ఇంట్లో కాసుల వర్షం కురవాలా..? ఈ చిన్నపాటి మార్పులు చేస్తే చాలు..!

First Published Jul 3, 2021, 10:44 AM IST

లాకర్, బీరువాలు లేని వారు.. తమ డబ్బు, కార్డులను ఉత్తర దిక్కు వైపు ఉంచుకోవాలి. డబ్బు నిల్వకు చిహ్నమైన కుబేరుడు ఎక్కువగా.. ఉత్తర దిక్కులో ఉంటాడట. అందుకే.. ఆ దిక్కులో పెట్టుకోవాలట.

సంపాదించడం చాలా మంది చేస్తుంటారు. కానీ.. దానిని నిల్వ చేసుకునే సత్తా మాత్రం చాలా తక్కువ మందిలో ఉంటుంది. అయితే... కొందరు ఖర్చు చేసుకోవడం వల్ల డబ్బులు అయిపోతే.. కొందరికి వాస్తులో లోపాల కారణంగా డబ్బులు అయిపోతాయి. మరి... డబ్బులు ఎలా నిల్వ చేసుకోవాలంటే.. కొన్ని రకాల వాస్తు మార్పులు చేసుకుంటే.. చాలని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
దాదాపు డబ్బులను అందరూ బీరువాల్లో, లాకర్ లో దాచుకుంటాం. ఆ లాకర్ ఏ దిక్కున ఉంది అనే విషయం పై డబ్బు నిల్వలు ఆధారపడి ఉంటాయి. లాకర్ ని ఇంటికి నైరుతి మూలలో ఏర్పాటు చేసుకోవాలి. అందులో కొంత నగదు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నగదు పుష్కలంగా ఉంటుంది.
undefined
లాకర్, బీరువాలు లేని వారు.. తమ డబ్బు, కార్డులను ఉత్తర దిక్కు వైపు ఉంచుకోవాలి. డబ్బు నిల్వకు చిహ్నమైన కుబేరుడు ఎక్కువగా.. ఉత్తర దిక్కులో ఉంటాడట. అందుకే.. ఆ దిక్కులో పెట్టుకోవాలట.
undefined
ఈ రోజుల్లో అందరూ.. ఇల్లు అందంగా కనపడాలని డెకరేషన్లు చేసుకుంటారు. కార్నర్స్ లో సైతం షెల్ఫులు పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి షెల్ఫులు ఉన్నాయి కదా.. అని వాటిల్లోనే డబ్బులు, కార్డులు పెట్టేస్తుంటారు. కానీ.. వాటిలో అస్సలు పెట్టకూడదట.
undefined
చాలా మంది డబ్బులు దాచుకునే లాకర్ ని తలుపులు... గుమ్మానికి ఎదురుగా పెడుతుంటారు. అలా పెపట్టకూడదట. ఇంటి తలుపులు, రూమ్ డోర్ తెరవగానే.. ఎదురుగా డబ్బులు దాచే లాకర్లు పెట్టకూడదట. లాకర్లపై తరచూ కళ్లు పడటం వల్ల కూడా నిల్వలు తగ్గిపోతాయట.
undefined
మీ నగదు పెట్టె లేదా లాకర్‌ను మీ ఇంటి దక్షిణ దిశలో ఎప్పుడూ ఉంచవద్దు. డబ్బు దేవత అయిన సరస్వతి దక్షిణం నుండి ప్రవేశించి ఉత్తరాన స్థిరపడుతుందని నమ్ముతారు. మీ నగదును దక్షిణ దిశకు దూరంగా ఉంచడం మంచిది లాభదాయకం. బాత్రూమ్, వంటగది, మెట్లు లేదా స్టోర్ రూమ్ దగ్గర లాకర్ లేదా సురక్షితంగా ఇన్‌స్టాల్ చేయవద్దు.
undefined
click me!