Today Horoscope: ఓ రాశివారికి అపోహలు తొలిగి ఆర్దికాభివృద్ది

First Published Feb 5, 2023, 5:00 AM IST

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  
పంచాంగం:                                            
 తేది :5ఫ్రిబ్రవరి 2023
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘం
ఋతువు : శిశిరం
పక్షం : శుక్లపక్షం                                                                                       
వారము: ఆదివారం
తిథి : పూర్ణిమ రాత్రి 11 13 వరకు
నక్షత్రం :. పుష్యమి ఉదయం 11:57  ని వరకు
వర్జ్యం:    రాత్రి 2:8 ని నుండి 3:54  ని  వరకు
దుర్ముహూర్తం:సా.04.22ని. నుండి సా.05.07ని. వరకు                              
 రాహుకాలం:సా.04.30ని నుండి సా.06.00ని వరకు.                                                                  
యమగండం:మ.12.00ని. నుండి మ.01.30ని. వరకు.                                                                              
సూర్యోదయం : ఉ.06.35ని.లకు
సూర్యాస్తమయం: సా.05.53ని.లకు
మాఘ పూర్ణిమ
 

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
పనులయందు సమయస్ఫూర్తి తోటి వ్యవహరించాలి. సంఘము నందు మీ మాట నిలుపుకునేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగమనందు అధికారుల ఒత్తుడులు ఎక్కువగా నుండును. ఎదుటివారిపై  దౌర్జన్యంగా వ్యవహరించడం వలన కొత్త సమస్య ఏర్పడగలవు. మిత్రత్వం దూరం చేసుకోవద్దు. కీలకమైన సమస్యలను తగ్గించుకోవడానికి పరిష్కార మార్గాలు అన్వేషిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు తగ్గును. తొందరపాటు పనుల వలన చేయ పనులు ఆటంకాలు ఏర్పడతాయి. క్రయవిక్రయములు సామాన్యంగాను.  ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
సమాజం నందు కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. కుటుంబం నందు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది.. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవును. శారీరక మానసిక  సుఖసంతోషాలు కలుగును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. రావలసిన బాకీలు వసూలు అగును. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నూతన కార్యాలకు ఆలోచనలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారాలు యందు ధన లాభం కలుగును. ఆరోగ్యమునందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. రావలసిన బాకీలు వసూలు అగును. సంతానమునందు అధికశ్రద్ధ చూపించాలి. మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతత లభిస్తుంది. అసత్యాలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఈ రాశి వారు ఓం బృహస్పతయే నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించును. శుభవార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం లభించును. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విందు వినోద విలాసాలకు ధనం ఖర్చు చేస్తారు. తలపెట్టిన పనులలో బంధువుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉండును. నూతన వ్యాపారాల గూర్చి పెద్దవారితోటి చర్చిస్తారు. నూతన పరిచయాలు కలిసి వచ్చును. మానసికంగా చిక్కులు గాని చికాకులు గాని లేకుండా ప్రశాంతంగా ఉండును. ఈరోజు ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం విష్ణువే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
సమాజం నందు ఉన్నత శ్రేణి వ్యక్తులచే పరిచయాలు ఏర్పడతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబమునందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడను. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. కీలకమైన సమస్యలు కలవరము పెట్టును . జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మి యైనమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ధన నష్టం వాటిల్లుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. చేయ పని వారితోనే ఇబ్బందులుంటాయి. తలపెట్టిన పనులలో అడ్డంకులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితోటి మనస్పర్ధలు రావచ్చును. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చెడు వార్తలు వినబడు. అధిక శ్రమ ఏర్పడుతుంది. కీలకమైన విషయాలలో వ్యతిరేకదులు ఏర్పడి నష్టపోదురు.  సమాజము నందు గౌరవ మర్యాదలు తగ్గును. మిత్రులతో టి సఖ్యతగా మెలగవలెను.  వాహన ప్రయాణం నందు జాగ్రత్త అవసరము.ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
చికాకులు అధికంగా ఉండును. ఆశించిన మేర వృత్తి వ్యాపారాల్లో లబ్ధి చేకూరదు. నూతన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండను. కొన్ని విషయాల్లో తప్పు దారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. ఆదాయాన్ని పెంచే ఆలోచనలు చేస్తారు. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయ పనులు ఫలిస్తాయి. సమాజము నందు అకారణంగా కలహాలు ఏర్పడవచ్చు. మనసునందు భయంగా ఉండును.శత్రువులచే ఇబ్బందులు లకు గురి అవుతారు. ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
అధికారులతోటి పేచీలు రావచ్చును. ఎదుటివారిపై ఆవేశం తగ్గించుకొని మాట్లాడవలెను. మిత్రుల వలన నమ్మకద్రోహం ఏర్పడను. మనసునందు అనేక ఆలోచనలు ఎక్కువగా నుండును. కష్టపడిన వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగును. చేయు పనుల యందు ఆచితూచి అడుగులు వేయవలెను. సమాజము నందు మాట విలువ తగ్గుతుంది.అధైర్యం అశాంతి ఏర్పడుతుంది. ప్రతిబంధకాలు  కీలకమైన సమస్యలు గూర్చి పరిష్కార మార్గాలు అన్వేషణ చేస్తారు. ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. రావలసిన పాత బాకీలు వసూలు అగును. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. సమాజము నందు ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.  ప్రయాణాలు అనుకూలించును. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరుస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కారం అగును. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. శారీరక శ్రమ తగ్గి ప్రశాంతత లభించును. విందు  వినోదాలలో పాల్గొంటారు. వ్యాపార భాగస్వామి తోటి సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను. వివాదాలకు దూరంగా ఉండండి. పెద్దల యొక్క ఆదరణ పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభించును. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండును. ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. ఈరోజు ఏ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
అనవసరమైన ఖర్చులు చేస్తారు. కుటుంబమునందు సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త తీసుకొనవలెను. సంతానము నుండి ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉండును. బంధువర్గముతోటి మనస్పర్ధలు రావచ్చు. మనసునందు అనవసరమైన భయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల యందు ఆశించిన ధనలాభం కలగదు. అన్నదమ్ములతోటి సఖ్యతగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓంగం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.  ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. అనవసరమైన విషయాలతోటి సమయం వృధా చేస్తారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. మిత్రులతోటి సఖ్యతగా ఉండవలెను. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. ఉద్యోగం నందు వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చును. కోపం అదుపులో ఉంచుకొని వ్యవహారాన్ని చక్కబెట్టుకొనవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

click me!