వార ఫలాలు :07 మే 2023 నుంచి 13 మే 2023 వరకు
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీమాతా' జ్యోతిష్యాలయం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
Zodiac Sign
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యలు రాగలవు. వ్యాపారము యందు జాగ్రత్త అవసరము. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గృహ వాతావరణం అనుకూలంగా ఉండును . ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చిన్నపాటి విషయాలపై ఇతరులతోటి వివాదాలు తలెత్తవచ్చు. ఇతరుల సమస్యల దూరంగా ఉండడం మంచిది. చేయపని యందు శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. గృహానికి సంబంధిత అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతానం తోటి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వారాంతంలో జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. ధన ధాన్యాది లాభాలు పొందగలరు. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
Zodiac Sign
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
వివాహ ప్రయత్నాలు ఫలించును. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరిగి ఆనందంగా గడుపుతారు. కొత్త వారి తోటి స్నేహ పరిచయాలు ఏర్పడతాయి. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమనందు సహోదయోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజము నందు మీయొక్క ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. మీకు రావలసిన రుణాలు లేదా ధనము ఆలస్యమగును. ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్త తీసుకొనవలెను. భూ గృహ క్రయ విక్రయాలు యందు పెద్దవారి యొక్క సూచన మేరకు నిర్ణయం తీసుకొనవలెను. ఉమ్మడి ఆస్తి విషయాలలో తగాదాలు తలెత్తవచ్చు. కోర్టు వ్యవహారాలు చికాకు పుట్టించిను. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులను కలుస్తారు. వారాంతంలో ఉరితే వ్యాపారాలు లాభసాటికా జరుగును. ఉద్యోగ ప్రయత్నాల ఫలించును. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును.
Zodiac Sign
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారములు॥ ఋధ -శుక్ర
ఆరోగ్యం బాగుంటుంది. గృహమునందు ఆనందకరమైన వాతావరణము. చేయి వ్యవహారమునందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. విద్యార్థులకు అనుకూలం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార అభివృద్ధి సంబంధించి ఇతరులతోటి దీర్ఘాలోచనలు చేస్తారు. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభించును. పిల్లలకు ఉన్నత విద్య లేక ఉద్యోగం లభిస్తుంది. వారాంతంలో దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది . ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యలు ఏర్పడగలవు.
Zodiac Sign
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
సంతానం తోటి ప్రతికూలత వాతావరణం. చేయు వ్యవహారములో సరైన ఆలోచన లేక ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉండును. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. ఉద్యోగమునందు అధికారుల తోటి ఆకారణంగా కలహాలు ఏర్పడగలవు. వృత్తి విద్యలు ఉన్నవిధాల అనుకూలంగా ఉండును. రుణ శత్రు బాధలు తీరి ఉపశమనం లభించును. చేయు పని యందు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేయువారు శుభవార్త వింటారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఉమ్మడి ఆస్తి విషయాలలో తగాదాలు ఏర్పడగలవు. గృహ నిర్మాణ పనులు సజావుగా సాగును. కోర్టుకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా రావొచ్చు. బందోవర్గంతోటి కొద్దిపాటి విభేదాలు రాగలవు. వారాంతంలో సమాజము నందు ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి.
Zodiac Sign
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
గృహమునందు పెద్దవారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. గృహమునందు సమాజము నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడును. చేయు వ్యవహారము నందు ఆచితూచి వ్యవహరించవలెను. సంతానం తోటి విరోధాలు ఏర్పడగలవు. కార్య కలాపాల యందు నిర్వహణ సామర్థ్యం తగ్గి ఇతరులతోటి విమర్శలకు ఏర్పడగలవు.
ఇష్టం లేని కార్యాలు చేయవలసి వస్తుంది. అనవసరమైన ఖర్చులు పెరగగలవు. వృత్తి వ్యాపారమనందు కొద్దిపాటి ధన నష్టం ఏర్పడను. శారీరక మానసిక అశాంతి వాతావరణ ఏర్పడగలదు. ఇతరులతోటి కలహాలకు విరోధాలకు దూరంగా ఉండటం మంచిది. నీచమైన ఆలోచనలు కలుగును. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. వారాంతంలో నూతన వస్త వాహనాలు కొనుగోలు చేస్తారు. శారీరకంగా మానసికంగా ఆనందంగా గడుపుతారు.
Zodiac Sign
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం
మీయొక్క సహచరులు వలన అపకారం జరగవచ్చు. సమాజము నందు చేయు వ్యవహారములు ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. మాతృ వర్గ బంధువులతో విరోధములు తగ్గి వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. చేయు పని యందు ఆటంకములో ఎదురైన చివరకు పూర్తి అగును. ఇంటికి కావలసిన సామాగ్రి కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగము నందు అనుకూలంగా నుండును. వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడగలవు. మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఆత్మవిశ్వాసం తోటి అన్ని పనులు సాధిస్తారు. అన్ని వైపుల నుండి శుభం జరుగుతుంది. వారాంతంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజం సమాజం నందు కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి.
Zodiac Sign
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర
సామర్థ్యాలను శక్తిని ఉపయోగించి పనులన్నీ పూర్తి చేసి ఉంటారు. సామాజిక వ్యవహారంలో పాల్గొంటారు. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కారణం లేకుండానే ఇతరులతో విరోధాలు ఏర్పడగలవు. ఇతరుల వల్ల భయం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో తగ జాగ్రత్తలు. ఉద్యోగమనందు ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరిగి బలహీనత ఏర్పడుతుంది. కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. పరిసరాల మార్పిడి లేదా గృహ వసతి మార్పిడి ఏర్పడగలదు. దూరపు ప్రయాణాలు లభిస్తాయి. మానసికంగా భయంగానుండును. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతోటి జాగ్రత్తగా మెలగాలి. వృత్తి వ్యాపారమునందు ధన నష్టము ఏర్పడగలదు. వారాంతంలో ధనాధాయం బాగుంటుంది. ఇతరులనుండి సహాయ సహకారాలు లభిస్తాయి. రుణ రోగముల నుండి విముక్తి కలుగుతుంది. శారీరక మానసిక ప్రశాంతత ఏర్పడగలరు.
Zodiac Sign
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ-గురు -శుక్ర
శారీరక ప్రభుత్వం తగ్గును. ఆరోగ్యం సమస్యలు ఏర్పడగలవు. ఇతరులతోటి స్నేహ అనురాగాలు బలపడతాయి. ఆలోచన శక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలం ఉద్యోగమనందు అనుకూలమైన వాతావరణ. వాహన సౌఖ్యం లభిస్తుంది. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడిన అవసరానికి ఏదో విధంగా ధనం లభిస్తుంది. ఇతరుల యొక్క సమస్యలకు దూరంగా ఉండటం మంచిది. తలపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. సహచరుల సహాయ సహకారాలు లభిస్తాయి. మీ మాట సామర్థ్యం తోటి ఇతరులను ఆకట్టుకుంటారు. స్థిరాస్తి విషయాలలో కొద్దిపాటి గందరగోళం ఏర్పడుతుంది. సంతానమునందు సఖ్యతగా మెలగవలెను. నిర్వహణ సామర్థ్యం తగ్గవచ్చు. వారాంతంలో మానసిక అశాంతి శారీరక అనారోగ్యం ఏర్పడగలవు. చేతి యందు సరిగా ధనం అందక పోవచ్చు. వృధా ఖర్చులు పెరుగుతాయి.
Zodiac Sign
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ
ధనాధాయము లోటుండదు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. శారీరక శ్రమ అధికంగా నుండును. కుటుంబ సభ్యులతో మరియు సోదరి సహోదరులతోటి కొద్దిపాటి విరోధాలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి. భూ గృహ క్రయ విక్రయాలకు అనుకూలమైన వాతావరణము కాదు. ఇతరుల వలన మోసం దగా జరగవచ్చు. మానసిక అస్వస్థత ఏర్పడగలదు. సమాజము నందు సంఘటనలు వలన మనస్సు నందు ఆందోళనకు గురవుతారు. శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉద్యోగమునందు అధికారులతోటి అకారణంగా కలహాలు ఏర్పడగలవు. ధనము ఊహించని రీతిలో ఖర్చుగును. వ్యాపారమనందు ధన నష్టము ఏర్పడుతుంది. వారాంతంలో శుభ ఫలితాలు కలుగును. నూతన వస్తు వాహన వస్త్రాభరాణలు కొనుగోలు చేస్తారు. ధైర్య సాహసాల తోటి అన్ని పనులు పూర్తి చేస్తారు.
Zodiac Sign
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారములు॥ ఆది -సోమ- శని
వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును. కొడంబ జీవితంలో ఆనంద భరితముగా గడుపుతారు
గొప్ప వారితో అనుబంధం సంబంధాలు ఏర్పడతాయి. దూర ప్రయాణములు ద్వారా లాభం కలుగును. విద్యార్థులు పరీక్షల యందు విజయాలని సాధిస్తారు. అనుకున్న పనులను విజయవంతంగా సాధించుకుంటారు. ఉద్యోగనంద సహోదయోగల వలన సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. కళాత్మకమైన విలువైన వస్తువులను అధిక ధనం హెచ్చించి కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ సంబంధిత పనులు అనుకూలంగా ఉండును. రుణ రోగముల నుండి విముక్తి పొంది ప్రశాంతత లభిస్తుంది. వారాంతంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగును. కారణం లేకుండానే ఇతరులతోటి విరోధాలు ఏర్పడగలవు.
Zodiac Sign
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
వృత్తి వ్యాపార వ్యవహారము నందు ఊహించనంత ధనలాభం పొందగలరు. నూతన వ్యాపార ప్రయత్నములు వాయిదా పడును. మానసిక స్థితి సంతృప్తికరంగా నుండును. సంతోషకరమైన వార్తల వింటారు. మంచితనముతోటి ఎంతటి క్లిష్టమైన పనులులైన సులువుగా పూర్తి చేసుకుంటారు. సోదర వర్గము నుండి సంపూర్ణ సహకారము అందుతుంది. విదేశీ వ్యవహారములు కొలిక్కి వస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. రుణ విముక్తులవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజము నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. సత్పురుషుల సాంగత్యం లభిస్తుంది. వారాంతంలో ఊహించని రీతిలో ధనము ఖర్చుగును. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆరోగ్య సమస్యలు ఏర్పడ గలవు.
Zodiac Sign
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ
ఇతరులతోటి విరోధం ఏర్పడిన అందు విజయమే లభిస్తుంది. లభించిన అవకాశములు ను జార విడుచుకోకుండా చూచుకోవాలి. ఆధ్యాత్మిక చింతన దైవచింతనులతో పాటు ధర్మ కార్యాచరణలో పాల్గొంటారు. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదరభిమానములు పొందగలరు. శారీరక మానసిక అనారోగ్యం ఏర్పడగలదు. చెడు దారులు తొక్కే అవకాశం ఉన్నది. అనుకున్న సమయంలో అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించడం కష్టంగా నుండును. ఇతరులతోటి చిన్నచిన్న తగాదాలు ఏర్పడగలవు. కొంత మేలైన సౌకర్యములతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. భావోద్రేకాలు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో భిన్నాభిప్రాయాలు ఏర్పడగలవు. వారాంతంలో అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనవలెను. వ్యర్థ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి.