ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టాలో తెలుసా?

First Published | Mar 30, 2024, 2:27 PM IST

మనమందరం మన ఇండ్లల్లో అక్కడక్కడ డబ్బులు పెడుతుంటాం. అయితే వాస్తు ప్రకారం ఇలా చేయడం మంచిది కాదు. ఇంట్లో డబ్బు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 
 

డబ్బు నేరుగా లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే డబ్బును పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితాన్ని మరింత సుసంపన్నంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే కొందరు మాత్రం ఎంత కష్టపడినా ఆర్థికంగా మాత్రం ఎదగలేకపోతుంటారు. డబ్బును కూడబెట్టలేకపోతుంటారు. కొన్ని కొన్ని సార్లైతే ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఉండదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. 

చాలా మంది ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బును పెడుతుంటారు. అంటే టేబుల్ మీద, కిచెన్ రూం లో, నేలపై పెడుతుంటారు. ఇలా అందరి ఇంట్లో జరుగుతుంది. కానీ  ఇలా చేస్తే మీరు లక్ష్మీదేవిని, సంపదల దేవుడైన కుబేరుని అవమానించినట్టేనంటున్నారు జ్యోతిష్యులు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు నిలవదు. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మీ ఇంటికి ప్రతికూలతను కూడా తెస్తుంది. అందుకే వాస్తు ప్రకారం.. డబ్బును ఎక్కడ పెట్టకూడదు? ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


డబ్బును అక్కడక్కడా ఉంచకూడదు

చాలా మందికి ఇంట్లో డబ్బును ఎక్కడ పడితే అక్కడ పెట్టే అలవాటు ఉంటుంది. చాలా మంది జేబుల్లోంచి డబ్బు తీసి డైనింగ్ టేబుల్ లేదా వంటగదిలో అక్కడక్కడ పెడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివిటీ ఏర్పడుతుంది. అంతేకాదు పాత నోట్లలో సూక్ష్మక్రిములు ఉంటాయి. దీనివల్ల నోట్లను ఎక్కడపడితే అక్కడ పెట్టడం వల్ల అక్కడ బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ప్రమాదం బాగా పెరుగుతుంది.
 

గుడిలో డబ్బు ఉంచొద్దు

చాలా మందికి గుడిలో ఒక చిన్న హుండీ పెట్టి అందులో పూజ చేసిన ప్రతీ సారీ డబ్బును వేస్తుంటారు. అలాగే కొంతమంది పూజాగదిలోనే డబ్బును దాస్తుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు. చాలాసార్లు పాత, చిరిగిన నోట్ల వల్ల ఇంట్లోకి నెగిటివిటీ వస్తుంది. అందుకే ఈ డబ్బును ఇంటి గుడిలో ఉంచినప్పుడు ఇంట్లో మొత్తం నెగిటివిటీ వ్యాప్తి చెందుతుంది. అయితే బ్యాంకు నుంచి కొత్త నోట్లు తెచ్చుకుంటే వాటిని ఆలయంలోనే పెట్టొచ్చు. కానీ దానిని ఒక పరిమితి లోనే ఉంచండి. ఎందుకంటే ఆలయం వాల్ట్ కాదు.
 

స్టడీ టేబుల్ 

చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల నుంచి తీసుకున్న డబ్బును స్టడీ టేబుల్ పై పెడుతుంటారు. అక్కడ వారి పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ వంటి ఎన్నో సామాన్లు ఉంటాయి. అయితే ఇక్కడ డబ్బును ఉంచడం కూడా మంచిదిగా పరిగణించబడదు. మీరు విద్యార్థి అయితే మీ డబ్బును దక్షిణ దిశలో ఒక స్థలం చూసి అక్కడే పెట్టుకోండి. 

ఈ తప్పు చేయకండి

జేబుల్లో కూడా డబ్బులను దాచుకునే అలవాటు కూడా చాలా మందికి ఉంటుంది. కానీ డబ్బును ఎక్కువగా ఉడిస్తే అది లక్ష్మీదేవిని అవమానించడమే అవుతుంది. కాబట్టి ఈ తప్పు ఎప్పుడూ చేయకండి. మీరు డబ్బులు జేబులో పెట్టాలనుకుంటే మడత చేసి పెట్టండి. కానీ ఎక్కువగా మడతపెట్టకూడదు. 
 

Latest Videos

click me!