చాలా మంది వాస్తు ప్రకారం తమ ఇంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే.. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించడం మాత్రమే కాదు... ఇంట్లో ఉంచే వస్తువుల విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే మంచిది అయితే... కొన్ని వస్తువులు ఉంచకపోవడమే ఉత్తమం.
కాగా.. ఇంట్లో చాలా మంది తాబేలు బొమ్మని పెట్టుకుంటారు.అది కూడా క్రిస్టల్ తో చేసిన తాబేలును ఉంచుకుంటారు. అది ఇంట్లో ఉంచుకోవాలా ..? ఉంటే.. అది ఇంట్లో ఏ దిక్కున ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు ప్రకారం ఇంట్లో క్రిస్టల్ తాబేలు బొమ్మ ఉంచుకుంటే... ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుందట. ఇక.. ఈ క్రిస్టల్ తాబేలును మనం.. దక్షిణం దిక్కున ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచి జరుగుతుందట.
vastu pooja room
మీ ఇంట్లో ఈ క్రిస్టల్ తాబేలును కనుక మీ పడక గదిలో బెడ్ కి దగ్గరలో పెట్టుకుంటే... మీకు మంచి నిద్ర లభిస్తుందట. అది కూడా ప్రశాంతమైన నిద్ర అందిస్తుందట. నిద్రలో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ తాబేలు పోగొట్టేసి.. మీకు ప్రశాంతమైన నిద్రను అందించడంలో సహాయం చేస్తుంది.
మీరు కనుక ఈ క్రిస్టల్ తాబేలును మీ పూజ గదిలో ఉంచుకుంటే... మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అది కూడా.. పసుపు రంగు క్లాత్ లో చుట్టి పెడితే.. మరింత మంచి జరిగే అవకాశం ఉంది.
money
మీరు మీ ఇంట్లో డబ్బులు ఆకర్షించాలి అంటే.. ఇంట్లో ఈ క్రిస్టల్ తాబేలును ఉంచుకోవచ్చు. అయితే.. ఆ క్రిస్టల్ తాబేలును కనుక మీరు.. మీ లాకర్ లో దాచుకుంటే మీ ఇంట్లో సంపద మరింత పెరుగుతుంది. సులభంగా డబ్బును ఆకర్షించవచ్చు.
orange door
మీ ఇంటి గుమ్మం ఎదురుగా ఈ క్రిస్టల్ తాబేలును ఉంచితే.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతేకాదు.. గుమ్మం మీద ఉండటం వల్ల.. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆపగలదు.
couple fight
చాలా మందికి ఇంట్లో తరచూ గొడవలు అవుతూ ఉంటాయి. అయితే... అలాంటి గొడవలు రాకుండా.. ఇంట్లో ఎప్పూ సంతోషంగా ఉండాలన్నా.. ప్రశాంతంగా ఉండాలన్నా.. ఈ క్రిస్టల్ తాబేలును కచ్చితంగా ఉంచుకోవాలి.
అంతేకాదు.. మీరు మీ కెరీర లో దూసుకుపోవాలన్నా మీ ఇంట్లో ఈ క్రిస్టల్ తాబేలు ఉండాల్సిందే. ఇంట్లో ఆ క్రిస్టల్ తాబేలును ఉంచుకొని.. ఆఫీసుకు వెళ్లేముందు దీనిని చూసి వెళ్తే సరిపోతుంది. దక్షిణ దిక్కులో దీనిని ఇంట్లో ఉంచితే.. మీరు ఆర్థికంగా బలపడటంతోపాటు... మీ కెరీర్ కూడా దూసుకుపోతుంది.