Vastu tips: వంట గదిలో ఈ వస్తువులు ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలి..!

Published : Feb 22, 2022, 03:19 PM IST

వంటగదిలోని కొన్ని పదార్థాలు గృహ వృద్ధికి , ఆర్థిక విజయానికి సంకేతం. కాగా.. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఎప్పుడూ కొన్ని వస్తువులు అయిపోకుండా చూసుకోవాలట. మరి అవేంటో ఓసారి చూద్దామా..

PREV
16
Vastu tips: వంట గదిలో ఈ వస్తువులు ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలి..!
vastu

వంటగది అనేది ఇంటి సభ్యులందరికీ వృద్ధికి మూలం. అందరి ఆరోగ్యానికి, ఆనందానికి దారితీసే ప్రదేశం అది. కొరివి నుంచి ఇంటి వరకు, పొయ్యి నుంచి వంట చేసేవారు నిలబడే స్థలం వరకు, వంటగదిలో ఉండాల్సిన వస్తువుల వరకు వాస్తు వివరిస్తుంది. వంటగదిలోని కొన్ని పదార్థాలు గృహ వృద్ధికి , ఆర్థిక విజయానికి సంకేతం. కాగా.. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఎప్పుడూ కొన్ని వస్తువులు అయిపోకుండా చూసుకోవాలట. మరి అవేంటో ఓసారి చూద్దామా..

26

పిండి
ఇంట్లో గోధుమ పిండి ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలి. అయిపోవస్తోంది అనగానే వెంటనే తెచ్చుకోవాలట. ఇంట్లో పిండి నిల్వ అయిపోయింది అంటే.. ఆ ఇంట్లో వ్యక్తి గౌరవం, డబ్బు పోగొట్టుకున్నట్లేనట. అందుకే ఇంట్లో పిండి ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలి. 

36

ఆవాల నూనె
శని దోషం ఉన్నపుడు ఆవనూనె దానం చేయాలని చెబుతారు. ఆవాల నూనె శని దేవుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఇది ఇంట్లో ఎప్పుడూ ముగియకుండా చూసుకోవాలి.. ఆవనూనె తగ్గితే శని ఆ ఇంట్లో అడుగుపెట్టినట్లేనట.
 

46

ఉ ప్పు
ఉప్పు ఇంటికి ద్రోహం చేయని వస్తువు. ఉప్పు లేకుండా ఏ వంటవాడు రుచి చూడలేము. వాస్తు శాస్త్రంలో ఇటువంటి ఉప్పుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో ప్రతికూల ఆత్మలు ఉన్నప్పుడు మూలల్లో ఉప్పు వేయమని చెబుతారు. వంట విషయానికి వస్తే, ఉప్పు ఖాళీ అయిన తర్వాత మళ్లీ నింపే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది ఎప్పుడూ చేయకూడదు. దీని వల్ల రాహువు  చెడు దృష్టి వ్యక్తిపై పడుతుంది. దీనివల్ల వ్యక్తి డబ్బును పోగొట్టుకుంటాడు. కాబట్టి.. ఇంట్లో ఉప్పు ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలి.

56
Rice

అన్నం
మన శక్తికి మూలం.  అన్నం తింటే అందరి కడుపు నింపుతుంది. నిజానికి, బియ్యం శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. అందుకని, ఇంట్లో ఖాళీ చేయకుండా జాగ్రత్తపడాలి. ఖాళీగా ఉంటే, శుక్రుడు సదరు ఇంట్లోని వ్యక్తిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇది అతని వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అదనంగా, ఇంట్లో ఆనందం , శ్రేయస్సు తగ్గుతుంది.

66

పసుపు

 పసుపు కి గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇందులో ఫుడ్ కలరింగ్‌తో పాటు ఔషధ గుణాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దానికితోడు ఏ శుభకార్యమైనా పసుపు కుంకుమను ఉపయోగిస్తాము. వాస్తు ప్రకారం, పసుపు బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది. వంట ఇంట్లో పసుపు ఖాళీగా ఉంటే ఆ వ్యక్తి గురువు ప్రభావానికి గురౌతాడు.  దీనివల్ల ఆర్థిక ఒడిదుడుకులు, పనిలో ఇబ్బందులు పెరుగుతాయి. అలాగే ఇంట్లో చేయాల్సిన శుభకార్యానికి ఇబ్బందులు ఎదురవుతాయి.

click me!

Recommended Stories