వారఫలితాలు తేదీ ఏప్రిల్ 16 శుక్రవారం నుండి 22 గురువారం 2021

First Published | Apr 16, 2021, 8:59 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి   ఈ వారం వ్యాపారాలలో  తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు పొందుతారు. కళారంగం వారికి  విశేష ఆదరణ. వారం చివరిలో శ్రమాధిక్యం. ఒప్పందాలలో ఆటంకాలు. పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఆలయాల సందర్శనం. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. శుభకార్యాల నిర్వహణలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన ఉద్యోగయత్నాలు కొంత అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు పొందుతారు. కళారంగం వారికి విశేష ఆదరణ. వారం చివరిలో శ్రమాధిక్యం. ఒప్పందాలలో ఆటంకాలు. పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరుస్తారు. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వాహనాలు,స్థలాలు కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు కాస్త ఉపశమనం పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం పలుకుబడి మరింత పెరుగుతుంది. విద్యార్థుల కృషి కొంత ఫలిస్తుంది. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు మరింత దక్కుతాయి. ఉద్యోగాలలో హోదాలు సంతృప్తినిస్తాయి. పారిశ్రామికవర్గాలకు ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆరోగ్యసమస్యలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. పాతబాకీలు వసూలై అవసరాలు తీరతాయి. శ్రేయోభిలాషులు దగ్గరవుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు అధిగమిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం సన్నిహితుల సాయం అందుతుంది. కొన్ని వివాదాలు, సమస్యలు వాటంతట అవే సర్దుకుంటాయి. శుభకార్యాలపై కుటుంబంలో చర్చలు జరుపుతారు. కాంట్రాక్టులు కోసం చేసే యత్నాలు కొంత సఫలమవుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమించి ముందడుగు వేస్తారు. రాజకీయవర్గాలకు కాస్త ఊపిరిపీల్చుకునే సమయం. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. అనుకోని ఖర్చులు. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో అంది అవసరాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం బంధువుల ప్రోద్బలంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు యత్నాలు సాగిస్తారు. వ్యాపారాలలో లాభాలు సమకూరతాయి. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. కళారంగం వారికి చిక్కులు తొలగే సమయం. వారం ప్రారంభంలో అనారోగ్యం. ఆస్తి వివాదాలు. క్రమేపీ పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. ఆత్మీయులతో సరదాగా గడుపుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. కొత్త కాంట్రాక్టులు ఎట్టకేలకు సాధిస్తారు. సోదరులు, సోదరీలతో నెలకొన్న విభేదాలు పరిష్కరించుకుంటారు. రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వివాహయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం సంఘంలో మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు. ధన, ఆస్తిలాభాలు కలిగే అవకాశాలు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా సాగుతారు. భూములు, వాహనాలు కొనుగోలులో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సహచరులతో సఖ్యత నెలకొంటుంది.. పారిశ్రామికవర్గాలకు క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. వారం మధ్యలో బంధువిరోధాలు. అనారోగ్యం. మీ కష్టం ఫలించే సమయమనే చెప్పాలి. గతం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు కొన్ని తీరి ఉపశమనం పొందుతారు. బంధువులతో ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థికంగా కొంత బలపడతారు. ప్రముఖులు పరిచయమై సహకరిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఆస్తుల వ్యవహారాలలో బంధువులతో అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమై ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగై రుణబాధలు తొలగుతాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఈతిబాధలు తొలగి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాలకు అనుకూల సమాచారం అందుతుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు తీరతాయి. ఏ వ్యవహారం చేపట్టినా విజయమే. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. మీ సత్తాను అందరూ గుర్తిస్తారు. ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సకాలంలో అంది ఊరట చెందుతారు. ఉద్యోగాలలో కొత్త విధులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు కొంత అనుకూల పరిస్థితులు ఉండవచ్చు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. అనుకున్న పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలో ఒప్పందాలు చేసుకుంటారు. మీ నిర్ణయాలు, అభిప్రాయాలను కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. వివాహయత్నాలు కలసివస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం బంధువుల నుంచి వచ్చిన క్షేమసమాచారాలు అందుతాయి. వాహనాలు, ఇళ్ల నిర్మాణయత్నాలు కొంత కలసివస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. కాంట్రాక్టులు ఎట్టకేలకు సాధిస్తారు. వ్యాపారాలలో గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం వివాహ, ఉద్యోగయత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాల వెంట నడుస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గుతాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకర సమాచారం. వారం మధ్యలో మానసిక ఆందోళన. ఒప్పందాలు రద్దు. పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటారు. ఆత్మీయులతో మరింత ్రఆనందంగా గడుపుతారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు సమసిపోతాయి. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం కుదుటపడి ఊపిరిపీల్చుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం పరిస్థితులు అంతగా అనుకూలించవు. వివాదాలకు దూరంగా ఉండండి. ఇంటి నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు కొంతమేర లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిబాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనలాభం. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువులు అభిప్రాయాలను తప్పుపడతారు. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలలో ఊహించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. కళారంగం వారికి కొంత అనుకూల సమయం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. చేపట్టిన పనులు కొంత నిదానించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మంచీచెడ్డా విచారిస్తారు. రావలసిన డబ్బు సకాలంలో అందుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Latest Videos

click me!