మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టి బంధువుల ప్రశంసలు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరించేందుకు యత్నిస్తారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలకు ఊహించని ఆహ్వానాలు అందవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం ప్రారంభంలో కొన్ని చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి తోడ్పాటుతో ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీలు కొంత ఊరటనిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆశలు. వ్యాపారాలలో అనుకున్నంతగా లాభాలు రాగలవు. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రులతో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ముఖ్యమైన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనయోగం. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో అవరోధాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. వారం చివరిలో ఆరోగ్యభంగం. మానసిక అశాంతి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. కార్యక్రమాలలో అవాంతరాలు అధిగమిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులు కీలక సమాచారం అందుకుంటారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు రాగలవు. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం కొత్త పనులు సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. నిరుద్యోగులకు ఒక ముఖ్య సమాచారం రాగలదు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. పాతమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో కీలక మార్పులు జరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. బంధువులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కివస్తాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు కొంత అనుకూలస్థితి. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట లభిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త విషయాలు గ్రహిస్తారు. కొన్ని వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో తగిన గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు అందుతాయి. వారం చివరిలో బంధువులతో వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. అనుకున్నది సాధించాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు అధిగమిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పెట్టుబడులు అంది పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. సన్నిహితులతో మాటపట్టింపులు. ఒప్పందాలు వాయిదా. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు తథ్యం. ఉద్యోగాలలో పైస్థాయివారి ప్రశంసలు అందుకుంటారు. కళాకారులకు అనుకోని అవకాశాలు దక్కవచ్చు. వారం ప్రారంభంలో కొన్ని ఒత్తిడులు ఎదుర్కోవల్సి ఉంటుంది. బంధువులతో విరోధాలు ఏర్పడతాయి. మానసిక అశాంతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసి, విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. శుభకార్యాల నిర్వహణతో బిజీగా గడుపుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు తప్పవు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం దక్కదు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు నిదానంగా సాగుతాయి. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగ విధి నిర్వహణలో అవాంతరాలు ఏర్పడతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. స్థిరాస్తిలాభం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.