26న సూర్యగ్రహణం: ఏ రాశివారిపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది?

First Published Dec 24, 2019, 7:32 PM IST

డిసెంబర్ 26 గురువారం రోజున సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సంధర్భంగా వివిధ రాశుల వారి రాశిపలాలు ఎలాగున్నాయో తెలుసుకోవాలంటే ఈ  స్టోరీని చదవండి.  

డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
undefined
ధనస్సురాశి ద్వి స్వభావరాశి. అగ్ని తత్వరాశి. రాశి అధిపతి గురుడు. అందులోనే శని కేతువులతో కలిసి ఉండడం ధనస్సురాశి లోకి రవి సంక్రమణం వలన అస్తంగత్వం చెందడం, అదే సమయంలో గండాంత నక్షత్రం మీద సూర్య గ్రహణం ఏర్పడడం కొంత చికాకు, ఆందోళన, ఒత్తిడి కలిగింస్తాయి. మనిషికి సహజంగా జ్ఞానం వైపు అడుగులు పడవు. రవి మరియు శని ఒకే రాశిలో ఉండటం వలన మనస్సుకు వ్యతిరేకమైన ఆలోచనలను రేకెత్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసికమైన అహం తలెత్తే అవకాశం కుడా ఉంది. అమావాస్య రోజుల్లో చంద్రుని వలన బుద్ధి ప్రకాశవంతంగా ఉండక కల్లోలానికి గురవుతారు. ద్వి స్వభావ రాశులలో గ్రహ సంచారం వలన విద్య, ఉద్యోగాలు, అభివృద్ధి, స్థాన చలనము మొదలగు మార్పులను గమనిస్తూ ఉంటాం.
undefined
అగ్నితత్వరాశి అయిన ధనురాశిలో ఈ షష్ట గ్రహ ప్రభావము వలన మనిషి మానసిక శక్తికి పరీక్షలాంటిది. కోరికలను అదుపులో పెట్టుకుంటే ఈ పరీక్ష సులువుగా దాటగలం. అదే సమతులనం కోల్పోతే రానున్న రోజుల్లో తప్పకుండా ఇబ్బందికి గురవుతారు. కేతువు బంధాలను విడదీయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కనక క్షణికమైన ఆవేశాలకు తావు ఇవ్వకుండా సహనం, మౌనమే ప్రధాన ఆయుధంగా పరిస్థితులను గెలవాలి. అప్పుడే బంధాలను, బాధ్యతలను కాపాడుకోగలుగుతాము. ఈ వచ్చే కాలాన్ని అంతర్ముఖంగా ఆత్మ శోధన చేసుకోవడానికి ఉపయోగించుకున్న వ్యక్తులు తప్పకుండా సానుకూల ఫలితాలు పొందుతారు.
undefined
డిసెంబరులో సూర్య గ్రహణ ప్రభావం వలన ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. ప్రతి వ్యక్తీకి వ్యక్తిగతంగా వారి జాతక ఆధారంగా జరుగుతున్న దశ, అంతర్దశ, నక్షత్ర ప్రభావము, రాశి, లగ్నంను బట్టి ఫలితాలు నిర్ణయం అవుతాయి. మన మనోభావాలను సానుకూల దృక్పథంతో నడిపించడానికి ఈ గోచార ఫలితాలను పరిశీలించవలసి ఉంటుంది. గోచర గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు పుట్టిన తేది ఆధారంగా వ్యక్తీ గత జాతక పరిశీలన చేయించుకుని పరిహారాలు తెలుసుకుని ఆచరించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
undefined
మేషరాశి వారికి :- అష్టమాధిపతి స్వ రాశిలో ఉండటం వలన సానుకూల ఫలితాలు తప్పకుండా వస్తాయి. మానసిక పరమైన ఆలోచనలో మార్పు గోచరిస్తుంది. జనవరి నుండి మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వెలుగులోకి తీసుకు వచ్చి కొత్త సంవత్సరం ప్రారంభాన్ని అభివృద్ధి ప్రయాణం ఆనందంగా గడపండి.
undefined
వృషభరాశి వారికి :- అష్టమ భావములలో ఏర్పడుతున్న గ్రహముల కూటమి ప్రభావం వలన జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సప్తమాధిపతి కుజుడు తన రాశిలో ఉండటం వలన కుటుంబ సభ్యుల సహకారాన్ని అందిపుచ్చుకుని సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు.
undefined
మిధునరాశి వారికి :- ఆవేశం తప్పక అదుపులో పెట్టుకుని మృదువైన మాట తీరుతో కాలం గడపండి. తొందరపడి బాంధవ్యాలను తెంచుకోకండి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. త్వరలో మీరు స్థిరమైన బంధాలను ఏర్పరచుకోవడానికి చక్కని అవకాశం ఉంది. వచ్చే సంవత్సరంలో మీ మాట బలం వలన మంచి ఫలితాలు పొందుతారు.
undefined
కర్కాటకరాశి వారికి :- ఏలాంటి ఆలోచనలు ఉంటాయో ఫలితాలు కూడా అదే విధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కనుక సానుకూల దృక్పథంతో అన్ని అనుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగండి. అదృష్ట కాలాన్ని అనవసరమైన అనుమానాలతో పాడు చేసుకోకండి. మానసికమైన ఆందోళనలు దరిచేరకుండా భక్తీ , ధ్యాన మార్గంలో ప్రయాణించండి.
undefined
సింహరాశి వారికి :- ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగాల విషయాలలో జాగ్రత్త వహించండి. జనవరి నుండి మీకు మీ సంతానానికి తప్పకుండా లక్ష్యం సాధించడానికి సంపూర్ణమైన అవకాశం వస్తుంది. తాత్కాలికంగా ఏర్పడిన ఇబ్బందులను, పరిస్థితులను మనో ధైర్యంతో ఎదుర్కోవడం మీ మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఒత్తిడిని సానుకూలంగా మార్చుకుని విజయం సాధించడం మీ చేతుల్లోనే ఉంది.
undefined
కన్యా రాశి వారికి :- అర్ధాష్టమ శని తొలగిపోయే రోజులు. ఈ ఒత్తిడిని తట్టుకుని అనుకూలంగా మార్చుకోగలిగితే విజయం మీదే. ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనేది వీరి చేతుల్లోనే ఉంటుంది. అదృష్ట సమయం అని చెప్పాలి.
undefined
తులారాశి వారికి :- ద్వితీయ అధిపతి కుజుడు ద్వితీయములోనే ఉండటం వలన సుఖమైన కాలం. అభివృద్ధిదాయకం. శాంతి, సౌఖ్యం. ప్రస్తుత పరిణామాలను గమనిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసుకోండి .
undefined
వృశ్చికరాశి వారికి :- రాజ్యాధిపతి కుజుడు స్వంతరాశిలో ఉండటం వలన ద్వితీయ అధిపతి గురుడు ద్వితీయంలో ఉండటం వలన రాబోయే సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇదొక అదృష్ట సమయం అని చెప్పవచ్చును.
undefined
ధనస్సురాశి వారికి :- అత్యంత ఒత్తిడి, ఆందోళన, స్థిరత్వం లేకపోవడం కనబడుతుంది. ఇది పరీక్షా కాలమే అని చెప్పవచ్చు. జరుగుతున్న పరిణామాలను మనసుకు పట్టించుకోకుండా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే మీరు తప్పకుండా వచ్చే సంవత్సరం నుండి ప్రశాంతంగా ఉంటారు.
undefined
మకరరాశి వారికి :- చేసే పనులలో గుర్తింపు పొందలేరు, అత్యధిక వ్యయం. నిరాశ చెందకుండా జనవరి మాసం వరకు కాలం గడపడం వలన మంచి ఫలితాలు ఏర్పడతాయి. మీ ఓరిమియే మీకు శ్రీరామరక్ష.
undefined
కుంభరాశి వారికి :- అత్యంత అదృష్టమైన కాలంగా చెప్పుకోవచ్చును. అన్ని గ్రహాలు కలసి ఒకే రాశిలో ఉండటం వలన అత్యంత లాభదాయకమైన కాలం. పెద్దలను గౌరవించడం వలన మీరు లాభం పొందగలరు. గ్రహణ కాలంలో ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటే వారి గురించి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది.
undefined
మీనరాశి వారికి :- వృత్తి ఉద్యోగాలలో మంచి అవకాశం వచ్చే కాలం. శాంతి, సౌభాగ్యాలకు వచ్చే సంవత్సరం బాగుంటుంది. నిధానంగా కాలం గడపండి. జనవరి వరకు కొన్ని విషయాలను వాయిదా వేయండి. మీ సృజనాత్మకతను, నిర్ణయాలను వచ్చే సంవత్సరం ఉపయోగించుకోండి. కొత్త సంవత్సరం ప్రారంభంలో 9 10 11 అధిపతులు వారి వారి రాశిలో ఉండటం వలన అత్యంత అదృష్టమైన కాలం.
undefined
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
click me!