Today Horoscope: ఓ రాశివారు పాత అప్పులను తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు

First Published Jul 5, 2024, 5:30 AM IST

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

telugu astrology


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ప్రయాణాల వల్ల ఎలాంటి లాభం ఉండదు. కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు.  మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.  వృత్తి వ్యాపారులకు పనిభారం పెరుగుతుంది. మిత్రులతో మీరు అనుకోని విధంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారం అంతంత మాత్రమే ఉంటుంది. 
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- శుభకార్యాలకు ఇంటిళ్లిపాది వెళతారు. సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది. మీ పలుకుబడి కూడా బాగా పెరుగుతుంది. మొదలుపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. చిన్న నాటి మిత్రులను కలుసుకోవడం వల్ల ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది.  ఉద్యోగులు పురోగతి పొందుతారు. 
 

Latest Videos


telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-పాత అప్పులను తీర్చడానికి కొత్త అప్పులను చేయాల్సి వస్తుంది. బంధుమిత్రులతో చిన్నపాటి గొడవలు అవుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. మొదలుపెట్టిన పనులను అనుకోకుండా ఆగిపోతాయి. ఉన్నపాటున ప్రయాణం చేయాల్సి రావొచ్చు.  వ్యాపార విస్తరణ ముందుకు సాగదు. ఉద్యోగులకు అధికారుల ఒత్తిడి ఉంటుంది. 
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- బంధుమిత్రుల నుంచి ఆహ్వానం అందుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి మునపటి కంటే మెరుగుపడుతుంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. పనులు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. ఉద్యోగులు ప్రోత్సాహకాలు పొందుతారు. 

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు లాభాదాయకంగా ఉంటాయి. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంట్లోకి విలువైన వస్తువులను కొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ రోజు స్నేహితులతో వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ చేపడతారు. 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- ఆర్థిక పరిస్థితి దిగజారడంతో కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. ఉన్నపాటుగా ఎటైనా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. మిత్రులతో ఒక విషయంలో మాటపట్టింపులు రావొచ్చు. కుటుంబం విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేరు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావొచ్చు. 
 

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శణం చేసుకుంటారు. ఇంట్లో వాతావరణం చిరాకు కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. అనవసరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. 
 

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-అనుకున్న సమయానికే చేపట్టిన పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు మంచి లాభాల్లో కొనసాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. ఇంటి నిర్మాణ పనులు పుంజుకుంటాయి. బంధువుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. 
 

telugu astrology


ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. నూతన వస్తు, వాహనాలను కొనే యోగం ఉంది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు. ఇంటికి దూరపు బంధువులు వస్తాయి. వ్యాపారులు మంచి పెట్టుబడులను అందుకుంటారు. నిరుద్యోగులకు ఈ రోజు కలిసి వస్తుంది. 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇది నష్టానికి దారితీస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బయట పనిభారం పెరుగుతుంది. అనుకోకుండా ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. 
 

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:- బాగా కష్టపడితేనే ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఇది వీరిని ఒత్తిడికి గురిచేస్తుంది. 

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-చిన్న నాటి మిత్రులతో ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు. బంగారం, వెండి వంటి విలువైన ఆభరణాలను కొంటారు. ఒకరి జోక్యంతో భూమికి సంబంధించిన గొడవలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగులు తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. 
 

click me!