Weekly Horoscope: ఈ రాశివారికి వారం మధ్యలో ధన, వస్తులాభం

First Published | Jun 12, 2022, 10:00 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. స్వశక్తి పై జీవించాలన్న పట్టుదల అధికమవుతాయి.

Daily Horoscope 2022 - 24

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

ఈ వారం ఈ రాసి వారికి కలిసి వచ్చే కాలం. కొత్త  కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో  పనిభారం మరింత తగ్గుతుంది. కళాకారులకు అన్ని విధాలా అనుకూలం.  వారం మధ్యలో బంధువిరోధాలు. పనిఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. . ఉపాధ్యాయులకు విద్యార్థుల అత్యుత్సాహం వల్ల ఊహించని చికాకు లెదుర్కోవలసి వస్తుంది. స్త్రీల ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించగలరు. శివారాధన మంచిది.


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

ఈ రాసి వారికి  ఇంట్లో శుభకార్యాలపై చర్చలు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. శస్త్రచికిత్సల సమయంలో డాక్టర్లకు ఏకాగ్రత చాలా అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి.  ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాలబాట పడతారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం.  రాజకీయవర్గాలకు కొన్ని విజయాలు వరిస్తాయి. వారం చివరిలో బంధువులతో తగాదాలు. అనారోగ్యం.  ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

ఈ వారం మధ్యలో ఈ రాసి వారు  సేవాకార్యక్రమాలపై దృష్టి పెడతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు సమకూర్చుకుంటారు. బ్యాంకు వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. కొనుగోళ్ళ విషయంలో ఏరాగ్రత వహించండి. అధికారులకు తనిఖీలు, పర్యటనలతో తీరిక ఉండదు. ఉద్యోగస్తులకు ఒక అవకాశం చేతిదాకా వచ్చివెనక్కిపోయే ఆస్కారం ఉంది. ఇంట్లో శుభకార్యాల సందడి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో ధననష్టం. అనారోగ్య సూచనలు. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
 
్ చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలు అనుకూలించకపోవటం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో  ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు.  వారం మధ్యలో బంధువులతో కలహాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది.  హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
 

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
 
వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి.  ఖర్చులు అధికమైనా మీ ఆర్థిక స్థితికి ఏమాత్రం లోటుండదు. వృత్తి, ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయా లేర్పడతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలు లాభాలదిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాల శ్రమ ఫలిస్తుంది.  అనుకోని ధనవ్యయం.  దుర్గాస్తోత్రాలు పఠించండి.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):

 ఈ వారంలో  మిత్రులతో విందులు, వినోదాలు సాగిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు.  మీ సంతానం వైఖరి ఆందోళన కలిగిస్తుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి.వివాహయత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. వ్యాపారాలు సమయానికి విస్తరిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో మానసిక ఆందోళన. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి. 
 

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ వారంలో మీ కుటుంబంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న  వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఖర్చులు అధికమైనా మీ ఆర్థిక స్థితికి ఏమాత్రం లోటుండదు. వృత్తి, ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయా లేర్పడతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. కొన్ని ముఖ్య సమావేశాలకు హాజరవుతారు. ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారాలలో సమస్యలు, చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక ఆందోళన.  నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

  ఈ వారంలో మీ ఇంట్లో మీకు పూర్తి అనుకూల పరిస్థితులు. మీరు ఆశించే నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. మీ సంతానం వైఖరి ఆందోళన కలిగిస్తుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి. సమావేశాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కవచ్చు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. ఇంటాబయటా ఒత్తిడులు.   విష్ణుధ్యానం చేయండి.

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
 
ఈ వారంలో మీకు ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.  ఇతరులకు మేలు చేసినా విమర్శలు తప్పవు. మీ శ్రమకు లభించిన ప్రతిఫలంతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు పై అధికారులతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. కొన్ని శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో  అవాంతరాలు తొలగి ముందడుగు వేస్తారు.  కళారంగం వారు  ఊహించని అవకాశాలు పొందుతారు. వారం ప్రారంభంలో  వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం.  విష్ణుధ్యానం చేయండి. 

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ వారంలో మీరు మీకు ఇష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంగారం, వెండి, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు.  ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో గందరగోళం తొలగుతుంది. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయా లేర్పడతాయి.  విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. ఆధ్మాత్మిక సమావేశాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం.వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్య సూచనలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు.   హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3): 

ఈ వారం మధ్యలో ఓ ముఖ్యమైన కార్యంలో వాక్చాతుర్యంతో వ్యతిరేకులను సైతం మెప్పిస్తారు.  మీ సంతానం వైఖరి ఆందోళన కలిగిస్తుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. ఎటువంటి బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. కనకధారా స్తోత్రాలు పఠించండి.
 

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

ఈ వారంలో కొన్ని ముఖ్య వ్యవహారాలలో రాజీమార్గం తప్పనిసరి కావచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. నోటీసులు, రశీదులు అందుకుంటారు. విద్యార్జనులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సుతో మంచి అవకాశం లభిస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. క్రయ విక్రయాల్లో మెలకువ వహించండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో బదిలీలు అనివార్యం కావచ్చు.  కళారంగం వారికి∙గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో ధన, వస్తులాభాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.  నృసింహస్తోత్రాలు పఠించండి.
 

Latest Videos

click me!