Venus Blessings: శుక్రుడి అనుగ్రహంతో ఈ 5 రాశులవారికి రాజు లాంటి జీవితం.. డబ్బుకు లోటే ఉండదు!

Published : Feb 05, 2026, 06:11 PM IST

జీవితంలో డబ్బు, సుఖసౌకర్యాలు కోరుకోనివారు ఎవరుంటారు చెప్పండి. కొందరికి డబ్బు ఈజీగా వస్తే, మరికొందరికి ఎంత కష్టపడ్డా రాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడి అనుగ్రహం ఉన్న ఈ రాశులవారు రాజులాంటి జీవితాన్ని గడుపుతారు. వీరి జీవితంలో డబ్బుకు లోటే ఉండదు. 

PREV
17
Venus Blessings

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు సంపద, విలాసం, సుఖసంతోషాలు, కళలు, అందం, రాజ యోగాలకు కారకుడు. ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారికి డబ్బు కేవలం సంపాదన రూపంలోనే కాదు, సుఖ సౌకర్యాలు, ఆస్తులు, విలాస జీవితం రూపంలో కూడా వస్తుంది. అంతేకాదు శుక్రుడి అనుగ్రహం ఉన్న రాశులవారు సహజంగానే ఆకర్షణీయంగా ఉంటారు. ఇతరుల నుంచి సహాయం, అవకాశాలు సులభంగా పొందుతారు. మరి ఆ రాశులేంటో చూద్దామా..

27
వృషభ రాశి

జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం వృషభ రాశి శుక్రుడి స్వరాశి. ఈ రాశివారికి శుక్రుడి అనుగ్రహం సహజంగానే ఉంటుంది. వృషభ రాశివారు జీవితంలో స్థిరమైన ఆదాయం, ఆస్తులు, భోగభాగ్యాలు పొందుతారు. డబ్బును పొదుపు చేయడంలో, విలువైన వస్తువులు కొనుగోలు చేయడంలో వీరు నిపుణులు. శుక్రుడి బలం వల్ల వీరికి రాజు లాంటి జీవితం, ఆర్థిక భద్రత లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

37
తుల రాశి

తుల రాశి కూడా శుక్రుడి స్వరాశి కావడం విశేషం. శుక్రుడి అనుగ్రహం వల్ల ఈ రాశివారి జీవితంలో విలాసం, పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారం, కళలు, ఫ్యాషన్ వంటి రంగాల్లో వీరికి మంచి ఆదాయం వస్తుంది. పండితుల ప్రకారం తుల రాశివారు పెద్దగా కష్టపడకుండానే విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు.

47
మీన రాశి

మీన రాశిలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. అందుకే ఈ రాశివారికి శుక్రుడి అనుగ్రహం ఉన్నప్పుడు అసాధారణమైన సంపద యోగాలు ఏర్పడతాయి. సినిమా, సంగీతం, ఆధ్యాత్మిక రంగాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువ. డబ్బు మాత్రమే కాదు, శుక్రుడి వల్ల ఈ రాశివారి జీవితంలో సుఖసంతోషాలు కూడా పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.

57
కర్కాటక రాశి

కర్కాటక రాశివారికి కూడా శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు కుటుంబ సౌఖ్యం, ఆస్తులు, వాహనాలు, గృహ యోగాలు పెరుగుతాయి. ముఖ్యంగా మహిళల సహకారం, కుటుంబ మద్ధతు ద్వారా ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. శుక్రుడి అనుగ్రహంతో కర్కాటక రాశివారు విలాసవంతమైన జీవితం గడుపుతారని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.

67
మకర రాశి

అలాగే మకర రాశివారికి శుక్రుడు యోగకారకుడిగా మారే సందర్భాలు ఎక్కువ. శుక్ర, శని అనుకూల సంబంధం వల్ల మకర రాశివారు కష్టపడి సంపాదించిన డబ్బును భారీ ఆస్తులుగా మార్చుకుంటారు. రాజకీయం, ప్రభుత్వ రంగం, రియల్ ఎస్టేట్, పెద్ద సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల ద్వారా డబ్బుకు లోటు లేకుండా జీవిస్తారు.

77
శుక్రుడి అనుగ్రహం పొందాలంటే?

జ్యోతిష్య పండితుల సూచనల ప్రకారం శుక్రుడి అనుగ్రహం పెరగాలంటే శుభ్రత, శాంతి, సౌందర్యంపై శ్రద్ధ వహించాలి. శుక్రవారం లక్ష్మీ పూజ చేయడం, తెల్లని దుస్తులు ధరించడం, స్త్రీలను గౌరవించడం, కళలను ప్రోత్సహించడం వంటివి శుక్రుడి బలాన్ని పెంచుతాయని పండితులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories