Today Horoscope: ఓ రాశివారికి పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు

Published : Jan 04, 2024, 05:00 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది.  

PREV
113
Today Horoscope: ఓ రాశివారికి  పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
  

213
telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రతి చిన్న విషయంలో విజయం సాధిస్తారు. సోదరి వర్గం వారిచే ఆప్యాయతలు పొందగలరు.సంఘం నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. జీవిత భాగస్వామి తో కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడగలరు. ఆరోగ్య సమస్యల మీద తగు శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగం నందు పై అధికారులు యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆకస్మిక అధిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఓం లక్ష్మీ నరసింహ స్వామినే నమః   అని జపించండి శుభ ఫలితాలు ను పొందగలరు.
 

313
telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

వాయిదా పడిన పనులు పూర్తి అగును. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. సమాజములో ప్రతిభ తగ్గ గౌరవం లభించును.చిన్న చిన్న విషయాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో మీ విధి ని సక్రమంగా నిర్వహిస్తారు.వ్యాపారంలో ధన లాభం కలుగును.ఓం అష్టలక్ష్మియై  నమః   అని జపించండి శుభ ఫలితాలు ను పొందగలరు.
 

413
telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి ధన నష్టం కలుగవచ్చు. వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకొనవలెను. మనసునందు ఆందోళనకరంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఏర్పడును. అకారణంగా వచ్చే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.చిన్న విషయం కూడా చిరాకు పుట్టించును. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొత్త సమస్యలు చికాకులు పుట్టించును.ఓం అర్కాయ నమః   అని జపించండి శుభ ఫలితాలు ను పొందగలరు.
 

513
telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఉద్యోగం నందు అనుకూలమైన మార్పులు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. శారీరకంగా మానసికంగా సౌకర్యంగా ఉంటుంది.బంధుమిత్రులతో కలిసి ఆనందంగ గడుపుతారు.  ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఓం అంబికాయై  నమః   అని జపించండి శుభ ఫలితాలు ను పొందగలరు.

613
telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
వ్యాపారంలో ధన లాభం కలుగును. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సమాజములో ప్రతిభ తగ్గ గౌరవం లభించును. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్న అధికమించి ఉత్సాహంగా చేస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి .పెట్టిన పెట్టుబడులు మించి ధన లాభం కలుగుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు.ఓం మహేశ్వరాయ నమః   అని జపించండి శుభ ఫలితాలు ను పొందగలరు.

713
telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

భాగోద్వేగం చేత సమస్యలు ఏర్పడవచ్చును. అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కీలకమైన విషయాలు లో ధైర్యంగా ముందడుగు వేయండి. కుటుంబ సభ్యులు యొక్క మద్దతు మీకు ఉంటుంది. అనవసరమైన విషయాల తోటి సమయం వృధా చేయకండి. కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగించును. భార్య భర్తల మధ్య కొద్దిపాటి మనస్పర్థలు రావచ్చు. అధిక కోపం వలన కొన్ని కొత్త సమస్యలు ఏర్పడగలవు. ఓం చిరంజీనెనమః   అని జపించండి శుభ ఫలితాలు ను పొందగలరు.

813
telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

జీవిత భాగస్వామితో  మనస్పర్థలు.బంధుమిత్రులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించవలెను. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ అభివృద్ధి విషయాలు అనుకూలంగా ఉండును. ప్రయాణాలు తగు జాగ్రత్త వహించాలి. ఉద్యోగాలు నందు సహోద్యోగులు వలన సహాయ సహకారాలు లభించును. మీరంటే గిట్టని వారి తోటి కొద్దిపాటి అపకారం జరగవచ్చు జాగ్రత్త.ఓం గణపతియే నమః   అని జపించండి శుభ ఫలితాలు ను పొందగలరు.

913
telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)

సమాజంలో కొద్దిపాటి అవమానాలు కలగవచ్చు.కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి.శరీరమందు బద్ధకం చేత తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మనసులో అనేక ఆలోచనలు చికాకు పుట్టించును. మిత్రుల తోటి సఖ్యతగా మెలగవలెను.పనుల యందు శ్రమ ఎక్కువగా ఉంటుంది. విలువైన వస్తువుల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చేయ ఖర్చుల యందు జాగ్రత్త వహించాలి.
 

1013
telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రాలు (యే-యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

సంఘంలో  మీ మాటలతో  అందరినీ ఆకట్టుకుంటారు. నూతన ప్రయత్నాలు కు శ్రీకారం చుడతారు. రావలసిన పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు అనుకూలంగాఉంటుంది .మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మీ ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. తలపెట్టిన అన్ని పనులు అనుకున్నట్లుగా జరుగును.సమస్యలు నుండి బయటపడి ప్రశాంతత లభించును.ఓం శారదాయై  నమః   అని జపించండి శుభ ఫలితాలు ను పొందగలరు.

1113
telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

ఉద్యోగాలలో పెద్దల యొక్క మన్ననలు లభించను. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఇతరులతో వాదనలు వివాదాలకు దూరంగా ఉండండి. అనారోగ్య విషయాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.ఓం  నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలు ను పొందగలరు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. 
 

1213
telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. చేసే పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విలువైన వస్తువులు తో  జాగ్రత్తగా ఉండవలెను. మానసికంగా శారీరకంగా బలపడతారు. వృత్తి వ్యాపార నందు ధన లాభం కలుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి ఆలోచన చేస్తారు.కుటుంబ జీవితం ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి.ఓం రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు ను పొందగలరు
 

1313
telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చ)

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించును. వివాదాలకు దూరంగా ఉండాలి .తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతో వాదనలు  వలన కొత్త సమస్యలు రాగలవు. కీలకమైన సమస్య ను బుద్ధిబలంతో పరిష్కరిస్తారు. ఓం  శ్రీ మాత్రే నమః  అని జపించండి శుభ ఫలితాలు ను పొందగలరు.

Read more Photos on
click me!

Recommended Stories