వారఫలితాలు తేదీ 13 ఆగష్టు శుక్రవారం నుండి 19 ఆగస్టు గురువారం 2021

First Published Aug 13, 2021, 9:37 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయాి. ఓ రాశివారికి ఈ వారం పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగడం ఉత్తమం. అనుకున్న పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు.  వివాహాది యత్నాలు కొంత ఫలిస్తాయి.

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. శ్రేయోభిలాషుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. నిరుద్యోగులు కాస్త ఊరట చెందే ప్రకటన రావచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఆశించినంతగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి ఒడ్డున పడతారు. పారిశ్రామికవర్గాల వారు వ్యవహారాలలో క్రియాశీలకపాత్ర పోషిస్తారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగడం ఉత్తమం. అనుకున్న పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వివాహాది యత్నాలు కొంత ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు క్రమేపీ తగ్గుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా సాగిపోతుంది. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. అయితే అవసరాలకు ఏదోవిధంగా కొంత సొమ్ము అందే సూచనలు. శ్రమకు ఫలితం కనిపించదు. స్థిరాస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, భూముల కొనుగోలులో అవాంతరాలు. కొన్ని పరిస్థితులకు ఎదురీదవలసి వచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉండవచ్చు. కళారంగం వారికి అవకాశాలలో నిరాశ. వారం మధ్యలో శుభవార్తలు. స్థిరాస్తి లాభం. దైవదర్శనాలు. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం ఎంతటి కార్యక్రమం చేపట్టినా ఎవరి తోడు లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. ఖర్చులు అదుపులోకి వస్తాయి. దూరపు బంధువులు సుదీర్ఘకాలం తరువాత కలుస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుని అవకాశాలు సాదిస్తారు. కుటుంబసమస్యలు నేర్పుతో పరిష్కరించుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగిపోతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితికి మార్గం ఏర్పడుతుంది. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. తెలుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం తొలగుతుంది. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల విషయంలో కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజం చేసుకుంటారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. స్వల్ప అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఇతరులకు సైతం చేయూతనిచ్చి వారి ఆదరణ పొందుతారు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం నూతన కార్యక్రమాలు చేపడతారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందడుగు వేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ప్రత్యర్థులు కూడా మీ దారికి వస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న అవకాశాలు పొందుతారు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో గందరగోళం తొలగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. అనుకున్న సమయానికి నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు అపవాదులు తొలగి ఊరట లభిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి మొదట్లో ఇబ్బందికరంగా ఉన్నా క్రమేపీ అధిగమిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల నిర్వహణపై చర్చలు సఫలమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల నుంచి అందిన సందేశం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. ఏ వ్యవహారం చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘసేవలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. నేరేడు, ఆకుపచ్చ రంగులు. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక ఆందోళన. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావలసిన బాకీలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. ధార్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు లభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు, చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో అకారణంగా విరోధాలు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం కొత్త పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, అభిమానం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం ఎదుర్కొన్న కొన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలురుగా మార్చుకుంటారు. ఆరోగ్యం గతం కంటే కొంత మెరుగుపడుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు పదవులు ఊరిస్తాయి. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
undefined
click me!