మాస ఫలాలు :01 డిసెంబర్ 2023 నుంచి 31 డిసెంబర్ 2023 వరకూ
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ మాసం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
(కర్కాటక వృశ్చిక మకర కుంభ మీన రాశి ల వారికి అష్టమ అర్ధాష్టమ మరియు ఏలినాటి శని జరుగుతున్నాయి. కావున ప్రతినిత్యం ఈ శ్లోకాన్ని 11 సార్లు లేదా శని స్తోత్రం లేదా అష్టోత్రం గాని పారాయణ చేయడం మంచిది.)
శ్లో॥ కోణస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రాంతకోయమః ।
సౌరి శనైశ్చరో మందః పిప్పలాదిషు సంస్థితః॥
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ- గురు -శుక్ర
ద్వితీయ సప్తమాధిపతి ఆయన శుక్రుడు కళత్ర స్థానంలో సంచారం ఈ సంచారము అనుకూలమైనది కాదు. వ్యవహారాల్లో కోపా వేషాలు తగ్గించుకుని వ్యవహరించాలి. కొద్దిపాటి కష్టనష్టాలు రాగలవు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఇతరుల తోట కారణంగా విరోధాలు రాగలవు. వాద వివాదాలకు దూరంగా ఉండాలి.బుధ గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి దాంపత్య జీవితం బాగుంటుంది. కీలకమైన సమస్యలన్నీ బుద్ధికుశలతతో చాక చక్యంగా పరిష్కరించు కొంటారు.విద్యార్థులు ఉన్నత విద్య కొరకు చేయి ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో అధికారులు వలన లాభం కలుగుతుంది. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. పిత్రార్జిత మరియు స్థిరాస్తి మూలక లాభం కలుగును.
అశ్విని నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు అయినందున తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనవసరమైన ప్రయాణాలు చికాకు పుట్టిస్తాయి. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు రాగలవు. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.( ఈ మాసం సుబ్రహ్మణ్య స్తోత్రం లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు.)
భరణి నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు అయినందున బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వ్యాపార ఆలోచనలు వ్యాపార అభివృద్ధి కలుగును. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహమునందు శుభ యోగాలు అవకాశం. (ఈ మాసం విష్ణు సహస్రనామ పారాయణ లేదా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు.)
కృత్తిక నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు అయినందున వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం కలుగును. జీవిత భాగస్వామికి వస్త్రాభరణాలు గృహ సంబంధిత వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతాన అభివృద్ధి ఆనందం కలగచేస్తుంది. ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది (ఈ మాసం శివ స్తోత్రం లేదా శివాభిషేకం చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు)
telugu astrology
వృషభం:- (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ- గురు -శుక్ర
జన్మ షష్టమాధిపతి అయిన శుక్రుడు శత్రు స్థానంలో సంచారం ఈ సంచారం వలన వ్యతిరేక ఫలితాలు రాగలవు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి పొదుపు చేసిన ధనాన్ని తీసి ఖర్చు చేయాల్సి వస్తుంది. పనుల్లో ఆతురత పెరిగి ఆటంకాలు ఎదురవుతాయి. సమాజంలో అవమానాలు ఎదురవగలవు. రుణాలు చేయవలసి వస్తుంది. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.
తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తి చేస్తారు. మానసికంగా శారీరకంగా బలబడతారు. కోపావేశాలకు తగ్గించుకుని వ్యవహారాలు పూర్తి చేయవలెను. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామి తోటి మనస్పర్థలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో అధికారులు తో ఇబ్బందికర పరిస్థితులు ఉండగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.
రోహిణి నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు అయినందున సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగును .పట్టుదలతో చేసే పనులు పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. గత కొద్ది రోజులుగా ఉన్న సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది.( ఈ మాసం మహాలక్ష్మి స్తోత్రం లేదా మహాలక్ష్మి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు)
మృగశిర నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు అయినందున జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. భూ గృహ స్థిరాస్తి అభివృద్ధి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నైపుణ్యం పెరిగి పరిశోదాత్మ గా ముందడుగు వేస్తారు.(ఈ మాసం దుర్గారాధన లేదా దుర్గా స్తోత్రం పారాయణం చేయండి శుభ ఫలితాలను పొందండి.)
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారాలు॥ ఋధ -శుక్ర
వ్యయ పంచమాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో సంచారం ఈ సంచారం వలన శుభ ఫలితాలు చేకూరును. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలసి వస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. గత కొంతకాలంగా ఆగిన పనులు పూర్తి చేయగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నించేవారు శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించిన ధన లాభం లభిస్తుంది. శత్రువులపై పై చేయి సాధిస్తారు.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధువర్గంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. సమాజంలో మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. చిన్నపాటి అనారోగ్యాలు ఎదురవగలవు. చేయి వ్యవహారం నందు కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించాలి. సంఘము నందు కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. జీవిత భాగస్వామి తో మాట పట్టింపులు రాగలవు.
ఆరుద్ర నక్షత్రం వారికి మాసాధిపతి రవి అయినందున వృత్తి రీత్యా బాగా అభివృద్ధి చెందుతారు. సమాజంలో మీ మాటకు ఎదురు ఉండదు. ప్రయాణాలు వలన ఇబ్బందులు కలుగుతాయి. చేసే పనులలో కోపావేశము తగ్గించుకోవాలి. అధికారుల తో సఖ్యత గా వ్యవహరించాలి.(ఈ మాసం ఆదిత్య హృదయం పారాయణం చేయుట లేదా సూర్యారాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు.)
పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు అయినందున వృత్తి వ్యాపారాలలో ధన నష్టం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో వస్తువుల యందు జాగ్రత్త అవసరం. దీర్ఘకాలిక అనారోగ్య విషయాలు తలెత్తగలవు. చేసే పనులలో ఆత్రుత తగ్గించుకోవాలి. (ఈ మాసం రాహు స్తోత్రం లేదా దుర్గా పూజ చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు.)
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారాలు॥ ఆది- సోమ
లాభ చతుర్ధాధిపతి అయిన శుక్రుడు చతుర్ధ స్థానంలో సంచారం ఈ సంచారం అనుకూలమైన ఫలితాలు పొందగలరు.బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శారీరకంగా మానసికంగా బలపడతారు. వ్యవహారాలలో సమయానుకూల సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులు తో అభివృద్ధి చర్చలు జరుపుతారు.బుధ గ్రహ సంచారం వలన ధనధాన్య అభివృద్ధి కలుగుతుంది. చేయి పనుల్లో బుద్ధి కుశలత ఏర్పడి కార్య సాధన సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.
పుష్యమి నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు అయినందున ఉద్యోగాలలో చిన్నపాటి అధికారం లభిస్తుంది. జంతువుల వలన ప్రమాదం జరిగే అవకాశం. వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కోపతాపాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. (ఈ మాసం గణపతి స్తోత్రం పారాయణ లేదా గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు.)
ఆశ్రేష నక్షత్రం వారికి మాసాధిపతి శని అయినందున వ్యవహారాలలో కోపం తగ్గించుకొని వ్యవహరించాలి. దుర్వార్తలు వినాల్సి ఉంటుంది. సమాజంలో అనవసరమైన మాటలు వాదనలు వలన ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.(ఈ మాసం తైలాభిషేకం లేదా రుద్రాభిషేకం శివ స్తోత్రం పారాయణం చేయడం వలన మానసిక ప్రశాంతత పొందగలరు)
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారాలు॥ ఆది- సోమ
లాభ చతుర్ధాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో సంచారం ఈ సంచారం వలన కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు కలుగును.అనవసరపు ఖర్చులు అధికంగా ఉండును. వ్యాపారంలో ధన నష్టం రాకుండా జాగ్రత్త వహించవలెను. అపకారం చేసేవాళ్లు పెరుగుతారు. బుధ గ్రహ సంచారం వలన కుటుంబ సౌఖ్యం పొందగలరు. సన్మానాలు బహుమానాలు పొందుతారు. సమస్యలన్నీ తీరి ప్రశాంతత చేకూరుతుంది.తలపెట్టిన పనులు అనుకూలంగా పూర్తగును. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. స్త్రీ సౌఖ్యం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో సహోదయోగ యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. గృహోపకరణ అలంకరణ వస్తువులు నిమిత్తం ఖర్చు ఎక్కువ చేస్తారు.
మఘ నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు అయినందున తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనవసరమైన ప్రయాణాలు చికాకు పుట్టిస్తాయి. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు రాగలవు. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.( ఈ మాసం సుబ్రహ్మణ్య స్తోత్రం లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు.)
పుబ్బ నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు అయినందున బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వ్యాపార ఆలోచనలు వ్యాపార అభివృద్ధి కలుగును. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహమునందు శుభ యోగాలు అవకాశం. (ఈ మాసం విష్ణు సహస్రనామ పారాయణ లేదా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు.)
ఉత్తర నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు అయినందున వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం కలుగును. జీవిత భాగస్వామికి వస్త్రాభరణాలు గృహ సంబంధిత వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతాన అభివృద్ధి ఆనందం కలగచేస్తుంది. ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది (ఈ మాసం శివ స్తోత్రం లేదా శివాభిషేకం చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు)
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారాలు॥ బుధ- శుక్రవారం
నవమ ద్వితీయాధిపతి అయిన శుక్రుడు ధన స్థానంలో సంచారం ఈ సంచారం వలన శుభ ఫలితాలు లభిస్తాయి.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.
ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ధన లాభం చేకూరుతుంది. కుటుంబ సౌఖ్యం లభించును. ఉద్యోగాలలో అధికారులు యొక్క ఆదరణ అభిమానం పొందగలరు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బలపడతారు. ప్రతి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు.
హస్త నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు అయినందున సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగును .పట్టుదలతో చేసే పనులు పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. గత కొద్ది రోజులుగా ఉన్న సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది.( ఈ మాసం మహాలక్ష్మి స్తోత్రం లేదా మహాలక్ష్మి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందండి)
చిత్త నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు అయినందున జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. భూ గృహ స్థిరాస్తి అభివృద్ధి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నైపుణ్యం పెరిగి పరిశోదాత్మ గా ముందడుగు వేస్తారు.(ఈ మాసం దుర్గారాధన లేదా దుర్గా స్తోత్రం పారాయణం చేయండి శుభ ఫలితాలను పొందండి.)
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ -గురు- శుక్ర
అష్ఠమ జన్మ రాశ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో సంచారము ఈ వలన శుభ ఫలితాలు కలుగును.మానసిక ప్రశాంతత లభించును. ప్రయత్నించే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించని ధన లాభం చేకూరుతుంది. ఇతరుల విషయాల్లో దూరంగా ఉండవలెను. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభించును.ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారం సజావుగా సాగుతాయి .అభివృద్ధి కార్యక్రమంలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. తలపెట్టిన పనులు అనుకూలంగా పూర్తి అగును. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. గృహంలో శుభ కార్యాచరణ.
స్వాతి నక్షత్రం వారికి మాసాధిపతి రవి అయినందున వృత్తి రీత్యా బాగా అభివృద్ధి చెందుతారు. సమాజంలో మీ మాటకు ఎదురు ఉండదు. ప్రయాణాలు వలన ఇబ్బందులు కలుగుతాయి. చేసే పనులలో కోపావేశము తగ్గించుకోవాలి. అధికారుల తో సఖ్యత గా వ్యవహరించాలి.(ఈ మాసం ఆదిత్య హృదయం పారాయణం చేయుట లేదా సూర్యారాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు.)
విశాఖ నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు అయినందున వృత్తి వ్యాపారాలలో ధన నష్టం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో వస్తువుల యందు జాగ్రత్త అవసరం. దీర్ఘకాలిక అనారోగ్య విషయాలు తలెత్తగలవు. చేసే పనులలో ఆత్రుత తగ్గించుకోవాలి. (ఈ మాసం రాహు స్తోత్రం లేదా దుర్గా పూజ చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు.)
telugu astrology
వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు
(తో-నా-నీ-నూ-నే-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ-గురు -శుక్ర
సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానం నందు సంచారము. ఈ సంచారం వలన మిశ్రమ ఫలితాలను పొందగలరు. అనవసరమైన ఖర్చులు యందు జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఆందోళన పెరుగును. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును.గృహమునందు ఆనందకరమైన వాతావరణం.ఆరోగ్య విషయాలు లో కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. చేయు పనులు అనుకూలంగా చేయగలుగుతారు. వ్యవహారం నందు కోపాన్ని తగ్గించుకుని వ్యవహరించాలి. ఉద్యోగం నందు సహోద్యోగులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.
అనూరాధ నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు అయినందున ఉద్యోగాలలో చిన్నపాటి అధికారం లభిస్తుంది. జంతువుల వలన ప్రమాదం జరిగే అవకాశం. వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కోపతాపాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. (ఈ మాసం గణపతి స్తోత్రం పారాయణ లేదా గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు.)
జ్యేష్ట నక్షత్రం వారికి మాసాధిపతి శని అయినందున వ్యవహారాలలో కోపం తగ్గించుకొని వ్యవహరించాలి. దుర్వార్తలు వినాల్సి ఉంటుంది. సమాజంలో అనవసరమైన మాటలు వాదనలు వలన ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.(ఈ మాసం తైలాభిషేకం లేదా రుద్రాభిషేకం శివ స్తోత్రం పారాయణం చేయడం వలన మానసిక ప్రశాంతత పొందగలరు)
telugu astrology
ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ గురు -శుక్ర- మంగళవారం
షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు లాభ స్థానం నందు సమాచారము ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగును. కుటుంబము నందు ప్రశాంతమైన వాతావరణం. మానసిక ప్రశాంతత శారీరక సౌఖ్యం పొందగలరు. కీలకమైన సమస్యలను నిర్భయముగా ఎదుర్కొంటారు.
దుష్ట సావాసాలు ఏర్పడతాయి. ఇతరులతో తగువులు వివాదాలకు దూరంగా ఉండవలెను. బందో వర్గం తోటి కొద్దిపాటి కష్టాలు ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరమైన అనేక విధాలుగా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం. చేయు పనులు లో శారీరక శ్రమ పెరుగుతుంది
మూల నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు అయినందున తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనవసరమైన ప్రయాణాలు చికాకు పుట్టిస్తాయి. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు రాగలవు. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.( ఈ మాసం సుబ్రహ్మణ్య స్తోత్రం లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు.)
పూ.షా నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు అయినందున బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వ్యాపార ఆలోచనలు వ్యాపార అభివృద్ధి కలుగును. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహమునందు శుభ యోగాలు అవకాశం. (ఈ మాసం విష్ణు సహస్రనామ పారాయణ లేదా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు.)
ఉ.షా నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు అయినందున వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం కలుగును. జీవిత భాగస్వామికి వస్త్రాభరణాలు గృహ సంబంధిత వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతాన అభివృద్ధి ఆనందం కలగచేస్తుంది. ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది (ఈ మాసం శివ స్తోత్రం లేదా శివాభిషేకం చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు)
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారాలు॥ ఆది -సోమ- శని
పంచమ రాజ్యాధిపతి అయిన శుక్రుడు రాజ్యస్థానము నందు సంచారం ఈ సంచారం వలన ఇబ్బందులు కలుగును. మిత్రుల తోటి అకారణంగా కలహాలు రాగలవు. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఒక విషయం వలన మానసిక ఆందోళన పెరుగును. శారీరక కష్టం పెరిగి బలహీనముగా నుండును. జీవిత భాగస్వామి తోటి మనస్పర్థలు రాగలవు. ఇతరుల ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండవలెను. సమాజంలో అవమానాలు కలగవచ్చు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. చేసే పని యందు శారీరక శ్రమ పెరిగి బలహీనత పొందుతారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఏర్పడగలవు. ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది. చేయు వ్యవహారాలలో అవరోధాలు ఏర్పడగలవు.
శ్రవణా నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు అయినందున సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగును .పట్టుదలతో చేసే పనులు పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. గత కొద్ది రోజులుగా ఉన్న సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది.( ఈ మాసం మహాలక్ష్మి స్తోత్రం లేదా మహాలక్ష్మి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు)
ధనిష్ఠ నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు అయినందున జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. భూ గృహ స్థిరాస్తి అభివృద్ధి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నైపుణ్యం పెరిగి పరిశోదాత్మ గా ముందడుగు వేస్తారు.(ఈ మాసం దుర్గారాధన లేదా దుర్గా స్తోత్రం పారాయణం చేయండి శుభ ఫలితాలను పొందండి.)
telugu astrology
కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారాలు॥ శని- ఆది -సోమ
చతుర్ధ నవమాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో సంచారము ఈ సంచారం వలన శుభ ఫలితాలు చేకూరుతాయి.కొంత కాలంగా మనసు నందు తలచిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి సౌఖ్యం పొందగలరు. ఆధ్యాత్మిక చింతన పెరుగును. కీలకమైన సమస్యలు పరిష్కార మగును.అన్ని విధాల లాభం చేకూరును. కుటుంబము నందు సంతోషకరమైన వార్త విషయాలు తోటి ఆనందకరము గా ఉండును. చేసే పనులలో ఆటంకాలు ఏర్పడిన పట్టుదలతో పూర్తి చేయవలెను. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారులు యొక్క మన్ననలు పొందగలరు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మన శాంతి లభిస్తుంది.
శతభిషం నక్షత్రం వారికి మాసాధిపతి రవి అయినందున వృత్తి రీత్యా బాగా అభివృద్ధి చెందుతారు. సమాజంలో మీ మాటకు ఎదురు ఉండదు. ప్రయాణాలు వలన ఇబ్బందులు కలుగుతాయి. చేసే పనులలో కోపావేశము తగ్గించుకోవాలి. అధికారుల తో సఖ్యత గా వ్యవహరించాలి.(ఈ మాసం ఆదిత్య హృదయం పారాయణం చేయుట లేదా సూర్యారాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు.)
పూ.భా నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు అయినందున వృత్తి వ్యాపారాలలో ధన నష్టం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో వస్తువుల యందు జాగ్రత్త అవసరం. దీర్ఘకాలిక అనారోగ్య విషయాలు తలెత్తగలవు. చేసే పనులలో ఆత్రుత తగ్గించుకోవాలి. (ఈ మాసం రాహు స్తోత్రం లేదా దుర్గా పూజ చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు.)
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు
(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారాలు॥ గురు- శుక్ర -మంగళ
తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానము నందు సంచారం.ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. ఆర్థికంగా బలపడతారు. అధికారుల ఆదర అభిమానం పొందగలరు. అనారోగ్య సమస్యలు తీరి ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజము నందు గౌరవ మర్యాదలు పొందగలరు.గృహంలో శుభ కార్యాచరణ. ఆర్థికంగా బలం చేకూరుతుంది. చేయు వ్యవహారం నందు కోపాన్ని అదుపు చేసుకొని వ్యవహరించాలి. కొన్ని సంఘటనలు భయాందోళన కలిగించును .బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడగలవు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంటాయి.
ఉ.భా నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు అయినందున ఉద్యోగాలలో చిన్నపాటి అధికారం లభిస్తుంది. జంతువుల వలన ప్రమాదం జరిగే అవకాశం. వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కోపతాపాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. (ఈ మాసం గణపతి స్తోత్రం పారాయణ లేదా గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందగలరు.)
రేవతి నక్షత్రం వారికి మాసాధిపతి శని అయినందున వ్యవహారాలలో కోపం తగ్గించుకొని వ్యవహరించాలి. దుర్వార్తలు వినాల్సి ఉంటుంది. సమాజంలో అనవసరమైన మాటలు వాదనలు వలన ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.(ఈ మాసం తైలాభిషేకం లేదా రుద్రాభిషేకం శివ స్తోత్రం పారాయణం చేయడం వలన మానసిక ప్రశాంతత పొందగలరు)