వాస్తు ప్రకారం.. ఉదయం లేవగానే ఇవి అస్సలు చూడకండి..!

First Published Oct 15, 2024, 3:14 PM IST

వాస్తు మన జీవితాలను చాలా ప్రభావితం చేస్తుంది. మరి, ఆ వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఉదయం లేవగానే కొన్ని వస్తువులను చూడటం  మంచిది కాదట. వాటిని చూడటం వల్ల ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయట. మరి, వేటిని చూడకూడదో ఓసారి చూద్దాం...

హిందూ మతంలో వాస్తు శాస్త్రం చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం.. ఇల్లు ఏ దిశలో ఉండాలి? ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి..? ఏవి ఉండకూడదు..? పూజ గది ఎలా ఉండాలి లాంటి అనేక విషయాలను కూడా చెబుతారు. అంతేకాదు.. వాస్తు శాస్త్రం.. మనం ఏమి చూడాలి? ఏం చూడకూడదో కూడా చెబుతుందట. ముఖ్యంగా.. ఉయదం లేవగానే కొన్ని వస్తువులు అస్సలు చూడకూడదట. వాటిని చూడటం వల్ల.. డబ్బు నష్టం ఎక్కువగా ఉంటుదట. మరి.. వేటిని చూడకూడదో తెలుసుకుందాాం..

ఉదయం లేవగానే చూడకూడనివి చాలా ఉన్నాయట. వాటిని చూడటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుందట. అంతేకాదు.. ఇంట్లోవారికి ఇబ్బందులు రావడం, ఆర్థిక సమస్యలు రావడం లాంటివి జరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఉదయం లేవగానే.. ఏవేవో చూడటానికి ముందుగా.. మన అరచేతులు చూసుకోవాలి.  ఇంట్లో చాలా మంది పెద్దలు ఉదయం లేవగానే ముందుగా చేతులను చూడాలని చెబుతారు. ఎందుకంటే లక్ష్మీదేవి చేతుల్లో ఉంటుందని నమ్ముతారు. అందుకే ఉదయం మన చేతులను చూస్తే ఆ రోజు మంచి జరుగుతుందని నమ్మకం. కానీ మన దినచర్యలో చాలా విషయాలు ఉంటాయి. అందుకే ఉదయం లేవగానే కొన్నింటిని చూడకూడదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఉదయం లేవగానే చూడకూడని 5 వస్తువులు ఏమిటి? దీనికి కారణం ఏమిటి? దీని గురించి వాస్తు నిపుణులు వివరణ ఇచ్చారు.

Latest Videos


ఉదయం లేవగానే ఈ 5 వస్తువులు చూడకూడదు

విరిగిన అద్దం:

విరిగిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. ఒక వ్యక్తి ఉదయం అలాంటి అద్దాన్ని చూస్తే, అది అశుభంగా భావిస్తారు. అది ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని నమ్ముతారు. దీన్ని నిర్లక్ష్యం చేసేవారికి చెడు జరుగుతుందని చెబుతారు.

నీడ:

ఉదయం లేవగానే నీడను చూడకూడదు. మీ నీడ అయినా లేదా ఇతరుల నీడ అయినా చూడకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే నీడను చూస్తే, అది మీకు అశుభం కావచ్చు. ఇది మరణం, ద్వేషం లేదా చీకటితో ముడిపడి ఉంటుంది.

ఆగిపోయిన గడియారం:

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో గడియారం ఆగిపోయినా లేదా విరిగిపోయినా, దాన్ని మీ ముందు ఉంచుకోకండి. ఇది అశుభం. మీరు ఉదయం లేవగానే ఆగిపోయిన గడియారాన్ని చూస్తే, అది మీ జీవితంలో ఒక పెద్ద సమస్య రాబోతుందనే సంకేతంగా భావిస్తారు.

విరిగిన విగ్రహం:

విరిగిన ఏ దేవతా విగ్రహాన్నీ ఇంట్లో ఉంచుకోకూడదని జ్యోతిష్యులు చెబుతారు. పూజ గదిలో కూడా ఉంచుకోకూడదు. అలా ఇంట్లో విరిగిన విగ్రహాలను ఉంచుకుంటే అది జీవితంలో ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. దీనితో పాటు, ఒక వ్యక్తి జీవితంలో సమస్యలు పెరగవచ్చు.

మురికి పాత్రలు:

వాస్తు శాస్త్రం ప్రకారం, ఒకరు ఉదయం మురికి పాత్రలను చూడకూడదు. ఇవి సంబంధాలలో చిచ్చు పెట్టి, ఇంటి వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. దీనితో పాటు, ఇది పేదరికానికి సంకేతంగా కూడా భావిస్తారు. అందుకే రాత్రి భోజనం తర్వాత పాత్రలను కడిగి ఉంచుకుని పడుకోవడం మంచిది.

click me!