వాస్తు శాస్త్రం ప్రకారం.. మనం చేసే పనులే మన ఆర్థిక పరిస్థితిని నిర్దేశిస్తాయి. చాలా మంది ఇంట్లో సంపద పెరగడానికి ఎంతో కష్టపడుతుంటారు. ఎన్నో పనులు చేస్తుంటారు. అయినా ఒక్కపైసా కూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇంట్లో సంపద పెరగదు. వాస్తు శాస్త్రం ప్రకారం.. రాత్రి పూట మీరు కొన్ని పద్దతులను ఫాలో అయితే ఇంట్లో సంపద పెరుగుతుంది. ఇందుకోసం ఏ చేయాలంటే?
పూజగది
చాలా మందికి రాత్రి పడుకునే ముందు ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి పడుకునే అలవాటు ఉంటుంది. దేవుడి గదితో సహా అన్ని లైట్లను ఆఫ్ చేస్తుంటారు. కానీ ఇంట్లో దేవుడి గదిని ఎప్పుడూ చీకటిగా ఉంచకూడదు. మీ ఇంట్లో సంపద పెరగాలంటే మాత్రం రాత్రి పడుకునేముందు మీ ఇంటి పూజ గది లైట్స్ తో వెలిగేలా చూడండి.
దీపం
ఉదయం, సాయంత్రం వేళల్లో దేవుడికి దండం పెట్టుకుని దీపం వెలిగిస్తుంటారు చాలా మంది. అయితే ఒక్కసారి దీపం ముట్టించిన తర్వాత అవి వెలుగుతున్నాయా? ఆరిపోయాయా? అని చూడరు. అయితే మీరు నిద్రపోవడానికి ముందు పూజగదిలో చిన్న దీపం వెలిగించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మీ ఇంట్లో సంపదకు లోటు ఉండదు.
ఇంటి ప్రధాన ద్వారం
లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు. ఆర్థిక సమస్యలు కూడా రావు. అయితే చాలా మంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతో ప్రయత్నిస్తుంటారు. కానీ ఇంటి ప్రధాన ద్వారం చీకటిగా ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి.
చీపురు
చీపురును ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు చాలా మంది ఆడవారు. కానీ ఇది మంచిది కాదు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటూ ఉండకూడదంటే మీరు రాత్రి పడుకునే ముందు చీపురును నిటారుగా ఉంచండి. ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. అందుకే చీపురును ఎప్పుడూ కూడా కిందికి వంచి పెట్టండి. లక్ష్మీదేవి రాత్రిపూట ఇంటికి వస్తుంది. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.