వార ఫలితాలు.. 2ఏప్రిల్ నుంచి 8 ఏప్రిల్ వరకు..

First Published Apr 2, 2021, 10:56 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం  ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో  మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థులు అనుకున్న కోర్సులలో ప్రవేశిస్తారు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే... ఆనందం అనేది డబ్బులోనే.. లగ్జరీ వస్తువుల్లోనూ ఉండదు. అది మనుషుల మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కొందరు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. వాళ్లని చూసి ఎదుటివారు వీళ్లకి బాధలంటూ ఏమీ ఉండవా అనే సందేహం కలుగుతుంది. అయితే.. వాళ్లు చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కుంటారు. అందుకే వారు అలా ఉండగలుగుతున్నారట. రాశిచక్రం ప్రకారం కూడా.. ఐదు రాశులవారు ఎప్పుడూ తమ జీవితం సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం..
undefined
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు వివాదాలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు అనుకూల సమయం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థులు అనుకున్న కోర్సులలో ప్రవేశిస్తారు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో రుణఒత్తిడులు. బంధువులతో విభేదాలు. పనులు సజావుగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కొన్ని ఆశయాలు నెరవేరతాయి. బంధువర్గంతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆలోచనలు అమలులో అవాంతరాలు తొలగుతాయి.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. కొత్త పరిచయాలు. కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబబాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు. పెట్టుబడుల్లో ఆటంకాలు. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు. కళారంగం వారి యత్నాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. వారం ప్రారంభంలో శుభవార్తలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులు హఠాత్తుగా వాయిదా పడతాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఇంటి నిర్మాణయత్నాలలో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటాబయటా సమస్యలు అధిగమవుతాయి. సోదరులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగ విధుల్లో అవరోధాలు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు అవకాశాలు పెరుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. మానసిక అశాంతి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. అనుకున్న వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. స్థిరాస్తి వివాదాలు కొంతమేర తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. కళారంగం వారికి గౌరవ పురస్కారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, భూములు కొంటారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. కళారంగం వారికి శ్రమ మరింత పెరుగుతుంది. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. దూరపు బంధువుల కలయిక. వ్యవహారాలలో కొద్దిగా ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. మిత్రులతో వివాదాలు నెలకొనే అవకాశం. నిర్ణయాలలో మరింత నిదానం అవసరం. బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు మునుపటి కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. స్వల్ప అనారోగ్యం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండి రుణబాధల నుంచి విముక్తి. కొత్త పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు కనిపిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. పనిభారం తగ్గుతుంది. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. మానసిక అశాంతి. పట్టింది బంగారమే. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం గృహ, వాహనయోగాలు. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి ఇంక్రిమెంట్లు అందే అవకాశం. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. ఇంటాబయటా చికాకులు. కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలలో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితి. పారిశ్రామికవర్గాలకు వివాదాలు నెలకొంటాయి. వారం చివరిలో విందువినోదాలు. కార్యజయం. వాహనయోగం. ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతారు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబంలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం ప్రముఖులతో చర్చలు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహమే. అనుకోని మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాల యత్నాలు ముందుకు సాగవు. వారం ప్రారంభంలో బంధువుల ద్వారా శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆర్థిక వ్యవహారాలలో గందరగోళం. ఏ పని చేపట్టినా ముందుకు సాగక డీలా పడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలు నెలకొని సవాలుగా మారవచ్చు. భూములకు సంబంధించిన ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
click me!