ప్రతి ఒక్కరూ డబ్బు కోసం కష్టపడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే అనుకుంటారు. కానీ, చాలా మందికి ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిల్వదు. కొందరు ఎంత సంతోషంగా ఉండాలన్నా, సమస్యలు ఎదురౌతూనే ఉంటాయి. అయితే, వాస్తు ప్రకారం మనం ఆ సమస్యలను పరిష్కరించవచ్చట. వాస్తు శాస్త్రం ప్రకారం, వాస్తు దోషాలను తొలగించడానికి , జీవితంలో ఆనందం శ్రేయస్సు కోసం అనేక రకాల నివారణలు సూచించాయి. మనిషి జీవితంలో చెట్లు , మొక్కలు చాలా ముఖ్యమైనవి. చాలా మంది తమ ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే, చాలా సార్లు, తెలిసి లేదా తెలియక, అవి అశుభ ఫలితాలకు కూడా దారి తీస్తాయి. చెట్లు, మొక్కలకు సరైన దిశ వాస్తు శాస్త్రంలో సూచించారు. తద్వారా ఇది ఆనందం , శ్రేయస్సును కలిగిస్తుంది. వాటిలో కరివేపాకు మొక్క కూడా ఒకటి. ఇంట్లో ఏ దిశలో కరివేపాకు మొక్కలను నాటడం శుభప్రదంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..