Weekly horoscope: ఓ రాశివారికి పలుకుబడి పెరుగుతుంది, విజయాలు సాధిస్తారు..!

First Published Feb 25, 2022, 9:10 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఉత్సాహంగా ముందుకు సాగి అనుకున్న విజయాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఆశాజకనంగా ఉంటాయి. ధనలాభాలు ఉండవచ్చు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పోటీపరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. కళారంగం వారికి సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఉత్సాహంగా ముందుకు సాగి అనుకున్న విజయాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరపతి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆహ్వానాలు రాగలవు. వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణయత్నాలు సాగిస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరుల నుంచి మాటపడతారు. ఆరోగ్యపరంగా చికాకులు. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళారంగం వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి విమర్శలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం కొన్ని వ్యవహారాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం పనులు కొంత నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన లేదా సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో కొంత జాప్యం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో కష్టానికి ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు నెలకొంటాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు. సోదరులు, మిత్రులతో వివాదాలు కొంత సర్దుబాటు కాగలవు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పైస్థాయి నుంచి పిలుపు. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తులు , సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా ముందుకు సాగుతారు. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలోచనలు కలిసివస్తాయి. వివాహయత్నాలు సానుకూలం. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్‌ అవకాశాలు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. కుటుంబంలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం చేపట్టిన పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆప్తులు, మిత్రుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళారంగం వారికి కలసివచ్చే కాలం. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. అనుకోని ఖర్చులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు కొంతవరకూ సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కుతుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. గతంలో చేజారిన కొన్ని పత్రాలు తిరిగి దక్కుతాయి. ఇంటి నిర్మాణాలలో ముందడుగు వేస్తారు.. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో శ్రమ తప్పదు. కుటుంబంలో సమస్యలు.  చోరభయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. ఆచార్య

click me!