Today Horoscope: ఓ రాశివారికి మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు.

First Published | Dec 2, 2023, 4:24 AM IST

ఈరోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు  బంధు మిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును.

2-12-2023,  శనివారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (మిత్రతార) బంధు మిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. (ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

భరణి నక్షత్రం వారికి (నైదనతార)దుష్ట సావాసాలకు దూరంగా ఉండాలి .అనవసరమైన ఖర్చులు పెరుగును . తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును ( ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

కృత్తిక నక్షత్రం వారికి (సాధన తార)నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. (మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.  కుటుంబంలో ప్రతికూల వాతావరణం. చెడు స్నేహాలు కు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగాలలో అధికారులు తో చికాకులు.  మానసిక ఆందోళనకు గురవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది.జీవిత భాగస్వామితో చర్చించి తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి.
 


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (సాధన తార)నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామితో  ఆనందంగా గడుపుతారు. (మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

రోహిణి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)చిత్ర విచిత్రమైన వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులలో జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో నిదానముగా జరుగును. ( ఓం గణపతయే నమః అని స్మరణ చేయుట మంచిది)

మృగశిర నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి కాగలవు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడిన పట్టుదలతో పూర్తి చేయాలి. మానసికంగా  ఆందోళన గా ఉంటుంది.వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండాలి .బంధు మిత్రులతో మనస్పర్థలు రాగలవు. ఉద్యోగాలలో అధికారులు తో చికాకులు. కీలకమైన సమస్యలకు పరిష్కార మార్గం లభించును.ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.
 

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి కాగలవు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

ఆరుద్ర నక్షత్రం వారికి (విపత్తార)అనవసరమైన ఖర్చులు పెరుగును.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. ( ఓం చాముండాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

పునర్వసు నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:-శుభవార్త వింటారు.స్తంభించిన పనులు పూర్తి కాగలవు.సంఘంలో  మాటకు విలువ పెరుగుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. సంతానం విషయంలో శుభవార్త వింటారు. నూతన ఆలోచనలు కలసి వస్తాయి. మొండి బాకీలు వసూలు అవును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.గత కొద్ది రోజులుగా ఉన్న సమస్యలు తొలగుతాయి.
 

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

పుష్యమి నక్షత్రం వారికి (జన్మతార)ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతో  పూర్తి చేయవలెను. ( సూర్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

ఆశ్రేష నక్షత్రం వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం (ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ఆలోచనలు కలసి వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భార్య భర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలు రాగలవు.

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (మిత్రతార)బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. (ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

పూ.ఫ నక్షత్రం వారికి (నైదనతార)దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును ( ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (సాధన తార)నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. (మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి.వివాహ ప్రయత్నాలు కు అనుకూలం. మానసిక ప్రశాంతత లభిస్తుంది.శక్తిసామర్థ్యాలు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. సహోద్యోగుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని పొదుపు మార్గాలు అన్వేషించాలి.కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. (మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

హస్త నక్షత్రం వారికి (ప్రత్యక్తార)చిత్ర విచిత్రమైన వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులలో జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులు నిదానముగా జరుగును. (ఓం గణపతయే నమః అని స్మరణ చేయటం మంచిది)

చిత్త నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి కాగలవు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ( ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో సుఖశాంతులు లభిస్తాయి. మిత్రులతో తెలివిగా వ్యవహరించాలి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా  పూర్తి కాగలవు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ( ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

స్వాతి నక్షత్రం వారికి (విపత్తార)అనవసరమైన ఖర్చులు పెరుగును.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఓం చాముండాయై నమః అని స్మరణ చేయుట మంచిది)

విశాఖ నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:-ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.అనుకున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడిన పట్టుదలతో పూర్తి చేస్తారు.ఆకస్మిక ధన లాభం. సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట ఏర్పడిన చికాకులు తొలగుతాయి.వివాహ ప్రయత్నాలు కు అనుకూలం.

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు ( ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

అనూరాధ నక్షత్రం వారికి  (జన్మతార)ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతో టి పూర్తి చేయవలెను. ( సూర్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

జ్యేష్ట నక్షత్రము వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించును. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం (ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సంఘములో కలహాలు రాగలవు.విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా శారీరకంగా బలహీనత. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రము వారికి (మిత్రతార)బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. ( ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

పూ.షా  నక్షత్రం వారికి (నైదనతార)దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి . తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును (ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

ఉ.షా నక్షత్రము వారికి (సాధన తార)నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ( మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడును. కుటుంబ సభ్యులతో ప్రతికూలత వాతావరణం. సంఘములో తెలివిగా వ్యవహరించాలి. బంధు మిత్రులతో మనస్పర్థలు రాగలవు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృత్తి వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.  వైవాహిక జీవితంలో మనస్పర్థలు రాగలవు .
 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి (సాధన తార)నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును . జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. (మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

శ్రవణం నక్షత్రము వారికి (ప్రత్యక్తార)చిత్ర విచిత్రాలు వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులలో జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులు నిదానముగా జరుగును. ( ఓం గణపతయే నమః అని స్మరణ చేయుట మంచిది)

ధనిష్ఠ నక్షత్రము వారికి  (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి కాగలవు .కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మానసిక ఆందోళనకు గురవుతారు.శారీరక అనారోగ్య సమస్యలు రాగలవు. కుటుంబ విషయాలు చిరాకు కలిగిస్తాయి.వృధా ప్రయాణాలు.ప్రయత్న కార్యంలో ఆటంకాలు ఎదురవుతాయి.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి .వృత్తి ఉద్యోగాల్లో సహనం వహించాలి.కుటుంబ విషయాలు లో అనాసక్తత .
 

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి  (క్షేమతార)వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి కాగలవు .కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ( ఓం శివాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

శతభిషం నక్షత్రం వారికి (విపత్తార)అనవసరమైన ఖర్చులు పెరుగును.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. ( ఓం చాముండాయై నమః అని స్మరణ చేయుట మంచిది)

పూ.భా నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:-వ్యాపారాలలో ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం. వ్యవహారాలు లో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదలు ఎదురౌతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయత్న కార్యంలో ఇబ్బందులు.మనస్సు చంచలంగా ఉంటుంది.  ఆకస్మిక కలహాలు రాగలవు. చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి.

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

ఉ.భా  నక్షత్రం వారికి (జన్మతార)ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతో  పూర్తి చేయవలెను. ( సూర్యాయ నమః అని స్మరణ చేయుట మంచిది)

రేవతి నక్షత్రం  వారికి (పరమైత్రతార)అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.(ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.మానసికంగా శారీరకంగా సౌకర్యంగా ఉంటుంది. సోదరులు సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు.

Latest Videos

click me!