Today Horoscope: ఓ రాశివారు నోటిని అదుపులో పెట్టుకోవాలి? లేదంటే సమస్యలు తప్పవు

First Published | Apr 11, 2024, 5:30 AM IST

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

telugu astrology

11-4-2024, గురువారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)

మేషం (అశ్విని భరణి కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాధిపతి
అశ్విని నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) అపవాదములు రాగలవు జాగ్రత్త అవసరం. విషయాల్లో బుద్ధి స్థిరత్వం లేక ఇబ్బందులకు గురి అవుతారు.

భరణి నక్షత్రం వారికి సంపత్తార(సంపత్ తారాధిపతి బుధుడు) నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. .

కృత్తిక నక్షత్రం వారికి జన్మ తార(జన్మ తారాధిపతి రవి) ఉద్యోగాలలో సమస్యలు రాగలవు. ఆర్థిక విషయాలు నిరత్సాహపరుస్తాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు.

దిన ఫలం:-భార్యాభర్తల మధ్య సంబంధాలు బలపడతాయి.ఆరోగ్యం బాగుంటుంది.వ్యాపార కార్యకలాపాలు సక్రమంగా సాగుతాయి.ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీ సమర్థతను నిరూపించుకోవడానికి ఈరోజు మంచి అవకాశం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు కార్యాచరణ అమలు చేస్తారు. సంఘములో కీర్తి గౌరవం పెరుగుతాయి.ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాధిపతి
రోహిణి నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) బంధువర్గంతో మనస్పర్థలు రాగలవు.దుష్కార్య ఆలోచనలకు దూరంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలు సామన్యంగా ఉంటాయి.

మృగశిర నక్షత్రం వారికి మిత్ర తార(మిత్ర తారాధిపతి శుక్రుడు)ప్రయత్న కార్యాలు సిద్ధించ గలవు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు. సంసార సౌఖ్యం లభిస్తుంది.

దిన ఫలం:-కుటుంబ సభ్యులు తో సమస్యలు ఎదురవగలవు.ఉద్యోగాలలో సహోద్యోగులు వల్ల ఇబ్బందులకు గురి అవుతారు.ఇతరులతో కలహాలకు వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భార్య భర్తల మధ్య గొడవలు రావొచ్చు.  ఎవరితోనైనా ఆచితూచి మాట్లాడడం మంచిది. సమాజంలో ఏది మాట్లాడిన ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశం.ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

Latest Videos


telugu astrology

మిధునం (మృగశిర 3 4, ఆరుద్ర , పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాధిపతి
ఆరుద్ర నక్షత్రం వారికి నైధన తార(నైధన తారాధిపతి శని) వ్యవహారిక చిక్కులు. అకారణ విరోధాలు రాగలవు.వృత్తి వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

పునర్వసు నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషకరమైన వార్త వింటారు.

దిన ఫలం:-సమాజంలో గౌరవ మర్యాదలు పొందగలరు. శుభకార్య ప్రయత్నాలు చేయువారు శుభవార్తలు వింటారు.కొన్ని రోజులు గా వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు. కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు లో చురుగ్గా వ్యవహరిస్తారు.సమస్యలు పరిష్కారం అవడం వల్ల కుటుంబం వాతావరణం ఆనందంగా ఉంటుంది.సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమస్యలు ను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి.ఓం గౌర్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాధిపతి
పుష్యమి నక్షత్రం వారికి ప్రత్యక్తార(ప్రత్యక్ తారాధిపతి కేతువు ) తలచిన పనుల్లో ఆటంకాలు.కుటుంబ సభ్యులతో ప్రతికూలత.శారీరక బాధలు నిస్సత్తువ .ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ఆశ్రేష నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.

దిన ఫలం:-వైవాహిక జీవితంలో కొన్ని సమస్యల కారణంగా కుటుంబంలో ప్రతికూలంగా ఉంటుంది.ప్రశాంతత తో పరిస్థితులు పరిష్కరించు కోవాలి.బంధువులు తో గొడవలు వచ్చే అవకాశం.మానసికంగా బాధపడొచ్చు.వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. విలువైన వస్తువులు తో జాగ్రత్త అవసరం.ఓం మహాదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాధిపతి
మఘ నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) అపవాదములు రాగలవు జాగ్రత్త అవసరం.విషయాలు లో బుద్ధి స్థిరత్వం లేక ఇబ్బందులకు గురి అవుతారు.

పూ.ఫ నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి జన్మ తార (జన్మ తారాధిపతి రవి) ఉద్యోగాలలో సమస్యలు రాగలవు. ఆర్థిక విషయాలు నిరత్సాహపరుస్తాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు.

దిన ఫలం:-పనిలో ఆటంకాలు ఏర్పడతాయి.భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. వాగ్దానాలు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.బద్ధకము అలసత్వం వల్ల వచ్చే అవకాశాలను చేజారుస్తారు.విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను.కష్టానికి తగిన ఫలితాలు పొందగలరు.కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం. మీరు అనుకున్న పనులు ఏదో విధంగా కాస్త ప్రయాసత్వమైన సాధించుకోగలుగుతారు.ఓం శ్రీధరాయ నమః నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాధిపతి
హస్త నక్షత్రం వారికి పరమైత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) బంధువర్గంతో మనస్పర్థలు రాగలవు.దుష్కార్య ఆలోచనలకు దూరంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

చిత్త నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) ప్రయత్న కార్యాలు సిద్ధించ గలవు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు. సంసార సౌఖ్యం లభిస్తుంది.

దిన ఫలం:-జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు గా సకాలంలో పూర్తవుతాయి.సమాజంలో పెద్ద వారి  సహాయ సహకారాలు లభిస్తాయి. 
వ్యాపారానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అగును.విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలు లో మంచి ఫలితాలు పొందుతారు. మానసిక శారీరక ఒత్తిడి లేకుండా ఆదాయం లభిస్తుంది. నూతన ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.ఓం  నమః అని జపించండి శుభ రాజరాజేశ్వర్యై నమఃఫలితాలను పొందగలరు.
 

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి , విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాధిపతి
స్వాతి నక్షత్రం వారికి నైధన తార (నైధన తారాధిపతి శని) వ్యవహారిక చిక్కులు. అకారణ విరోధాలు రాగలవు . వృత్తి వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

విశాఖ  నక్షత్రం వారికి  సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషకరమైన వార్త వింటారు.

దిన ఫలం:-ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త వింటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.  అభివృద్ధి ప్రయత్నాలలో తోటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన  ప్రతిఫలం లభిస్తుంది.దాంపత్య జీవితం ఆనందంగా గడుపుతారు.ఓం సుదర్శనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాధిపతి
అనూరాధ నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) తలచిన పనుల్లో ఆటంకాలు.కుటుంబ సభ్యులతో ప్రతికూలత. శారీరక బాధలు నిస్సత్తువ .ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

జ్యేష్ట నక్షత్రం వారికి  క్షేమ తారాధిపతి ( క్షేమ తారాధిపతి గురువు) ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.

దిన ఫలం:-ఉద్యోగాలలో  అధికారుల ద్వారా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా ఉండాలి.వృత్తి వ్యాపారాలు చికాకులు గా ఉంటుంది.కుటుంబ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. శుభకార్య ప్రయత్నాలలో అవాంతరాలు ఏర్పడతాయి.నూతన వ్యాపార అభివృద్ధి ప్రయత్నాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.ఇతరుల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది.ఓం అర్కాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

telugu astrology


ధనుస్సు (మూల , పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాధిపతి
మూల నక్షత్రం వారికి  విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) అపవాదములు రాగలవు జాగ్రత్త అవసరం. విషయాల్లో బుద్ధి స్థిరత్వం లేక ఇబ్బందులకు గురి అవుతారు.

పూ.షాఢ నక్షత్రం వారికి  సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.

ఉ.షాఢ నక్షత్రం వారికి  జన్మ తార (జన్మ తారాధిపతి రవి) ఉద్యోగాలలో సమస్యలు రాగలవు. ఆర్థిక విషయాలు నిరత్సాహపరుస్తాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు.

దిన ఫలం:-తలపెట్టిన కార్యాలలో సహనం సంయమనం పాటించడం అవసరం.భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది.స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సమాజంలో మీ సామర్థ్యం తగిన గుర్తింపు లభిస్తుంది.ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని వర్గాల వారికి వారి వారి స్థాయికి సంబంధించి ఉన్నత గౌరవం పొందగలరు.ఓం లంబోదరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాధిపతి
శ్రవణా నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) బంధువర్గంతో మనస్పర్థలు రాగలవు.దుష్కార్య ఆలోచనలకు దూరంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి

ధనిష్ఠ నక్షత్రం వారికి  మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) ప్రయత్న కార్యాలు సిద్ధించ గలవు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు. సంసార సౌఖ్యం లభిస్తుంది.

దిన ఫలం:-వ్యవహారాల విషయంలో ఇతరుల సలహాలు సూచనలు పొందగలరు.రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఇష్టం లేని చోట ఉండడం అయిష్టత భోజనం చేయవలసి వస్తుంది.కొన్ని విషయాలు మానసిక ఉద్రేకాలకు దారితీయును. దురాలోచన అసూయ లకు దూరంగా ఉండాలి.ఓం రంగనాధాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాధిపతి
శతభిషం నక్షత్రం వారికి  నైధన తార (నైధన తారాధిపతి శని) వ్యవహారిక చిక్కులు. అకారణ విరోధాలు రాగలవు . వృత్తి వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

పూ.భా నక్షత్రం వారికి  సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషకరమైన వార్త వింటారు.

దిన ఫలం:-రుణాల విషయంలో జాగ్రత్త అవసరం.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి గాక వల్ల ఇబ్బందులు పడతారు. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది.అవసరానికి ధనం ఏదో విధంగా సర్దుబాటు జరుగుతుంది.ఆరోగ్య ప్రతిబంధకాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది.వ్యవహారములో ఆటంకాలు ఏర్పడును.బంధుమిత్రులతో కలహాలు రాగలవు.ఓం భువనేశ్వర్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాధిపతి
ఉ.భా  నక్షత్రం వారికి  ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) తలచిన పనుల్లో ఆటంకాలు.కుటుంబ సభ్యులతో ప్రతికూలత. శారీరక బాధలు నిస్సత్తువ .ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

రేవతి నక్షత్రం  వారికి  క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.

దిన ఫలం:-ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.సంతానం అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ధనధాన్యాది లాభం చేకూరును.ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకును.కుటుంబ కార్యకలాపాలపై మీ దృష్టి పెడతారు.వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆత్మబలం పెరుగుతుంది.ఓం దత్తాత్రేయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

click me!