
వార ఫలాలు :17 సెప్టెంబర్ 2023 నుంచి 23 సెప్టెంబర్ 2023 వరకూ
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
ఈవారం చంద్రుడు కళత్రస్థానమునందు సంచారం. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందుతారు. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. శరీర సౌఖ్యం లభిస్తుంది. సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు. కొంత కాలముగా పడిన శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించును. వ్యవహారాలలో ఊహించని విజయం సాధిస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది.వివాదాల నుంచి బయటపడతారు. తలపెట్టిన అన్ని పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తి చేస్తారు.దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. బంధు మిత్రులతో తత్ సంబంధాలు మెరుగు పడును. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభించును. శుభవార్తలు వింటారు. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది.వృత్తి వ్యాపారములందు ధన లాభం కలుగుతుంది.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
ఈ వారం చంద్రుడు శత్రు స్థానం నందు సంచారము. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.వ్యాపారులు యందు నూతన పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలముగా ఉండును.ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పనులు జాప్యం లేకుండా పూర్తి అగును. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ప్రముఖు లతో పరిచయాలు వలన పనులన్నీ సక్రమంగా జరుగును. భూవివాదాలు పరిష్కారం అగును . వివాదాలు తీరి ప్రశాంతత లభిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా నూతన అవకాశాలు సాధిస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉండును.జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రములు:-(కా-కి-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఈవారం చంద్రుడు పంచమ స్థానము నందు సంచారము. ఈ సంచారము వలన వ్యతిరేక ఫలితాలు కలుగును. చేయు పనులలో అశ్రద్ధ పెరిగి ఆటంకముల ఏర్పడను. అనారోగ్య సమస్యలు రాగలవు.భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గును.ఉద్యోగము నందు పై అధికారుల ఒత్తిడిలు పెరుగును.ఆకస్మిక ఖర్చులు ఆందోళనకు గురిచేస్తాయి.ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారము నందు పెట్టుబడులను పెద్దవారి యొక్క సూచనలు మేరకు పెట్టుబడులు పెట్టవలెను . వచ్చిన అవకాశాలను అందుపుచ్చు కోవాలి. మనసునందు ఆందోళనగా ఉంటుంది. గృహమునందు ప్రతికూలత వాతావరణం. బంధు మిత్రులతో మనస్పర్ధలు.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని సమస్యల వలన ధనం వృధాగా ఖర్చులు ఏర్పడతాయి. రావలసిన బాకీలు తెలివిగా వసూలు చేసుకోవాలి.చేయు పనుల యందు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రములు:-(హీ-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
ఈ వారం చంద్రుడు చతుర్థ స్థానమునందు సంచరించును. ఈ సంచారం వలన దోష ఫలితాలు కలుగును. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతోటి అకారణంగా విరోధాలు రాగలవు. ముఖ్యమైన పనులు వాయిదా పడును. సంఘము నందు నిందారోపణలు ఏర్పడగలవు. ప్రయాణము నందు జాగ్రత్తలు పాటించవలెను. శారీరక శ్రమ పెరిగి శరీరానికి ప్రశాంతత లోపిస్తుంది. రావలసిన బాకీలు స్తబ్దత ఏర్పడుతుంది. సెటిల్మెంట్ వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయవలెను. సంతానం తోటి విరోధాలు రాగలవు. ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు. మానసికంగా నిరుత్సాహంగా ఉండును. కుటుంబ సభ్యులకి దూరంగా ఉండవలసి వస్తుంది. వృత్తి వ్యాపారము నందు ఆశించిన ధనలాభం కనబడదు. ఉద్యోగమునందు పై అధికారులు ఒత్తిడిలు ఎక్కువగా ఉండను. శత్రువుల తోటి అపకారం జరగవచ్చు.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మే-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
ఈ వారం చంద్రుడు తృతీయ స్థానము నందు సంచరించును. ఈ సంచారం వలన అనుకూల శుభ ఫలితాలు పొందగలరు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.బంధువుల యొక్క ఆదరణ అభిమానాల పొందగలరు. ఉద్యోగమందు అధికార అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి వినోద యాత్రలు చేస్తారు. చేయి వ్యవహారము యందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. ఆర్థికంగా బాగుంటుంది.కీలకమైన సమస్యలు పరిష్కారమగును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.అనుకున్న పనులు అనుకొనట్లుగా పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి.పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు .దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఢ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఈ వారం ధన స్థానము నందు చంద్ర సంచారం. ఈ సంచారము వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగును.ఈ వారం మిశ్రమ ఫలితాలు పొందుతారు. తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు రాగలవు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కొంత ఋణం చేయవలసి వస్తుంది. ప్రయత్నించిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారమునందు శారీరక శ్రమ పెరుగుతుంది. సమాజం నందు ప్రజాభిమానం పొందగలరు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరము. వచ్చిన అవకాశాలని చేజార్చ కూడదు. అనవసరమైన సంభాషణలు ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగమనందు అధికార తోటి సమస్యలు రాగలవు.బంధవర్గం తోటి కలహాలు. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి అగును.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రే-రో-త-తీ-తూ-తే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
ఈవారం చంద్రుడు జన్మ రాశి లో సంచరించును. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందగలరు. శరీర సౌఖ్యం లభిస్తుంది.జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు.సంతానం అభివృద్ధి కొరకు తీసు కున్న నిర్ణయాలు ఫలిస్తాయి.సమాజము నందు పెద్దల యొక్క ఆదరణ అభిమానాలు పొంద గలరు. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఆనందంగా గడుపుతారు. సంతోషకరమైన వార్తలు వింటారు.ఆదాయ మార్గాలు బాగుంటాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. చేయు వ్యవహారము నందు అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
ఈ వారం గోచార రీత్యా చంద్రుడు వ్యయ స్థానము నందు సంచరించును. ఈ సంచారము వ్యతిరేక ఫలితాలు ఇవ్వగలడు. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకములు ఏర్పడను.ఇతరులు తో అనవసరమైన గొడవలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం నందు అధికారుల నిందారోపణలు రాగలవు. అనవసర మైన ఖర్చులు పెరుగును. శారీరకంగా మానసికంగా బలహీనంగా నుండును. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. సహోద్యోగులతో విభేదాలు రాగలవు. కుటుంబ బాధ్యతలు పెరుగును.మనస్సు నందు ఆందోళనగా ఉండును.జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావచ్చు. చేయు పనియందు శారీరక శ్రమ పెరుగుతుంది. తలపెట్టిన పనులలో అవాంతరాలు ఎదురైనా పట్టుదలతోటి పూర్తి అగును.
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రములు:-(యే -యో-య-బా-బి-బూ-ధా-భా-ఢా-బే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ఈ వారం చంద్రుడు లాభ స్థానము నందు సంచారము. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందుతారు. స్త్రీ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలించును. వృత్తి వ్యాపారాలలో ధనలాభం పొందగలరు.వృత్తి వ్యాపారములు యందు అనుకున్న విధంగా అభివృద్ధి సాధిస్తారు. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అగును. సహోద్యోగులు మరియు పై అధికారుల ఆదరణ అభిమానాలు పొందగలరు.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.గృహము నందు ఆహ్లాదకర మైన వాతావరణం. జీవిత భాగస్వామి తోటి ఆనందం గా గడుపుతారు. బంధుమిత్రుల యొక్క కలయిక. ప్రభుత్వ సంబంధిత అధికారులు మరియు పెద్దల యెక్క సహాయ సహకారాలు పొందుతారు. విద్యార్థు లకు ఊహించని అవకాశాలు పొందగలరు. నూతన వస్తు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రములు:-(బో-జా-జి-జూ-జే-జో-ఖా-గా-గీ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
ఈ వారం చంద్రుడు రాజ్య స్థానము నందు సంచరించిను. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. ఉద్యోగం నందు అధికార అభివృద్ధి కలుగును. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అగును.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మిత్రులు సహాయం లభిస్తుంది.వృత్తి వ్యాపారం యందు ధనలాభం కలుగుతుంది. మానసికంగా శారీరకంగా బలపడతారు.ఇంటి యందు మరియు బయట కూడా మృదువుగా మాట్లాడుతూ వ్యవహారాల ను చక్కబెట్టుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటా రు. సమాజము నందు సత్కారాలు పురస్కారాలు పొందగలరు. సోదర సహోదరుల సహాయ సహకారాలు వలన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. బంధు వర్గం తోటి అకారణంగా విరోధాలు ఏర్పడే అవకాశం కలదు.దుష్టసావాసాలకు దూరంగా ఉండవలెను. చేయు పనులలో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మానసికంగా ఆందోళన గా ఉంటుంది .అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రాగలవు.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
ఈ వారం చంద్రుడు భాగ్యస్థానం నందు సంచరించిను. ఈ సంచారం వలన వ్యతిరేక ఫలితాలు కలుగును. శారీరక పీడ అధికంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగును. చేయు పనులలో అలసత్వం పెరుగుతుంది.కోపాన్ని అదుపు అదుపులో ఉంచుకుని వ్యవహరించవలెను. ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు మాటలు తూలకొండ చూసుకోవాలి. బంధుమిత్రులతోటి కొద్దిపాటి మనస్పర్ధలు రావచ్చు. మానసికంగా బలహీనంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొద్దిగా ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవసరానికి ఏదో విధంగా ధనం చేకూరుతుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. తలపెట్టిన పనులలో పట్టుదల తోటి పూర్తి చేయాలి. గృహము నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రములు:-(ది-దు-శ్యం-ఝా-థా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ఈవారం చంద్రుడు అష్టమ స్థానము నందు సంచారం. ఈ సంచారం వలన ప్రతికూల ఫలితాలు ఏర్పడును. మానసిక ఉద్రేకతలు పెరుగుట. ఆకస్మిక పరిణామాలు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంటా బయట గౌరవం తగ్గను . చేయు పనుల యందు ప్రతిబంధకాలు ఏర్పడతాయి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని సమస్యలు వలన మనసునందు చికాకుగా ఉంటుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. చెడు వార్తలు వినడం వలన బాధ కలుగుతుంది. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉంటాయి. ఇతరులతోటి సంభాషణలు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి.కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.