Published : Apr 03, 2026, 03:42 PM ISTUpdated : Apr 03, 2026, 03:53 PM IST
సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి సంఖ్యకు ప్రత్యేక శక్తి, లక్షణాలు ఉంటాయి. కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. వారు జీవితంలో కచ్చితంగా ధనవంతులు అవుతారని న్యూమరాలజీ చెబుతోంది. మరి ఏ తేదీల్లో పుట్టినవారు ఇంతటి అదృష్టాన్నికలిగి ఉంటారో చూద్దామా..
జ్యోతిష్య శాస్త్రంలో ఒక భాగమైన సంఖ్యాశాస్త్రం, కొన్ని అంకెలను చాలా అదృష్టమైనవిగా పరిగణిస్తుంది. 1 నుంచి 9 వరకు ఉన్న మూల సంఖ్యల ఆధారంగా వ్యక్తుల స్వభావం, కెరీర్, ప్రవర్తన, భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేయచ్చు. సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏయే అంకెలు అదృష్టాన్ని, సంపదను తెచ్చిపెడతాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
24
మూలసంఖ్య 1
సంఖ్యా శాస్త్రంలో మూలసంఖ్య 1ని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 1. ఈ సంఖ్యకు అధిపతి సూర్య భగవానుడు. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు.. ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, గౌరవం, కీర్తిని ప్రసాదిస్తాడు. సూర్యుడి శక్తి వల్ల వీరికి నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఉంటాయి. ఈ లక్షణాల వల్లే 1వ సంఖ్య వారు గొప్ప నాయకులుగా ఎదుగుతారు. ఉన్నత పదవులు పొంది, తక్కువ టైంలో ధనవంతులు అవుతారు.
34
మూలసంఖ్య 5
మూల సంఖ్య 5కి అధిపతి బుధ గ్రహం. సంపద, వ్యాపారం, తెలివితేటలు, వాక్కుకు కారకుడు బుధుడు. ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 5. ఈ సంఖ్య కలిగినవారు కమ్యూనికేషన్‌లో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు చాలా తెలివైనవారు, ఏ పని చేసినా అందులో రాణిస్తారు. 5వ సంఖ్య ఉన్న వ్యక్తులు గొప్ప వ్యాపారవేత్తలుగా మారి, జీవితంలో అపారమైన విజయాన్ని సాధిస్తారు. తద్వారా భారీగా డబ్బు సంపాదిస్తారు.
సంఖ్యాశాస్త్రంలో 6వ సంఖ్యను చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ సంఖ్యకు అధిపతి శుక్ర గ్రహం. సంపద, కీర్తి, వైభవం, గ్లామర్, ప్రేమకు శుక్రుడు కారకుడు. అందుకే 6వ సంఖ్యలో పుట్టినవారు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 6. పండితుల ప్రకారం వీరు చాలా త్వరగా ధనవంతులు అవుతారు. అందరూ వీరి పట్ల సులభంగా ఆకర్షితులవుతారు. వీరు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు, అలాంటి జీవితాన్నే పొందుతారు. ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం వీరి బలం. ఈ నెట్‌వర్క్ వల్ల వీరికి మంచి అవకాశాలు వస్తాయి. డబ్బును ఆకర్షించే శక్తి వీరిలో సహజంగా ఉంటుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.