Baby Names: పిల్లలకు ఎలాంటి పేరు పెడితే బాగుంటుందో తెలుసా?

Published : Feb 21, 2025, 04:17 PM IST

పేరెంట్స్ పిల్లలకు అందమైన, అర్థవంతమైన పేరు పెట్టాలని కోరుకుంటారు. ఏ పేరు పెడితే తమ పిల్లలు తిరుగులేకుండా ఎదుగుతారో అలాంటి పేరు కోసం వెతుకుతూ ఉంటారు. ఎక్కువమంది దేవుళ్ల పేర్లు కలిసేలా పెడుతుంటారు. అలాంటి కొన్ని పేర్లు మీకోసం.

PREV
17
Baby Names: పిల్లలకు ఎలాంటి పేరు పెడితే బాగుంటుందో తెలుసా?

తల్లిదండ్రులు పిల్లలకు మంచి పేరు పెట్టాలని అనుకుంటారు. ఎందుకుంటే పేరు.. వ్యక్తిత్వంపై గణనీయంగా ప్రభావం చూపుతుందని అంతా నమ్ముతారు. అందుకే పేరెంట్స్ తమ పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలామంది దేవుళ్ల పేర్లనే పెడుతుంటారు. మీరు మీ పాప కోసం పేరు వెతుకుతున్నట్లయితే ఈ సరస్వతి దేవి పేర్లను ఒకసారి ట్రై చేయండి.

27
ఆడపిల్లల పేరు

ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలా సంతోషిస్తారు. లక్ష్మీదేవి పుట్టిందని అంతా అంటారు. మరి అలాంటి ప్రత్యేకమైన పాప పేరు ఇంకా ప్రత్యేకంగా ఉండాలంటే ఈ పేర్లను కచ్చితంగా చూడాల్సిందే. పేరుతో సహా అర్థాలను తెలుసుకొని మీకు నచ్చిన పేరును పెట్టేసేయండి.

 

37
అనురాధ:

అనురాధ అంటే అదృష్ట దేవత అని అర్థం. అంతేకాకుండా సంపదను తెచ్చేది అని అర్థం. రాధను అనుసరించేది అని కూడా అర్థం వస్తుంది. 

 

అనన్య: 
అద్వితీయమైనది. ఇతరులకంటే భిన్నంగా ఉండేది. సాటి లేనిది లేదా ఆకర్షణీయమైంది అని అర్థం. 

అమృత: 
అమరత్వాన్నిచ్చే పానీయం. దేవతల పానీయాన్ని అమృత అంటారు.

47
అర్పిత:

తనను తాను అర్పించుకోవడం లేదా సమర్పించడాన్ని అర్పిత అంటారు. 

 

ఆభాసి: 
ఆభాసి అనేది సరస్వతి పేరు కూడా. అంతేకాకుండా రమణీయమైన, మనోహరమైన అని కూడా అర్థం ఉంది. 

ఇందిర: 
కాంతి, శోభించేది, అందమైనది అని అర్థం ఉంది. అంతేకాకుండా లక్ష్మీదేవిని కూడా ఇందిర అంటారు. 

57
ఈశ్వరి:

ఈశ్వరి అనేది ఒక పవర్ ఫుల్ పేరు. దీని అర్థం దేవి, జ్ఞానం, శక్తి, కరుణ, పార్వతి, లక్ష్మి, దుర్గాదేవికి కూడా ఈశ్వరి అని పేరు. 

ఉమ:
సరస్వతి మాత్రమే కాదు, పార్వతి, దుర్గాదేవిని కూడా ఉమ, ఉమామహేశ్వరి అని అంటారు. 

రిచా:
రిచాకు మరొక పవర్ ఫుల్ అర్థం ఏమిటంటే పద్యంలో రచించబడిన మంత్రం లేదా శ్లోకం అని. 

67
ఏకాక్షరి:

ఏ భాషలోనైనా ఒకే అక్షరంలో రాసిన పదాన్ని ఏకాక్షరి అంటారు. సరస్వతి దేవికి కూడా ఏకాక్షరి అని పేరు. 

 

అభ: 
శోభ, కాంతి అని అర్థం. ఇది దేవుడి నుంచి వచ్చే కాంతిని సూచిస్తుంది. 

కళ:
చిత్రం, కళ, నాట్యం ఇవన్నీ సూచించేదే కళ అనే పేరు.

77
కల్పన:

కల్పన అంటే ఒక ఊహను సృష్టించడం లేదా మానసిక చిత్రాన్ని రూపొందించడం. ఇది భావాలు, ఆలోచనలు, అనుభూతుల రూపం.

గాయత్రి: 
ఋగ్వేదంలో వచ్చే మంత్రం పేరు. ఇది దేవి పేరు కూడా. మధుర వాణి దేవి గాయత్రి. 

దీపిక: 
చిన్న దీపాన్ని దీపిక అంటారు. సరస్వతి దేవిని కూడా దీపిక అనే పేరుతో పిలుస్తారు. 

click me!

Recommended Stories