
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన వారములు॥ ఆది గురు శుక్ర
అనుకూలమైన తేదీలు ॥ 3-6-9
పనులన్నీ సకల పూర్తి అవుతాయి. వ్యాపారం లాభసాటిగా జరుగుతాయి. రావలసిన బాకీలు వసూలు అగును. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు రావచ్చును. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలు కేసులు అనుకూలంగా ఉండును. కొత్త పరిచయాలతోటి సమస్యలు పరిష్కారం అగును. కుటుంబ సౌఖ్యం లభించును. ఆరోగ్య సమస్యల తీరి దేహారోగ్యం కలుగును. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు వారాంతం లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మిత్రులతోటి సఖ్యతగా ఉండాలి. విపత్తులు సమస్యలు ఏర్పడను.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన వారములు॥ ఆది -గురు -శుక్ర
అనుకూలమైన తేదీలు ॥ 3-9-12
ముఖ్యమైన పనులు వాయిదా పడును. సంఘమునందు నిందారోపణలు ఏర్పడగలవు. ప్రయాణమునందు జాగ్రత్తలు పాటించవలెను. శారీరక శ్రమ పెరిగి శరీరానికి ప్రశాంతత లోపిస్తుంది. రావలసిన బాకీలు స్తబ్దత ఏర్పడుతుంది. సెటిల్మెంట్ వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయవలెను. సంతానం తోటి విరోధాలు ఏర్పడవచ్చును. సోదర సోదరీల తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. అకారణంగా కలహాలు ఏర్పడగలవు. మానసికంగా నిరుత్సాహంగా ఉండును. కుటుంబ సభ్యులకి దూరంగా ఉండవలసి వస్తుంది. ఆరోగ్య సమస్యలు రావచ్చు. వృత్తి వ్యాపారము నందు ఆశించిన ధనలాభం కనబడదు. ఉద్యోగమునందు పై అధికారులు ఒత్తిడిలో ఎక్కువగా ఉండను. భూ గృహ క్రయ విక్రయాలు వాయిదా వేయటం మంచిది. శత్రువుల తోటి అపకారం పొంచి ఉన్నవి . వారాంతం లో జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారంలో అభివృద్ధి కనబరుస్తారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది.
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ ఆది- గురు -శుక్ర
అనుకూలమైన తేదీలు ॥ 5-6-9
కుటుంబ కలహాలు ఏర్పడవచ్చు. సమస్యల యందు తొందరపాటు నిర్ణయాలు లేకుండా సమస్యలను చక్క పెట్టవలెను. వాధ ప్రతివాదములకు దూరంగా ఉండడం మంచిది. మానసిక వేదన పెరుగును. కొన్ని సంఘటనలు ఉద్రేకాలు లకు దారి తీయను. మిత్రులతోటి కలహాలు ఏర్పడవచ్చు. ఆకస్మిక పరిణామాలు కలిగి ఆందోళన కలిగిస్తాయి. స్థిరాస్తులు క్రయ విక్రయాల యందు ప్రతిబంధకాలు ఏర్పడగలవు. ఉద్యోగమునందు అధికారులతోటి మనస్పర్ధలు రావచ్చును. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం కలుగుతుంది. అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్యల యందు కుటుంబ సభ్యులు కలసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా సామాజికంగా బలహీనపడతారు. వారాంతం లో అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం లభించును. ఉద్యోగమునందు అధికార అభివృద్ధి కలుగును.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
అనుకూలమైన తేదీలు ॥ 1-2-4-7
గృహమునందు శుభకార్యా చరణ. విద్యార్థులకు అనుకూలము. ఆరోగ్యపరంగా సామాన్య స్థితి ఉండును.
బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసి మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. సమాజము నందు ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు పెరుగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. చేయ పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. పూర్తి వ్యాపారాలు యందు లాభసాటిగా జరుగుతాయి. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు రావచ్చును. దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. వివాహక జీవితం ఆనందంగా గడుపుతారు. నూతన అవకాశాలను పొందుతారు. భూ గృహ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. వారాంతం లో ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
అనుకూలమైన తేదీలు ॥ 2-4-7
ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యర్ధులు పై పైచేయి సాధిస్తారు. మిత్రులతోటి కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం నందు ఊహించిన ధన లాభం కలుగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. బంధు వర్గం తోటి సత్సంబంధాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక సమస్యల తీరి ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభించును. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కొన్ని సమస్యలలో కుటుంబ వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగమునందు అధిక పని ఉన్నా అధికమించి ఉత్సాహంగా చేస్తారు. వారాంతం లో కుటుంబ సమస్యలు వలన మానసిక ఉద్రేకత పెరుగును. ఉద్యోగమునందు అధికారులతోటి విరోధాలు ఏర్పడవచ్చును. ఆకస్మిక పరిణామాలు ఏర్పడి మానసిక వేదన పెరుగును.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం
అనుకూలమైన తేదీలు ॥ 3-5-9
మనసునందు అనేక ఆలోచనలతోటి తికమకగా నుండుట. చేయ పనుల యందు అలసత్వం పెరుగుతుంది. దీర్ఘాలోచనతోటి సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపార భాగస్వాముల వలన ఇబ్బందులు కలుగును. కొన్ని సంఘటనలు వలన నిరాశ నిస్పృహలకు గురవుతారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. సమాజము నందు కోపాన్ని అదుపు చేసుకొని వ్యవహరించవలెను. చేయు ఖర్చు యందు నియంత్రణ అవసరము. వాహన ప్రయాణాలయంలో జాగ్రత్తలు తీసుకొనవలెను. ఉద్యోగ వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఆలోచనలు ఎక్కువగా చేసినాఅమలులో పెట్టలేక పోతారు. కుటుంబం పట్ల తగు శ్రద్ధ వహించవలెను. వారాంతం లో ఊహించిన ధన లాభం కలుగును. సంఘమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. సుఖ సౌఖ్యాలు పొందగలరు
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర
అనుకూలమైన తేదీలు ॥ 3-9-12
వృత్తి వ్యాపారమునందు అప్రమత్తత అవసరము. సమస్యల యందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళవలెను. తొందరపాటు నిర్ణయాలు వలన కొత్త సమస్యలు ఏర్పడగలవు. ఉద్యోగమునందు గందరగోళంగా నుండును. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకొనవలెను. గృహమునందు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడగలవు. ప్రయాణాలయందు ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. సమాజము నందు అపవాదములు ఏర్పడగలవు. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకొనవలెను. మనసునందు అనేక ఆలోచనలతోటి ఆందోళనకరంగా ఉంటుంది. భూ లావాదేవీలు వాయిదా వేయడం మంచిది. ఋణ సమస్యలు పెరుగును. కొన్ని సంఘటనలు బాధ కలిగించును. వారాంతం లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. ఉద్యోగమునందు ఒత్తిడిలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
అనుకూలమైన తేదీలు ॥ 3-6-9
తలపెట్టిన కార్యాలలో విజయం చేకూరును. శారీరక శ్రమ తగ్గి బలపడతారు. వృత్తి వ్యాపారాల యందు రాబడి పెరుగుతుంది. చేయ పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును.
రావలసిన బకాయిలు చాకచక్యంగా వ్యవహరించి వసూలు చేసుకొనవలెను. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగమునందు అధికారుల అభిమానాలు పొందగలరు. కీలకమైన సమస్యలు పరిష్కార మార్గాలు అన్వేషణ చేస్తారు. వారాంతం లో నిరాశ నిస్పృహలకు లోనవుతారు. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడగలవు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడును. అనవసరమైన ఖర్చులు పెరుగును.
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ
అనుకూలమైన తేదీలు ॥ 3-6-9-12
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును. మిత్రులతోటి సఖ్యతగా మెలగవలెను లేదా దూరమగుదురు. ఆవేశాలు తో చేయ పనులలో ఆటంకాల ఏర్పడగలవు. దీర్ఘకాలిక అనారోగ్యములు వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగమునందు పని ఒత్తిడి అధికంగా ఉండును. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. నమ్మిన వారి వలన సమస్యలు ఏర్పడగలవు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తగలవు. ఇతరులతోటి వాగ్వాదములకు దూరంగా ఉండండి. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. మనసునందు అనేక ఆలోచనలతోటి చికాకుగా నుండును. జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వారాంతం లో బుద్ధి కుశలత లేక తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి నష్టం కూడా చేకూరును. మనసునందు అనేక విధాలుగా ఆలోచనలతోటి భయంగా నుండును. వారాంతం లో అనుకూలమైన ఫలితాలు ప్రాప్తించగలవు. వ్యవహారములు యందు మృదు సంభాషణ చేస్తూ వ్యవహారాన్ని చక్కపెట్టుకుంటారు. నూతన వాస్తవాహనాది కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
అనుకూలమైన తేదీలు ॥ 2-3-6-7
శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించడం. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.సమాజము నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. ఉద్యోగమునందు అధికారుల ఒత్తిడిలో తగ్గి ప్రశాంతత లభిస్తుంది.బహుమానాలు అందుకుంటారు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల యొక్క ఆదరణ పొందగలరు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. కీలకమైన సమస్యల యందు తల్లిదండ్రుల సూచనలు తీసుకోవాలి. నిరుద్యోగులకు అనుకూల వార్తలు వింటారు. నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. నూతన వస్తూ వాహనాది విలాసవంతమైన వస్తువుల కొరకు అధికంగా ఖర్చు చేస్తారు. వారాంతం లో సుఖ సౌఖ్యాలు పొందుతారు. ప్రారంభమై ఆగిన పనులు పూర్తగును. మానసిక శారీరక శ్రమ తగ్గి సుఖం లభిస్తుంది.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
అనుకూలమైన తేదీలు ॥ 2-3-6-7
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరుల మీద ద్వేష అసూయాలు పెరుగును. ఆకస్మిక పరిణామాలు విపత్తులు ఏర్పడవచ్చు. సమస్యల వలన మనసు నందు బాధ ఏర్పడును. మిత్రుల తోటి మనస్పర్ధలు ఏర్పడగలవు. అనుకోని ఖర్చులు పెరిగి ఆందోళనకు గురవుతారు. తలపెట్టిన పనులలో ప్రతిబంధకాలు ఏర్పడను. వచ్చిన అవకాశాల్ని అహంభావంతోటి లేదా కోపంతో పి వదులుకుంటారు. శారీరకంగా మానసికంగా బలహీనపడతారు. ఉద్యోగమునందు పై అధికారులతోటి కలహాలు ఏర్పడను. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరము. వృత్తి వ్యాపారాలు మందగమనం గా నడుస్తాయి. కీలకమైన సమస్యలు పరిష్కార మార్గాలు దీర్ఘాలోచన చేసి తగు నిర్ణయాలు తీసుకొనవలెను వారాంతం లో ఆకస్మిక ధన లాభం. ఉద్యోగమునందు అధికారుల ఆదరణ పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సమాజం నందు గౌరవం లభించును.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ
అనుకూలమైన తేదీలు ॥ 6-7-9-12
చేయవృతి వ్యాపారమునందు అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగును. దీర్ఘకాలిక అనారోగ్యాలు నశించి ఆయురారోగ్యాలను పొందుతారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. కుటుంబం నందు ఆనందకరమైన ఆహ్లాదకరంగా ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లాభిస్తాయి. మనసునందు ఉన్న ఆలోచనలు ఆచరణలోకి తీసుకుని వస్తారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. వివాదాలు కోర్టు కేసులు పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి.ఇంటా బయట గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పట్టదలతో విద్యలో రాణిస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నూతన పథకాలపై దృష్టి సారిస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ధనాధాయ మార్గాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలించును. వారాంతం లో ఆరోగ్యం నందు తగు జాగ్రత్తలు అవసరము. తలపెట్టిన పనులు పట్టుదలతోటి పూర్తి చేయాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనవలెను. మిత్రులతోటి సఖ్యతగా మెలగవలెను.
.