ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారు తెలివిగా సమస్య నుంచి బయటపడతారు

First Published | May 7, 2023, 5:15 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు లకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అగును.విందు వినోదాలలో పాల్గొంటారు.


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
  
పంచాంగం:                                                                                                                                                                       
తేది : 7 మే 2023
సంవత్సరం :- శోభకృత్
ఆయనం :-ఉత్తరాయణం
మాసం :- వైశాఖం
ఋతువు :- వసంత ఋతువు
పక్షం :-     కృష్ణపక్షం                                                                                    
వారము:-ఆదివారం
తిథి :-  విదియ రాత్రి 8.54 ని.వరకు
నక్షత్రం : -  అనూరాధ  రాత్రి 9.10 ని.వరకు   
యోగం:- వరియాన్ ఉదయం 6.02 ని.వరకు పరిఘము తె.3.56
కరణం:- తైతుల ఉదయం 9.28 గరజి రాత్రి 8.54
అమృత ఘడియలు:- ఉదయం 10.56 ని.ల 12.30 ని.వరకు
దుర్ముహూర్తం:-సా.04.35ని. నుండి సా.05.26ని. వరకు                              
వర్జ్యం:- రాత్రి 2.35 ని.ల 4.07 ని.వరకు
రాహుకాలం:సా.04.30ని నుండి సా.06.00ని వరకు.                                                                  
యమగండం:మ.12.00ని. నుండి మ.01.30ని. వరకు.                                                                              
సూర్యోదయం :        5.35 ని॥లకు
సూర్యాస్తమయం:    6.17 ని॥లకు


సూర్యోదయానికి ఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించవలెను.

               శుభ ఫలితాలు పొందండి.

              సర్వేజనాః సుఖినోభవంతు
 

Zodiac Sign


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:- ఈరోజు ఆనందంగా గడుపుతారు. సంఘంలో  గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు. రావలసిన బాకీలు వసూలు అగును. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగును. ధనాన్ని వృద్ధి చేయు పథకాలను ఆలోచిస్తారు. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు లకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అగును.విందు వినోదాలలో పాల్గొంటారు.నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలం. ఈ రాశి వారు ఓం భార్గవాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి


Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:- ఇంట బయట కూడా కొద్దిగా ప్రతికూల వాతావరణ ఉంటుంది.పనిచేయు వారి తోటి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి.సంఘము నందు వాదోపవాదాలుకుదూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. తలపెట్టిన పనులు యందు ఆటంకాలు ఏర్పడతాయి.  ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం.బంధువుల తోటి కొద్దిపాటి కలహాలు.జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగండి. ఈ రాశి వారు ఓంవీరభద్రాయనమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

దిన ఫలం:- అనుకోని కలహాలు తోటి మనసు చికాకులు గా ఉండుట ఉంటుంది. చెడు స్నేహితులను  దూరంగా ఉండాలి . చేయు వ్యాపారం నందు అభివృద్ధి సంబంధిత పనులలో ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటుంటారు . పట్టుదల తోటి చేయ పనులలో విజయం సాధిస్తారు . మనస్సునందు ఆందోళనగా ఉంటుంది .వృత్తి వ్యాపారాలు యందు అధిక శ్రమ.సంఘము నందు వివాదాలకు దూరంగా ఉండడం . పెద్దలు పట్ల గౌరవం గా . సమయానుకూలంగా  తెలివిగా ముందుకు . ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరం . ఓం అర్థ శరీరాయ నమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:- పై అధికారులతో కొద్దిపాటి విరోధాలు. కుటుంబం నందు ప్రతికూల వాతావరణ . అనవసరమైన ఖర్చులు చేస్తారు . బంధుమిత్రులతో మాట పట్టింపులు రావచ్చును . మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది . ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును . అనవసర ప్రయాణాలు . తలపెట్టిన పనులు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి .   వృత్తి వ్యాపారాలు యందు కొద్దిపాటి ధన నష్టం కలుగును . మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి . కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు  ఇబ్బంది కలిగిస్తాయి ఈరోజు ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:- పనులు యందు దూరంగా ఉండటం మంచిది. శారీరిక శ్రమ అధికంగా ఉంటుంది. పనిచేయు వారి తోటి ఇబ్బందులు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారం నందు ధన నష్టం ఏర్పడవచ్చును.అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన చేస్తారు. చేతికి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి.  కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడును. సంఘము నందు  అవమానాలు. చేయు ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు స్నేహాల వలన కొద్దిపాటి సమస్యఏర్పడును.ఈ రాశి వారు  ఓం ఛాయ పుత్రాయ నమః అనేజపించండి  శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:- శుభవార్తలు వింటారు.గృహము నందు ఆనందకరమైన వాతావరణం. చేయు పని యందు మిత్రులు యొక్క సహాయ సహకారములు లభించును. సంఘము నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారములు అందిస్తారు. ఆరోగ్యంసమకూరి ప్రశాంతంగా ఉండును. వృత్తి వ్యాపారములు అధిక ధన లాభం చేకూరును. ఉద్యోగము నందు ఆనందంగా  గడుస్తుంది. పెద్దల యొక్క స్నేహాలు లాభించును. విందు వినోదాలలో పాల్గొంటారు. ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి .ఈ రాశి వారు ఓంనిశాకరాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు  (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

దిన ఫలం:- సంఘము నందు కీర్తి ప్రతిష్టల పెరుగును . తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తి అగును . ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఇతరులకు మీ వంతుసహాయ సహకారములు  అందిస్తారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును . శుభకార్యాలలో పాల్గొంటారు . రావలసిన బాకీలు వసూలు అగును . ప్రయాణాలు అనుకూలం.ఉద్యోగము నందు పెద్దవారి యొక్క సహకారం వలన ఇబ్బందులు తొలగి ఉపశమనం పొందుతారు . దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు .  ఈ రాశి వారు ఓం బృహస్పతయే నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు  (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:- నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు . బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు . పాత బాకీలు వసూలు అగును . ఆరోగ్యం చేకూరి మనసు ప్రశాంతత లభించును . సంఘము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును . వృత్తి వ్యాపారము నందు ధన లాభం చేకూరుతుంది . అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి . పెద్దల యొక్క సహాయ సహకారములు  లభించును . ఈరోజు చాలా ప్రశాంతత గా గడుస్తుంది .  ప్రయాణాలు . ఉద్యోగము నందు పై అధికారుల మన్ననలు పొందుతారు ఓం జగన్నాధాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

దిన ఫలం:- కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేయ పనుల యందుపూర్తికాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తవారితో స్నేహం వలన కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇంటా బయట గొడవలు గా ఉండును. సోదరులు తో మనస్పర్ధలు ఏర్పడవచ్చును. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారములు యందు ధన నష్టం ఏర్పడును. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.మనస్సు నందు ఆందోళన. ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.  ఈ రాశి వారు ఓంమంగళ ప్రదాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:- ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. మీ ఆలోచనలను ఆచరణలో పెడతారు. విద్యార్థులు  అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలెను. తలచిన పనులలో విజయం సాధిస్తారు. ఇతరులతోటి వాదోపవాదములు వేయకండి ఇంకా బయట మీకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగమునందు పని వత్తడి ఎక్కువగా ఉండును. వృత్తి   వ్యాపారములు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించున. ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి
 

Zodiac Sign

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

దిన ఫలం:- ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొంటారు. ఇతరుల యొక్క విషయాలలో జోక్యం చేసుకోవడం  కొత్త సమస్యలు ఏర్పడగలవు. వివాదాలకు దూరంగా ఉండండి. కోపంతో  కాకుండా ప్రశాంతంగా మీ యొక్క సమస్యలను  పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.  బంధుమిత్రుల యొక్క కలయిక. ఉద్యోగం నందు కొద్దిపాటి ఒడిదుడుకులు ఇబ్బంది కలగచేస్తాయి. కొన్ని కీలక మైన సమస్యలను జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. అనవసరమైన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:- భావోద్వేగాలు తో చేసే పనులు వలన కొత్త సమస్యలు ఏర్పడను. ఉద్యోగులు  ఎదురైన సమస్యలు పరిష్కరించుకుంటారు.  వృత్తి వ్యాపారములు సాధారణంగా ఉంటాయి. జీవిత భాగస్వామి తోటి కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చును. కొన్ని కీలకమైన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వస్తువుల యందు తగు జాగ్రత్త వహించవలెను. వాహన ప్రయాణాలు విషయంలో తగు జాగ్రత్త తీసుకొని వలెను . ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

Latest Videos

click me!