సొంత రాశిలోకి శుక్రుడు.. నవంబర్‌లో ఈ 3 రాశుల పంట పండినట్లే!

Published : Oct 25, 2025, 03:14 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపద, సౌందర్యం, ప్రేమకు ప్రతీకగా పేరుగాంచిన శుక్రుడు త్వరలో తన సొంత రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం ద్వారా  కొన్ని రాశులవారి జీవితంలో అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయి. దాదాపు నెల రోజులపాటు మంచి ఫలితాలు పొందనున్నారు.   

PREV
14
శుక్రుడి సంచారం

నవగ్రహాలలో సంపదకు ప్రతీకగా భావించే శుక్రుడిని అసుర గురువుగా కూడా పిలుస్తారు. వృషభ, తుల రాశులను పాలించే శుక్రుడు అందం, ప్రేమ, విలాసం, శ్రేయస్సుకు కారకుడు. ఒక వ్యక్తి వైవాహిక జీవితం, ప్రేమ సంబంధాల్లో సంతోషంగా ఉండాలంటే అతని జాతకంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉండటం అవసరం. నవంబర్ 2న శుక్రుడు తన సొంత రాశి అయిన తుల రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టం తీసుకువస్తుంది. ఆర్థికంగా పురోగతి, వృత్తిలో అభివృద్ధి, ఉద్యోగాల్లో విజయం దక్కనుంది. మరి శుక్రుడి సంచారంతో ఆర్థికంగా లాభపడే రాశులేంటో చూద్దామా.. 

24
తుల రాశి

తుల రాశి మొదటి ఇంట్లోకి శుక్రుడు రాబోతున్నాడు. దీనివల్ల ఈ రాశి వారి వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. కొత్త అవకాశాలు దక్కుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనుల్లో అడ్డంకులు తొలగిపోయి విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ సమస్యలు తీరుతాయి. సంబంధాలు మెరుగుపడతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగుల ప్రతిభకు మంచి గుర్తింపు దక్కుతుంది.

34
కుంభ రాశి

కుంభ రాశి 9వ ఇంట్లోకి శుక్రుడు రాబోతున్నాడు. దీనివల్ల నవంబర్ నెలలో ఈ రాశి వారికి అదృష్టం తోడుగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం దక్కుతుంది. అంతేకాదు కొన్ని ప్రయాణాలు ఆర్థిక లాభాలను తెస్తాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. ఈ రాశివారు మంచి మాటతీరు, తెలివితేటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులతో ఉన్న వివాదాలు సర్దుమణుగుతాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. 

44
మకర రాశి

మకర రాశి 10వ ఇంట్లోకి శుక్రుడు ప్రవేశిస్తాడు. దీనివల్ల వృత్తి, వ్యాపారాలలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు బలపడతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు శుక్రుడి దయతో పెద్ద ఒప్పందాలు కుదురుతాయి. తద్వారా ఊహించని లాభాలు వస్తాయి. స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

Read more Photos on
click me!

Recommended Stories