మనీ ప్లాంట్ గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

First Published | Mar 16, 2024, 3:42 PM IST

పేరుకు దగ్గట్టుగా మనీ ప్లాంట్ ఒక వ్యక్తికి ఆర్థిక ప్రయోజనాలను  అందిస్తుంది. అయితే ఈ మొక్కకు సంబంధించిన ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. వాస్తు ప్రకారం.. మనీ ప్లాంట్ ను కొన్ని విధాలుగా అస్సలు పెట్టకూడదు. దీనివల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

plant money plant

చాలా చెట్లు, మొక్కలు ఇంటి అందాన్ని పెంచడానికి మాత్రమే కాకుండా మన ఇంటికి ఆనందాన్ని, శ్రేయస్సును కూడా తెస్తాయి. ఇలాంటి మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి. ఈ మొక్క చాలా మంది ఇళ్లలో కనిపిస్తుంటుంది. అయితే మనీ ప్లాంట్ ను దొగలించి పెడితే అదృష్టం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. మరి దీనిపై వాస్తుశాస్త్రం ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

పలు నమ్మకాల ప్రకారం.. మనీ ప్లాంట్ ను దొంగిలించడం వల్ల ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడదు. మనీప్లాంట్ పచ్చగా ఉండే ఇంట్లో డబ్బుకు ఎలాంటి కొదవ ఉండదని చాలామంది నమ్ముతారు.
 


వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది?

మనీ ప్లాంట్ ను ఎప్పుడూ కూడా దొంగతనం చేసి నాటకూడదని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. మనీ ప్లాంట్ ను కొనుగోలు చేసే ఇంట్లో నాటడం మంచిది. అప్పుడే మీరు మనీ ప్లాంట్ పూర్తి ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక ప్రయోజనం కూడా కలుగుతుంది. 
 

ఈ తప్పులు చేయకండి

మీ ఇంట్లో మనీ ప్లాంట్  ఉంటే దానిని మరెవరికీ ఇవ్వకండి. ఈ మొక్కను ఎవరికైనా ఇస్తే మీ  ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు. ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. అలాగే మీ మనీ ప్లాంట్ ఎప్పుడూ కూడా భూమిని తాకకూడదని గుర్తుంచుకోండి. భూమిపై మనీ ప్లాంట్ పారడం అశుభంగా భావిస్తారు.

ఏ దిశలో మనీ ప్లాంట్ ను ఉంచాలి? 

వాస్తు ప్రకారం.. మనీ ప్లాంట్ ను సరైన దిశలోనే పెట్టాలి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ను ఇంటికి ఈశాన్య దిశలో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల మీరు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు ప్రకారం.. మనీ ప్లాంట్ ను ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు.

Latest Videos

click me!