అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు మాటలతూలకొండ చూసుకోవాలి. బంధుమిత్రులతోటి కొద్దిపాటి మనస్పర్ధలు రావచ్చు. మానసికంగా బలహీనంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొద్దిగా ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయానికి ధనం చేకూరును. మనస్సునందు ఆందోళనగా ఉంటుంది. తలపెట్టిన పనులలో పట్టుదల తోటి పూర్తి చేయాలి. గృహమునందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని కోవాలి. వృత్తి వ్యాపారాల యందు సామాన్య లాభం. వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యాలకు శ్రీకారం చేస్తారు. గులాబీ, లేత నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
Zodiac Sign
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
వారం చివరిలో అనుకోని ధనవ్యయం. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి అగును. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వైవాహి జీవితం ఆనందంగా గడుపుతారు. నూతన పెట్టుబడులకు అనుకూల వాతావరణం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. అ కారణంగా భాగోద్వేగం చేత కొన్ని కొత్త సమస్యలు ఏర్పడవచ్చును. వ్యాపారాలు యందు ధన లాభం కలుగును. ప్రయాణాలు అనుకూలించను. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభ తగ్గ గౌరవం లభించును. ఉద్యోగమునందు కొద్దిపాటి ఇబ్బందులు ఉన్న అధికమించి ఉత్సాహంగా చేస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభించును. వారాంతంలో వ్యాపారంలో కొద్దిపాటి ధన నష్టం రావచ్చు. ఇతరులతోటి వాదనలకు దూరంగా ఉండండి. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.
Zodiac Sign
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
వారం మధ్యలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తలపెట్టిన పనులలో పట్టుదలతో పూర్తి చేయాలి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యమునందు శ్రద్ధ వహించవలెను. కొన్ని కొత్త సమస్యలు చికాకు పుట్టించును. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనవలెను. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కీలకమైన సమస్యలను బుద్ధి బలం తోటి పరిష్కరించాలి. ఉద్యోగ వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. వారాంతంలో బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చును. చేయు వ్యవహారాలు తెలివిగా వ్యవహరించవలెను.గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
Zodiac Sign
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. మిత్రులతో మాటపట్టింపులు. శారీరకంగా మానసికంగా బాగుంటుంది. కీలక వ్యవహారాల యందు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. తలపెట్టిన అన్ని పనులు అనుకున్నట్లుగా జరుగును. పెట్టిన పెట్టుబడులకు మించి ధన లాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. గృహమునందు ఆనందకరమైన వాతావరణం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. సంఘమునందు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు. ఉద్యోగమునందు పై అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వారాంతంలో బంధుమిత్రులతో నూతన ప్రయత్నాలు గురించి ఆలోచనలు చేస్తారు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
Zodiac Sign
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కీలకమైన విషయాలలో ధైర్యంగా ముందడుగు వేయండి. కుటుంబ సభ్యులు యొక్క మద్దతు మీకు ఉంటుంది. అనవసరమైన విషయాలతోటి సమయం వృధా చేయకండి. కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగించును. చెడు అలవాట్ల వలన కొత్త సమస్యలు ఏర్పడగలరు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించవలెను. వృత్తి వ్యాపారమందు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించును. వివాదాలకు దూరంగా ఉండండి. తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడతాయి. భూ గృహ క్రయవిక్రయాలు వాయిదా వేట మంచిది. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండును. జీవిత భాగస్వామి తోటి కొద్దిపాటి మనస్పర్ధలు కలగవచ్చు. దీర్ఘకాలిక సమస్యలు తీరి కొంతమేర ప్రశాంతత లభించును. బంధుమిత్రులతో తత్సంబంధాలు మెరుగుపడతాయి. వారాంతంలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యమునందు శ్రద్ధ వహించవలెను. గులాబీ, నేరేడురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
Zodiac Sign
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
వారం మధ్యలో ధనవ్యయం. శుభవార్తల వింటారు. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో నూతన ప్రయత్న కార్యాలకు గురించి చర్చిస్తారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన అన్ని పనులలో విజయం సాధిస్తారు. కీలక పనుల యందు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘమునందు మీ మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించవలెను చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. వారాంతంలో పెట్టిన పెట్టుబడులకు మించి ధన లాభం కలుగుతుంది. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
Zodiac Sign
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
వారం చివరిలో మాన సిక ఆందోళన. కుటుంబ జీవితం ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు నుండి బయటపడి ప్రశాంతత లభించును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు. విలాస వస్తువులు కొనుగోలుకు అధిక ధనం చేస్తారు. ఉద్యోగమునందు పని ఒత్తిడిలు ఎన్ని ఉన్న అధికమించి ఉత్సాహంగా చేస్తారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొన్ని సమస్యలు మానసిక మానసికంగా బాధ కలిగించవచ్చును. గృహమునందు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. వారాంతంలో వ్యాపారం నందు కొద్దిపాటి నష్టం కలిగించవచ్చును. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
Zodiac Sign
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
వారం ప్రారంభంలో ధనవ్యయం. భార్య భర్తల మధ్య కొద్దిపాటి మనస్పర్ధలు రావచ్చును. అధిక కోపం వలన కొన్ని కొత్త సమస్యలు ఏర్పడగలవు. కొంత సమయాన్ని పిల్లలతోటి సరదాగా గడపండి. ఆరోగ్య సమస్యలు మీద తగు శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగం నందు పై అధికారుల యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆకస్మిక అధిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఇతరుల యొక్క విషయాలలో జోక్యం చేసుకోవద్దు ఈ కారణం చేత మీయొక్క గౌరవం తగ్గుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాధి పనులు ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపార యందు ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. నీలం,ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
Zodiac Sign
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
వారం చివరిలో ధనవ్యయం. ఉద్యోగ వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి వాదనలు వలన కొత్త సమస్యలు ఏర్పడతాయి. కొన్ని కీలకమైన సమస్యలు బుద్ధిబలంతోటి పరిష్కరించుకోవాలి. పనుల యందు శ్రమ ఎక్కువగా ఉంటుంది. విలువైన వస్తువుల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చేయ ఖర్చుల యందు జాగ్రత్త వహించాలి. సంఘం నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. జీవిత భాగస్వామి తోటి కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడగలరు. దీర్ఘకాలిక సమస్యలతో ప్రశాంతత లభించు.ను ప్రయాణాలు తగు జాగ్రత్త వహించాలి. ఉద్యోగమునందు సహోద్యోగులు వలన సహాయ సహకారాలు లభించును. మీరంటే గిట్టని వారి తోటి కొద్దిపాటి అపకారం జరగవచ్చు జాగ్రత్త. తలపెట్టిన పనులు పూర్తగును. ఉద్యోగాలలో బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
Zodiac Sign
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. గతంలో పెట్టిన నుండి మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగమనందు పెద్దల యొక్క మన్ననలు లభించను. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఇతరులతో వాదనలు మానండి. లేదంటే కొత్త సమస్యలు ఏర్పడగలవు. కొత్త సమస్యలు చికాకు పుట్టించును. దీర్ఘకాలిక అనారోగ్యములు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. వృత్తి వ్యాపారం యందు కొద్దిపాటి ధన నష్టం కలుగవచ్చు. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకొనవలెను. మనసునందు ఆందోళనకరంగా ఉంటుంది. గృహ నిర్మాణాధిపనులో ఆటంకాలు ఏర్పడవచ్చు. వారాంతంలో భార్యాభర్తల మధ్య కొద్దిపాటి మనస్పర్ధలు రావచ్చును. ఉద్యోగస్తులకు పనిభారం మీదపడి ఉక్కిరిబిక్కిరి కాగలరు. తెలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తస్తోత్రాలు పఠించండి.