Vastu Tips: మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయా? అయితే ఈ సింపుల్ వాస్తు చిట్కాలు పాటించండి. వంటగదిలోని బియ్యం డబ్బాలో ఈ ఒక్క వస్తువును దాచిపెడితే చాలు, మీ అదృష్టం మారిపోయి, సంపద పెరుగుతుంది.
ఇంట్లో సుఖశాంతులు, సిరిసంపదలు ఉండాలని అందరూ కోరుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని వస్తువులను సరైన దిశలో పెడితే ఆర్థిక కష్టాలు తొలగిపోయి, ధనలాభం కలుగుతుంది. మీ అదృష్టం తలుపు తెరిచేందుకు, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచేందుకు ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి.
26
మనీ ప్లాంట్
ఇంటి అందంతో పాటు సంపదను పెంచడంలో మనీ ప్లాంట్ చాలా ముఖ్యం. దీన్ని ఎప్పుడూ ఇంటికి ఆగ్నేయ (South-East) దిశలో పెట్టాలి. గమనించండి.. దీన్ని ఈశాన్య దిశలో గానీ, ఇంటి బయట గానీ అస్సలు పెట్టకూడదు.
36
పారే నీరు
వాస్తు శాస్త్రంలో పారే నీరు, డబ్బు ప్రవాహానికి సంకేతం. ఇంట్లో ఉత్తర దిశలో ఒక చిన్న వాటర్ ఫౌంటెన్ పెట్టండి. నీరు ఎప్పుడూ ఇంటి లోపలికి ప్రవహించేలా చూసుకోండి. ఇది స్థిరమైన ఆర్థిక ప్రగతికి చిహ్నం.
లాఫింగ్ బుద్దా, కప్ప.. ఇవి అదృష్టాన్ని, ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడంలో సాయపడతాయి. వీటిని ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా కనిపించేలా పెట్టాలి. వీటిని వంటగదిలో లేదా నేరుగా నేల మీద పెట్టొద్దు. డ్రాయింగ్ రూమ్ (లివింగ్ రూమ్) వీటికి సరైన చోటు.
56
లోహపు తాబేలు
తాబేలు స్థిరత్వానికి, దీర్ఘాయువుకు సంకేతం. ఒక లోహపు తాబేలును నీటితో నింపిన చిన్న గిన్నెలో ఉంచి, ఇంటికి ఉత్తర దిశలో పెట్టండి. ఇది ఇంటి యజమానికి దీర్ఘాయువును ఇవ్వడమే కాకుండా, క్రమంగా ఇంటి సంపదను పెంచుతుంది.
66
బియ్యం డబ్బాలో దీన్ని దాచిపెట్టండి
హిందూ ధర్మంలో బియ్యాన్ని సమృద్ధికి చిహ్నంగా భావిస్తారు. అందుకే రెండు వెండి నాణేలు లేదా పసుపు కొమ్మును ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి, బియ్యం డబ్బాలో ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టండి. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణేశ్వరి దేవి కృప మీపై ఉండి, ఇంట్లో ఎప్పుడూ సిరిసంపదలు నిండి ఉంటాయి.