Your Weekly Horoscopes: ఓ రాశివారికి వారాంతములో అనుకోని ప్రయాణం,శుభవార్తా శ్రవణం

First Published Feb 5, 2023, 8:00 AM IST

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం
 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి  ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

 మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
అనవసర  ప్రయాణాలు వలన అలసట శారీరక బలహీనత ఏర్పడను. ప్రభుత్వ అధికారులతోటి కలహాలు ఏర్పడవచ్చు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. సమాజమునందు చేదు అనుభవాలు మరియు ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. ఆయుధాలు మరియు పనిముట్లు మరియు చేయ పని యందు జాగ్రత్త అవసరము. రక్త సంబంధీకులు తో మనస్పర్ధలు ఏర్పడతాయి. వస్తువులు కొనుగోలు విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. మానసికంగా శారీరకంగా బలహీన పడతారు. కొన్ని సంఘటనను వలన మనసునందు భయం ఏర్పడవచ్చు ‌. చేయ ఖర్చుయందు ఆలోచించి ఖర్చు చేయవలెను. వారాంతంలో కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారం నందు ధన లాభం కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
వృత్తి వ్యాపారమునందు అధిక ధనం లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇతరులపై కోపం తగ్గి ఆప్యాయత పెరిగి అన్ని పనులు చక్కబెట్టు గలరు. పొదుపు మార్గాలపై అన్వేషణ చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సంఘము నందు మీ ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పై అధికారులు ఆదర అభిమానాలు పొందగలరు. అనుకోని ధన లాభం కలుగుతుంది. ప్రారంభంలో నిలిచిపోయిన పనులు పూర్తవును. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వారాంతంలో మనస్సునందు అనేక ఆలోచనలతోటి చికాకుగానుండును. కొన్ని సంఘటనలు వలన నిరాశ నిస్పృహలకు లోనవుతారు. చేయ వ్యవహారం నందు తికమక గా ఉండను.
 

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
చేతికి వచ్చిన ధనము అనవసరమైన ఖర్చుల తోటి వృధాగా పోవును. చేయు వ్యవహారము నందు బుద్ధి స్థిరత్వం లేకపోవడం వలన వ్యవహారములు చికాకు పుట్టించును . కుటుంబమునందు భార్య సంతానముతోటి కలహాలు ఏర్పడను. ఉద్యోగమనందు అధికారులచే పని ఒత్తిడిలు ఎక్కువగా నుండును. ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించవలెను. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనుకున్న పనులు మందకోడిగా సాగటం వలన మానసిక ఆందోళన పెరుగును. చర స్థిరాస్తుల విషయాలలో కొద్దిపాటి సమస్యలు ఏర్పడను. విద్యార్థులు చదువు యందు శ్రద్ధ వహించవలెను. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార విషయాలలో అధిక పెట్టుబడులు ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. వారాంతంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడను. చేయ పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. ‌ మనసునందు అనేక ఆలోచనలు తోటి తికమకగా ఉండను.
 

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
వృత్తి వ్యాపారాలు లాభసాటిగా మార్చేందుకు చేయి కృషి ఫలించును . కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు. సమాజం నందు సన్మానాలు బహుమానాలు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. శారీరిక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. ప్రయత్నించిన కార్యములు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగమునందు పై అధికారుల తోటి సత్సంబంధాలు మెరుగుపడి  మీ పనులను చక్కబెట్టుకుంటారు. కీలకమైన సమస్యల యందు ధైర్యముతోటి ముందుకు వెళతారు. ఆర్థికంగా బలంగా ఉంటుంది. బంధుమిత్రులు యొక్క సహాయ సహకారాలు లభించును. గతంలో  నిలిచిపోయిన వ్యవహారములు పరిష్కార మార్గాలు దొరుకును. దూరపు ప్రయాణాలు కలిసి వచ్చును. వారాంతంలో శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
 

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.సమాజము నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. ఉద్యోగమునందు అధికారుల ఒత్తిడిలో తగ్గి ప్రశాంతత లభిస్తుంది.బహుమానాలు అందుకుంటారు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల యొక్క ఆదరణ పొందగలరు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. కీలకమైన సమస్యల యందు తల్లిదండ్రుల సూచనలు తీసుకోవాలి. నిరుద్యోగులకు అనుకూల వార్తలు వింటారు. నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. నూతన వస్తూ వాహనాది విలాసవంతమైన వస్తువుల కొరకు అధికంగా ఖర్చు చేస్తారు. వారాంతంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. సమాజము నందు అపవాదములు ఏర్పడను. మిత్రుల తోటి సఖ్యతగా ఉండవలెను.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
అకారణంగా వ్యాపారం నందు ధన నష్టం వాటిల్లుతుంది. ఇతరులతోటి సంభాషణ  ఆచితూచి చేయవలెను. కొత్త వ్యాపారాలు ఆలోచనలు ఈ వారం వాయిదా ఎడ మంచిది. ఆరోగ్య విషయాలు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఉద్యోగమునందు అధికారులచే సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. సమాజం నందు అపవాదములు ఏర్పడగలవు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడగలవు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించవలెను. చరస్థిర ఆస్తులు యందు వివాదాలు ఏర్పడను. అనవసరమైన విషయాల యందు దూరంగా ఉండవలెను. బంధుమిత్రులతోటి విభేదాలు రావచ్చు. వాహన ప్రయాణానందు జాగ్రత్తలు తీసుకొనవలెను. వారాంతంలో వృత్తి వ్యాపారం నందు ఊహించని ధనలాభం కలుగును అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులు పరిచయాలు వలన అభివృధ్ధికి తోడ్పడతాయి. ప్రారంభించి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సౌఖ్యం లభించును. ఉద్యోగమునందు అధికారులు అనుకూలమైన మార్పులు రావచ్చును. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. గృహమునందు సమస్యల తీరి ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ఊహించని ధన లాభం అందుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు తీరి ప్రశాంతత లభిస్తుంది. వారాంతంలో ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండండి. అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవకాశాలు ఊరించి చివరకు లభించును. సంఘం నందు అపవాదములు ఏర్పడగలవు. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువగా నుండును. వృత్తి వ్యాపారం అంతంత మాత్రము గా నుండును. జై వ్యవహారములు యందు ఎదుటివారిపై ఆవేశం తగ్గించుకుని వ్యవహరించవలెను. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. మిత్రులచే నమ్మకద్రోహం ఏర్పడను. ప్రభుత్వ అధికారులతోటి వివాదాలు ఏర్పడవచ్చు. భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రావచ్చు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు వాయిదా వేయటం మంచిది. వారాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
సమస్యలకు దీర్ఘ ఆలోచనలతోటి పరిష్కార మార్గాలు దొరుకును. ప్రారంభించిన కార్యకలాపాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగమునందు అధికారులతోటి కలహాలు ఏర్పడవచ్చు. శత్రువుల విషయంలో జాగ్రత్త అవసరము. కుటుంబం నందు మరియు సంతానముతోటి ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. చేయ పని యందు అనాసక్తత ఏర్పడుతుంది. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. మిత్రులతోటి సఖ్యతగా వ్యవహరించవలెను. సమాజం నందు అవమానకర సంఘటనలు ఎదురవుతాయి. అన్ని విషయాలలోనూ ఆచితూచి వ్యవహరించవలెను ‌. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను. మానసిక ఆవేదన ఉద్రేకతలు పెరుగును. సమస్యలు ఆందోళనకరంగా మారును. వృత్తి వ్యాపారము సామాన్యంగా ఉంటాయి. వారాంతంలో అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగమునందు అధికారుల యొక్క స్నేహ సంబంధాలు బలపడతాయి.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
శరీర సౌఖ్యం లభిస్తుంది. కుటుంబ అభివృద్ధి విషయాలపై చర్చిస్తారు. విందు వినోదాలు గూర్చి  ధనాన్ని ఖర్చు చేస్తారు. వ్యాపారం నందు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజము నందు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగమునందు పని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. కీలకమైన సమస్యలు పరిష్కార మార్గం లభించును. కుటుంబ సభ్యుల తోటి ఆనందంగా గడుపుతారు. దూరపు బంధువులు కలయిక ఆనందం కలిగించెను. కేసులు వివాదాల పరిష్కారం అవుతాయి. భూ గృహ నిర్మాణం క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. సంతానం లేని వారికి శుభసంకేతాలు అందుకుంటారు. వారాంతంలో ఇతరులకు ఇతరులతోటి కలహాలు ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయంలో అతకు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఖర్చులు యందు ఆచూతూచి ఖర్చు చేయవలెను.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
వృత్తి వ్యాపారం నందు ఊహించని ధన లాభం కలుగుతుంది ‌ చేయ వ్యవహారం నందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మీ ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తగును. పెద్దల యొక్క ఆదరణ అభిమానాలు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు. చర స్థిరాస్తుల విషయాలు బాగుంటాయి. వివాహ ప్రయత్నాలు చేయవారు ప్రయత్నాలు ఫలించును. ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. వారాంతంలో ఉదర సంబంధిత అనారోగ్యాలు ఏర్పడను. మానసిక ఉద్రేకతలు పెరుగును. అకస్మాత్తుగా అనుకోని పరిణామాలు ఆందోళన కలిగిస్తాయి.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ప్రతి విషయం నందు అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. సంఘమునందు గౌరవం పలుకుబడి తగ్గును. ఇతరులకు హామీలకు జామీనులకు దూరంగా ఉండవలెను. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు ఆటంకాలు ప్రతిబంధకాలు ఏర్పడగలవు. వాహన ప్రయాణమందు జాగ్రత్తలు తీసుకొనవలెను. రావలసిన బాకీలు తెలివిగా విసుగులు చేసుకొనవలెను. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనాలోచిత పనుల వలన చిక్కులు ఏర్పడను. సమస్యలు వలన మనసునందు ఉద్రేకత భయాందోళనలు పెరుగును. శారీరక శ్రమ పెరిగి బలహీనపడతారు. ఆదాయ మార్గాలు అంతంత మాత్రముగా నుండును. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొనవలెను. ఉద్యోగమునందు అధికారుల వలన నిరాశ నిస్పృహలకు గురవుతారు. వారాంతంలో చేయరాని పనులు చేయవలసి వస్తుంది. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకొనవలెను. సమాజం నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది

click me!