ఈ రాశివారికి బద్దకమే బలహీనత.. మరి మీకు..?

Published : Jan 28, 2022, 10:37 AM IST

ఈ రాశివారికి కంగారు చాలా ఎక్కువ. కంగారు కంగారుగా పనులు  చేస్తూ ఉంటారు. ఈ కంగారులో.. ఎక్కువగా తప్పులు చేస్తూ ఉంటారు. కాసేపు నిదానంగా ఆలోచించి పనులు చేస్తే.. తప్పులు జరగకుండా ఉంటాయని ఆలోచించరు.

PREV
113
ఈ రాశివారికి బద్దకమే బలహీనత.. మరి మీకు..?

మనిషి అన్నాక అన్ని ఎమోషన్స్ ఉంటాయి. దుఖం, ఆనందం, బాధ, కోపం, సంతోషం ఎలాగైతే ఉంటాయో.. ప్రతి ఒక్కరికీ కొన్ని బలాలు, బలహీనతలు కూడా ఉంటాయి. చాలా మంది తమ బలాలు ఏంటో తెలుస్తాయి. కానీ.. తమ బలహీనతలు మాత్రం  తెలుసుకోలేరు. అయితే.... జోతిష్య శాస్త్రం ప్రకారం..  ఏ రాశివారి బలహీనత ఏంటో తెలుసుకోవచ్చట. మరి చూసేద్దామా..

213

1.మేష రాశి..
ఈ రాశివారికి ఆలోచన తక్కువ. ఏదైనా వచ్చినప్పుడు.... ఒక్క నిమిషం కూడా అదేంటి అని ఆలోచించకుండా.. ముందకు దూసుకుపోతుంటారు. అయితే.. అది అన్నిసార్లు మంచి చేస్తుందనే గ్యారెంటీ లేదు. ఇదే ఈ రాశివారి బలహీనత. ఆలోచించకుండా పనులు చేసేస్తుంటారు.

313

2.వృషభ రాశి..

ఈ రాశివారికి ఉండాల్సిన దానికన్నా బద్దకం చాలా ఎక్కువ. ఈ బద్దకం కారణంగా.. వారు తమ జీవితంలో తొందరగా వెనకపడిపోతూ ఉంటారు. నిన్న చేయాల్సిన పనిని.. ఈ రోజు మొదలు పెట్టాలా వద్దా అని ఆలోచించే దగ్గరే ఉంటారు. ఇదే వీరిలోని బలహీనత.

413

3.మిథున రాశి..
ఈ రాశివారికి కంగారు చాలా ఎక్కువ. కంగారు కంగారుగా పనులు  చేస్తూ ఉంటారు. ఈ కంగారులో.. ఎక్కువగా తప్పులు చేస్తూ ఉంటారు. కాసేపు నిదానంగా ఆలోచించి పనులు చేస్తే.. తప్పులు జరగకుండా ఉంటాయని ఆలోచించరు.

513

4.కర్కాటక రాశి..

ఈ రాశివారు చాలా సెన్సిటివ్.  ఎదైనా  టఫ్ సిట్యూవేషన్ వచ్చినప్పుడు.. తమకు తాము స్ట్రాంగ్ గా నిలపడలేరు. తమకోసం తాము నిలపడటానికి కూడా ఆలోచిస్తారు.

613

5.సింహ రాశి..
ఈ రాశివారు ఈగో చాలా ఎక్కువ. కోపం కూడా అంతే ఎక్కువ. అందరిపై తమ కోపాన్నీ, ఈగోని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇదే వీరిలోని అతి పెద్ద బలహీనత. అదే వారిని నాశనం చేసేస్తుంది.

713


6.కన్య రాశి..
ఈ రాశివారు ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. దానికోసమే పాకులాడుతూ ఉంటారు. దాని వల్ల వారు తీవ్ర ఒత్తిడికి గురై.. వారి జీవితంలో లేని పోని సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు.

813

7.తుల రాశి..
ఈ రాశివారు ప్రతి విషయాన్ని బ్యాలెన్స్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. అది తాము అనుకున్నట్లుగా చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఒత్తిడికి గురౌతూ ఉంటారు.

913


8.వృశ్చిక రాశి..
వీరు ఎవరితోనూ సరిగా మాట్లాడరు. ఎదుటివారితో సరిగా కమ్యూనికేట్ చేయడం వీరికి రాదు. అందరి ముందు.. ముఖ్యమైన విషయం చెప్పాల్సి వచ్చినా.. వీరు చెప్పలేరు. చాలా మొహమాట పడిపోతుంటారు.

1013

9.ధనస్సు రాశి..
ఈ రాశివారు చాలా మూడీ పర్సన్స్. తమ ఎమోషన్స్ ని తొందరగా బయట పెట్టరు. దీంతో.. వీరీ ఫిలింగ్స్ ఎదుటివారు అస్సలు అర్థం చేసకోలేరు. 

1113

10.మకర రాశి..
ఈ రాశివారికి కోపం, ఫ్రస్టేషన్  చాలా ఎక్కువ. ఎదుటివారిపై వీటిని చూపిస్తూ ఉంటారు. అయితే.. వీరి కోపాన్ని తట్టుకోవడం  చాలా మందికి కష్టంగా ఉంటుంది. దీంతో.. వీరికి దూరమైపోతుంటారు.

1213

11.కుంభ రాశి..
ఈ రాశివారు ఇంట్రావర్టర్స్. మనసులోని మాటను బయట పెట్టలేరు. చాలా మొహమాటం ఎక్కువ. తమ మనసులోని మాటను తమలోనే ఉంచేసుకుంటూ ఉంటారు.  అవసరమైనదానికంటే ఎక్కువగా చేస్తుంటారు.

1313

12.మీన రాశి..
ఈ రాశివారు ప్రతి విషయంలోనూ ఎదుటివారి కోసం బతికేస్తూ ఉంటారు. వారి ఎమోషన్స్ ని కూడా.. ఎదుటివారికి తగినట్లుగా మార్చేసుకుంటారు. వారికి నచ్చినట్లుగా ఉండలేరు.

click me!

Recommended Stories