Today Horoscope:ఓ రాశివారి డబ్బు సమస్యలన్నీ తగ్గుతాయి

Published : Dec 24, 2024, 04:51 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఆర్థిక వ్వవహారాలు మెరుగుపడతాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు.

PREV
112
Today Horoscope:ఓ రాశివారి డబ్బు సమస్యలన్నీ తగ్గుతాయి
telugu astrology


1.మేష రాశి...
ఈ రోజు మేష రాశివారు ఉత్సాహంగా సాగిపోతారు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కోరుకున్న విజయం ఈ రోజు సాధించగలరు. వ్యక్తిగత సంబంధాల్లో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం చాలా అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. పని ప్రదేశంలో  మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. అయితే.. ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధ అవసరం.

212
telugu astrology

2.వృషభ రాశి..
వృషభ రాశివారికి ఈ రోజు వృత్తిపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ సమస్యలను పరిష్కరించడానికి స్నేహితుల సహాయం కోరవచ్చు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది, ఆర్థిక వ్వవహారాలు మెరుగుపడతాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు.

312
telugu astrology

3.మిథున రాశి.

మిథున రాశివారు మీ కలలు సాకారం చేసుకోవడంలో మీకు శక్తివంతమైన అవకాశాలు లభిస్తాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం, ముఖ్యంగా మానసిక శాంతి కాపాడుకునే ప్రయత్నం చేయాలి.

412
telugu astrology

4.కర్కాటక రాశి,..
ఆర్థిక సమస్యలు కొంతమేరకు పరిష్కారం అవుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడంలో సమయం వెచ్చించండి. కుటుంబంలో సంతృప్తి కలిగించే సంఘటనలు జరుగుతాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి.

512
telugu astrology

5.సింహ రాశి..
ఈ రోజు మీకు సృజనాత్మకతతో కూడిన మంచి ఆలోచనలు వస్తాయి. వృత్తిపరంగా ప్రాజెక్ట్‌లలో మంచి పురోగతి సాధించగలరు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం మామూలుగానే ఉంటుంది, అయితే ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి.

612
telugu astrology

6.కన్య రాశి..
ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వృత్తిపరంగా మీ కష్టాలకు ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమేరకు జాగ్రత్త అవసరం, ప్రత్యేకంగా శారీరక శ్రమ వల్ల వచ్చే సమస్యల నుంచి తప్పించుకోండి.

712
telugu astrology

7.తుల రాశి..
సహచరుల నుంచి మద్దతు పొందే అవకాశం ఉంది. ఆర్థికపరంగా కొత్త మార్గాలు కనిపించవచ్చు. కుటుంబ సభ్యుల సంతోషానికి ప్రత్యేకంగా సమయం కేటాయించండి. ఆరోగ్యం  సాధారణంగానే ఉంటుంది, కానీ ఆహారపరమైన నియమాలు పాటించాలి.

812
telugu astrology

వృశ్చిక రాశి.. 
ఈ రోజు మీకు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. మానసిక,  శారీరక ఆరోగ్యం కొంత దృష్టి అవసరం.

912
telugu astrology

ధనుస్సు రాశి 
మీ లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో ముందడుగు వేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మధురమైన సంబంధాలు కొనసాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శక్తి, ఉత్సాహం ఉంటాయి.

1012
telugu astrology

మకర రాశి 
పని ప్రదేశంలో మీ కృషి గుర్తింపు పొందుతుంది. ఆర్థికంగా మేలైన అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ఆనందాన్ని పంచుకునే సంఘటనలు జరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.

1112
telugu astrology

కుంభ రాశి ...
మీ ఆలోచనలు , ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థికపరమైన నిర్ణయాలలో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో మమతతో వ్యవహరించండి. ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం.

1212
telugu astrology

మీన రాశి 
ఆఫీసుల  మీ ప్రతిభను ప్రదర్శించగలరు. ఆర్థికపరంగా మంచి లాభాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సపోర్ట్‌ మీకు అవసరమైన ఉత్సాహాన్ని అందిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా కూడా  ప్రశాంతంగా ఉంటారు., కానీ యోగా లేదా ధ్యానం చేస్తే మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories