Today Horoscope: ఓ రాశివారి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది

First Published | Jun 5, 2024, 5:30 AM IST

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

telugu astrology

5-6-2024 బుధవారం  మీ రాశి ఫలాలు 

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ఇతరుల సహాయ సహకారాలు అందుకుంటారు. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఎన్నో ఏండ్లుగా ఉన్న అనారోగ్య సమస్యలు కాస్త ఉపశమనం కలుగుతుంది. కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. 

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మీరు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. 
 


telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. రుణ సమస్యల వేధింపు ఎక్కువ అవుతుంది. దీంతో మానసికంగా బాగా ఒత్తిడికి గురవుతారు. పాత అప్పులను తీర్చడానికి కొత్త అప్పులు చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. 
 

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఈ రోజు నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఇది మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడంతో ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు ప్రమోషన్స్ ను పొందే అవకాశం ఉంది. నూతన వస్తు, వాహనాలను కొనే అవకాశం ఉంది. 
 

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులతో కలిసి ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి వింధు, వినోధాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో మీరు అనుకున్నట్టు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ఈ సమయం కష్టంగా ఉంటుంది. 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-గత కొన్ని రోజులుగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.  ఈ రోజు నిరుద్యోగులు శుభవార్త వింటారు. బంధువులు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడిస్తారు. దైవ చింతన మనశ్శాంతిని కలిగిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. 

telugu astrology


తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-ఈ రోజు మీ తెలివితేటలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ధనలాభం, వాహన లాభం, వస్తు లాభాన్ని పొందే అవకాశం ఉంది. సమాజంలో పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు అనుకున్నట్టు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. 
 

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-మొదలు పెట్టిన పనుల్లో అవాంతరాలు ఏర్పడతాయి. పనులు ఎక్కడికక్కడే ఆగిపోతాయి. ఉద్యోగులకు ఈ రోజు ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపారంలో తొందర పాటు నిర్ణయాలు సమస్యలను కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. 
 

telugu astrology


ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంటి వాతావరణం చిరాకు కలిగిస్తుంది. రుణాలు దొరకక ఇబ్బంది పడతారు. ఉద్యోగులకు ఈ రోజు కాస్త అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-వ్యాపారాలు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. మొదలుపెట్టిన పనులు నత్తనడకగా సాగుతాయి. ధనలాభం యోగం ఉంది. వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కానీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-ముఖ్యమైన విషయాల్లో కుటుంబం, బంధు మిత్రుల సలహాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయజ. బంధువుల నుంచి ఆహ్వానం అందుకుంటారు. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పిల్లల చదువు విషయంలో ఆనందంగా ఉంటారు. 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు ఈ రోజు నిరుత్సాహంగా ఉంటారు. ముఖ్యమైన పనుల్లో తొందర పాటు వద్దు. వీటిని వాయిదా వేయడమే మంచిది. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. పనులు ముందుకు సాగక ఒత్తిడికి గురవుతారు. 

Latest Videos

click me!