Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఆదాయం పెరుగతుంది.. అన్నీ లాభాలే..!

First Published Mar 25, 2022, 8:47 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలకు లోటు ఉండదు. వస్తు, వస్త్రలాభాలు. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి

Aries

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ముఖ్య పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రగతితో ముందుకు సాగుతారు.  సన్నిహితులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటర్వ్యూలు సైతం అందుకుంటారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం. వాహనయోగం.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Taurus

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం నిరుద్యోగులకు భవిష్యత్‌పై ఆశలు చిగురిస్తాయి. ప్రముఖులు నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొత్త కాంట్రాక్టులు కొన్ని లభిస్తాయి.  ఆస్తుల కొనుగోలు యత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి,  లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం  ప్రారంభంలో బంధువిరోధాలు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Gemini

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం అనుకున్న వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. ఆప్తులతో విభేదాలు పరిష్కారం. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి లేదా ధనలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాల మరింత ఆశాజనకంగా ఉంటుది. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Cancer

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం కొత్త వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత  ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఊహించని హోదాలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు పురస్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

. సింహరాశి

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం పనులు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.  మిత్రులతో కొన్ని వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు, పనిభారం. రాజకీయ, కళారంగాల వారికి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనలబ్ధి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

Virgo

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం కొత్త మిత్రులు పరిచయమవుతారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. పరపతి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. సోదరులతో ఆస్తి వ్యవహారాలపై చర్చలు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి.  వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి.  ఉద్యోగాలలో నూతనోత్సాహం, పదోన్నతులు దక్కవచ్చు. కళాకారులకు సన్మానయోగం, విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తుల రాశి

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలకు లోటు ఉండదు. వస్తు, వస్త్రలాభాలు. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిడుల నుండి బయటపడతారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. రాజకీయ,కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. విచిత్ర సంఘటనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Scorpio

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం ముఖ్య వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు పరిష్కారవుతాయి. విద్యార్థులను ఒక ప్రకటన ఆకర్షిస్తుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది.  బం«ధువులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి.  వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో  చికాకులు తొలగుతాయి, కొన్ని సమస్యలు తీరతాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. వారం చివరిలో కుటుంబసభ్యులతో తగాదాలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

ధనస్సు రాశి

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం కొత్త పనులు ప్రారంభిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విలువైన సమాచారం అందుతుంది. మీ ఊహలు నిజం చేసుకుంటారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది.  కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలలో పురోగతి సాధిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో  ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు  ఊహించని పదవులు లభిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

capricorn

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది.  ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు కొలిక్కి వస్తాయి. కొన్ని సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో పురోగతి, ఆశించినంత లాభాలు దక్కుతాయి.  ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. విధులు ప్రశాంతంగా సాగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

Aquarius

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ప్రముఖ వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.. అనుకున్న పనులు జాప్యం లేకుండా పూర్తి చే స్తారు. ఆస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. దైవదర్శనాలు చేసుకుంటారు.  వాహన,గృహయోగాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.  వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా మారతాయి. ఉద్యోగాలలో  అంచనాలు నిజం కాగలవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం  ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 

మీనరాశి ( Pices


మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. . స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగ విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

డా.యం.ఎన్.చార్య

డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. ఆచార్య

click me!