
జోతిష్య శాస్త్రంలో, ప్రతి రాశి చక్రానికి జీవితంలో విజయం సాధించడానికి ప్రత్యేకమైన లక్షణాలు, ప్రతిభ, అవకాశాలు ఉంటాయి. కొందరు ఉద్యోగం చేసి బాగా రాణించగలిగితే, మరి కొందరు వ్యాపారంలో మాత్రమే బాగా రాణించగలరు. ముఖ్యంగా.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. నాలుగు రాశులకు చెందిన వారు వ్యాపారంలో రాజ్యమేలుతారు. వారు ఏ వ్యాపారం మొదలుపెట్టినా... లాభాల బాట పట్టే అవకాశం ఉంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా....
మేష రాశివారిని అంగారక గ్రహం పాలిస్తూ ఉంటుంది. ధైర్యం, మార్గదర్శక స్వభావం, త్వరిత నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. వ్యాపార ప్రపంచంలో మేష రాశివారు చక్రవర్తులు కాగలరు. ఈ రాశివారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో నష్టాలు వచ్చినా ఎదుర్కునే శక్తి వీరిలో ఉంటుంది. ఆ తర్వాత లాభాల బాట పడతారు. ఒక వ్యాపారం కలిసిరాకపోయినా.. మరో వ్యాపారం చేసి అయినా.. వీరు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోగలరు. అంగారక గ్రహ ప్రభావం కారణంగా, ఈ రాశివారు పోటీ వాతావరణంలో తట్టుకొని నిలపడగలరు. తీసుకున్న నిర్ణయాలను త్వరగా అమలు చేసి, సవాళ్లను ఎదుర్కునే సామర్థ్యం కలిగి ఉంటారు. వ్యాపారంలో దూసుకుపోతారు.
బలహీనతలు: అసహనం, కోపం వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికపై దృష్టి పెట్టడం వారికి సవాలుగా ఉండవచ్చు.
సింహ రాశివారు కూడా వ్యాపారంలో బాగా రాణించగలరు. ఈ రాశివారిని సింహ రాశి పాలిస్తూ ఉంటుంది. వీరికి అందరికీ ఆకర్షించే శక్తి ఉంటుంది. వీరిలోనూ నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు వ్యాపారంలో రాణించడమే కాదు.. తమ వ్యాపారాన్ని మంచి బ్రాండ్ గా మార్చగల శక్తి కలిగి ఉంటారు. వారి ప్రత్యేక శైలి అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. వీరు ఎందులో పెట్టుబడులు పెట్టినా.. మంచి లాభాలు సాధించగలరు. వీరి ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. మీడియా, వినోద రంగంలో వీరు బాగా రాణించగలరు.
బలహీనతలు: అధిక శ్రద్ధ అవసరం కొన్నిసార్లు వారిని అహంకారంగా చేస్తుంది. ఇతరుల అభిప్రాయాలను వినకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే ధోరణి ఉండవచ్చు.
తుల రాశివార ప్రతి విషయంలోనూ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. వీరు ప్రజలతో బాగా కనెక్ట్ అవుతారు. మాటలతో అందరినీ మంచి చేసుకుంటారు. ఫలితంగా వ్యాపారంలో విజయం సాధించగలరు. తుల రాశి వారు నైపుణ్యం కలిగిన సంధానకర్తలు. తమ వ్యాపార భాగస్వాములతో మంచి భాగస్వాములుగా ఉంటారు. నిజాయితీగా వ్యాపారం చేసి.. లాభాలు పొందుతారు. వారి సమతుల్య విధానం వ్యాపారంలో నమ్మకాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. శుక్రుని ప్రభావం వల్ల, వారు అందం, లగ్జరీ , కళ సంబంధిత వ్యాపారాలలో (ఉదా. ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైన్, సౌందర్య సాధనాలు) విజయం సాధిస్తారు.
బలహీనతలు: నిర్ణయాలు తీసుకోవడానికి ఆలస్యం చేయడం వారి పురోగతిని ఆలస్యం చేస్తుంది. అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించడం కొన్నిసార్లు వారికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది.
క్రమశిక్షణ, దీర్ఘకాలిక ప్రణాళిక, బాధ్యత లో మకర రాశివారు ముందుంటారు. ఈ రాశివారు వ్యాపార ప్రపంచంలో మహారాజులు కాగలరు. వారి క్రమశిక్షణా విధానం , కృషి వారిని చక్రవర్తులను చేస్తాయి. మకరరాశి వారు అద్భుతమైన ప్రణాళికదారులు. వారు దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి స్పష్టమైన వ్యూహాలను రూపొందిస్తారు. శని ప్రభావం కారణంగా, వారు ఆర్థిక నిర్వహణలో నిపుణులు. వారు ఖర్చులను నియంత్రిస్తారు. తెలివిగా పెట్టుబడులు పెడతారు. వారి బాధ్యత , విశ్వసనీయత కస్టమర్‌లు భాగస్వాముల మధ్య నమ్మకాన్ని పెంచుతాయి.
బలహీనతలు:కొత్త మార్పులను అంత తొందరగా అంగీకరించరు. ఇది మాత్రమే వారి బలహీనత. పనిపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల వ్యక్తిగత సంబంధాలు దూరం చేసుకుంటారు.