Astrology: అక్టొబర్ 2021 నెల రాశిఫలాలు

First Published Oct 1, 2021, 9:46 AM IST

ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి  ఈ నెలలో భవిష్యత్ కు సంబందించిన ప్రణాళికలు రుపొందిన్చుకోనుటకు మంచి కాలం. వృత్తి వ్యాపార ఉద్యోగాదులలో ఆశాజనకమైన కాలం పొందుతారు.

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ నెలలో గత కాలంలో పోగట్టుకున్న చక్కటి అవకాశములు తిరిగి పొందగలుగుతారు. స్త్రీలు అజాగ్రత్త వలన మాటపడు సంఘటనలు ఎదురగును.ప్రధమ మరియు ద్వితీయ వారాలలో వాహన ప్రమాదమునకు అవకాశం ఉన్నది. ముఖ్యంగా ద్వితీయ వారం అంత మంచిది కాదు. అననుకూలమైన ఫలితాలు, మిత్రులతో విభేదాలు. కార్యములలో  చిక్కులు ఎదురగును.  తృతీయ వారం నుండి గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమగును. వ్యాపారాలలో మీ వ్యూహాలు ఫలిస్తాయి. మాసాంతంలో జీవిత భాగస్వామితో అనుకూల పరిస్థితి ఏర్పడి సౌఖ్యం. చిరకాల కోరికలు తీర్చుకోగలుగుతారు. 5,8, 26, 27 తేదీలు వివాహ ప్రయత్నములకు మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ నెలలో భవిష్యత్ కు సంబందించిన ప్రణాళికలు రుపొందిన్చుకోనుటకు మంచి కాలం. వృత్తి వ్యాపార ఉద్యోగాదులలో ఆశాజనకమైన కాలం పొందుతారు.పై అధికారుల సహకారంతో స్థాన చలన లేదా ప్రమోషన్ సంబంధ విషయాల్లో విజయం పొందుతారు. విమర్శలకు ధీటుగా బదులిస్తారు. 13 వ తేదీ తదుపరి చేపట్టిన పనులు అసంపూర్తిగా  ముగించాల్సి వస్తుంది.  మీ భాద్యతలు ఇతరులకు అప్పచెప్పడం వలన ఇబ్బందులు ఎదురగును. ఆశించిన విధంగా  విశ్రాంతి లభించదు. వైవాహిక జీవన సుఖరాహిత్యత ఎదురగును. చివరి వారంలో ఒక  ప్రమాదము నుండి త్రుటిలో తప్పించుకొనే సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ నెలలో ధనాదాయం సామాన్యం. గతకాలంలో తెలియక చేసిన తప్పులు అవమాన భారం ఏర్పరచును. మాతృ వర్గం వారికి అనారోగ్య సూచన. ప్రధమ వారంలో షేర్ల విక్రయాల వలన ఆకస్మిక ఆర్ధిక లాభములు ఏర్పడు సూచన. భాతృ వర్గం వారితో నెలకొనిన వివాదములు తొలగును. ద్వితియ వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును. తృతియ వారం విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉండును. పరదేశ విద్య కోసం చెసే ప్రయత్నాలు లాభించను. బందువుల రాకపోకలు ఉండగలవు. చివరి వారంలో వృత్తి జీవనంలోని వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగును. రాజకీయ సన్మానం లభించును. నూతన వ్యాపార ప్రయత్నాలు స్థిరచిత్తంతో ప్రయత్నించవలెను. ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించగలుగుతారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ నెలలో వృత్తి , ఉద్యోగ , వ్యాపారములలో ఆశించిన స్థాయిలో లాభములు ఏర్పడవు. ఇతరుల సహకారము ఆశించిన విధంగా ఉండదు. ధనాదాయం తగ్గును. ప్రయాణాలు తీవ్ర ప్రయాసలతో కూడి ఉంటాయి. కుటుంబ సభ్యుల వలన అనారోగ్య మూలక ధనవ్యయం ఎదుర్కొందురు.  మాసం మధ్యలో దైవదర్శన లేదా పుణ్య క్షేత్ర సందర్శన ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక వేత్తల పరిచయం ఆనందాన్ని ఇస్తుంది. 18 వ తేదీ తదుపరి సంతాన ప్రయత్నాలకు అనుకూలమైనది. మాసాంతానికి ప్రశాంతత లభించును. ఈ మాసంలో  5,14,20,29 తేదీలు అంత అనుకూలమైనవి కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ నెలలో ఆశించిన స్థాయిలో లాభములు ఏర్పడును. నూతన వాహన లేదా గృహ ప్రయత్నములు లాభించును. స్తంభించిన వ్యాపార వ్యవహారములు తిరిగి ప్రారంభం అగును. నూతన స్థల సందర్శన చేయుదురు. ద్వితియ వారంలో కార్యగతి అనుకూలంగా ఉండును. మంచి మాటలతో వ్యవహారములు పూర్తి చేయుదురు.మీపై ఉన్న వ్యతిరేకత క్రమంగా తగ్గును. తృతీయ వారంలో మాతృ వర్గం సహకారంతో వివాహ ప్రయత్నములు విజయవంతం అగును. చివరి వారం సాధారణ ఫలితాలు కలుగచేయును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో సంకల్ప సిద్ధి , అంతా ఆశించిన విధంగానే జరుగుతుంది. ధనాదాయం బాగుంటుంది. గత కాలపు ఇబ్బందుల నుండి బయటపడతారు.వ్యక్తిగత జీవనంలో ఆశించిన అనుకూలత ఏర్పడుతుంది. సేవకులపై అతిగా ఆధారపడకుండా ఉండుట మంచిది. ప్రధమ వారమలో వృధా వ్యయం తగ్గించ గలుగుతారు. ద్వితియ వారంలో వాహనముల వలన ఇబ్బందులు ఎదుర్కొందురు. విద్యార్ధులకు  ఆసక్తి కొరవడుతుంది. విదేశీ లేదా ఉద్యోగ ప్రయత్నములలో కష్టం మీద విజయం లభిస్తుంది. ఈ మాసంలో 2,12,17, 23 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో ఆదాయ వ్యయములు సమానంగా ఉండును. ఇతరుల సహకారం వలన బాధ్యతలు సక్రమంగా  నిర్వర్తించుదురు. 6 వ తేదీ నుండి 17 వ తేదీ మధ్య కాలంలో వాయిదా పడిన పనులు తిరిగి ప్రారంభించవచ్చు. జీవిత భాగస్వామి సంబంధిత విషయాలలో చక్కటి సౌఖ్యత ఏర్పడును. అవివాహితుల వివాహ ప్రయత్నములు కూడా ఫలించును. రసాయన పరిశ్రమల్లో పని చేయు వారు పని ప్రదేశంలో మిక్కిలి జాగ్రత్తగా వ్యవహరించాలి. అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉన్నది. 28,29,30 తేదీలు స్థిరాస్థి క్రయ విక్రయాలకు, విదేశీ సంబంధ ప్రయత్నాలకు కలసి రావు. ఈ మాసంలో పౌరహిత్యం నిర్వహించువారు దానములు స్వీకరించుటకు ఆలోచించుట మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ నెలలో అంత అనుకూలమైన ఫలితాలను కలిగించదు. ఆకస్మిక సమస్యల వలన ధన వ్యయము అధికం అగును. ఉష్ణ సంబంధమైన అనారోగ్యము చికాకు కలుగచేయును. ఈ మాసంలో ఒక పర్యాయం కేతు మరియు గురు గ్రహ శాంతి జరిపించుకోనుట మంచిది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ నెలలో కొంత అననుకూల పరిస్థితులు ఎదుర్కొందురు. ప్రధమ వారంలో  మనసుకు నచ్చని స్థానభ్రంశం, విద్యార్ధులకు విద్యావిఘ్నత, మహిళలకు శరీర హాని వంటి ప్రతికూల ఇబ్బందులు ఏర్పడును.వ్యాపార రంగం వార్కి కూడా ఆదాయంలో తగ్గుదల ఏర్పడుతుంది. ఇటువంటి వ్యవహార సమస్యల వలన మానసిక అశాంతి అనుభవించెదరు. అనవసర ఖర్చులు పెరుగును.తృతీయ వారము ఉద్యోగ జీవులకు శ్రమకరంగా ఉండును.ఈ మాసంలో 7, 9,12,13, 21, 27 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో శరీర అనారోగ్యం చికాకులు ఏర్పరచును, వివాహ ప్రయత్నాలు విఫలం అగును. ఆస్తుల అమ్మకాలకు ఆటంకాలు ఉన్నవి. కోరుకొన్న మార్పులు చివరిలో నిలిచిపోవును. ధార్మిక కార్యక్రమాల కొరకు వ్యయం చేస్తారు.. ధార్మిక చింతన కొంత అశాంతి ని పోగొడుతుంది. 14 వ తేదీ తదుపరి  అనుకూల పరిస్థితులు ప్రారంభం అవుతాయి. వ్యవహార విజయం, వృత్తి వ్యాపారదులలో జయం పొందుతారు. 23,24,25, 26 తేదీలలో వ్యాపార వర్గమునకు అతి చక్కటి కాలం. పెట్టుబడులు లాభించును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ నెలలో అకారణంగా మిత్రులతో కలహములు లేదా ఆత్మీయులతో ఎడబాటు ఏర్పడుతుంది. ప్రయత్నములలో ఆటంకములు ఉన్నవి. శ్రమించాలి. ధనాదాయం సామాన్యం. ఒత్తిడిని అధిగమించగలుగుతారు. ఈ మాసంలో 19, 20,21, 22 తేదీలు భూ సంబంధమైన లేదా నూతన గృహ సంబంధమైన ప్రయత్నములలో కదలిక ఏర్పడును. సంతాన సంబంధ ప్రయత్నములు చేయువారికి ద్వితీయ తృతీయ వారములు శుభప్రదం. వ్యాపార రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు ఏర్పడును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ నెలలో ధనాదాయం సామాన్యం. మీ నైపుణ్యం అందరికి తెలుస్తుంది. అనుకున్న విధంగా కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చించగలరు. దీర్గకాళిక కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి.నూతన వ్యాపారములు మధ్యమంగా  ఫలించును. ఉద్యోగ జీవనంలో అనుకున్న లక్ష్యాలు పూర్తి చేయగలుగుతారు. ప్రయాణములు వలన అలసట మరియు లాటరీల వలన నష్టం ఏర్పడు సూచన. హామీలు ఇచ్చుట పనికిరాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
click me!