Today Horoscope: ఓ రాశివారు దైవ, సేవా, పుణ్య కార్యాల్లో చురుకుగా పాల్గొంటారు

First Published | Jan 23, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు కోర్టు వ్యవహారాలలో అనుకూలత. శుభకార్యాలు నిర్వహిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు.వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు. శారీరక బాధలు పెరుగును. 
 

23  -1-2024  మంగళ వారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

అనేక మార్గాలు ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. భూమి వాహనాలు కొనుగోలు చేసే ‌అవకాశం. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు తెచ్చుకుంటారు. సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. వ్యాపారులు లాభాలు పొందుతారు . ఉద్యోగులకు అదనపు బాధ్యతలు నుంచి ఉపశమనం కలుగుతుంది.
 


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

కోర్టు వ్యవహారాలలో అనుకూలత. శుభకార్యాలు నిర్వహిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు.వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు. శారీరక బాధలు పెరుగును. ఉద్యోగాల్లో అధికారుల వలన భయాందోళనగాఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తికాక ఇబ్బందులు ఎదురవుతాయి. కళాకారుల ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి కాగలవు.
 

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

ఉద్యోగయత్నాలలో అనుకూల పరిస్థితులు. వ్యాపారులకు అధిక లాభాలను పొందుతారు. ఉద్యోగులకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతీపని సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు. బందోవర్గముతో మానసిక విభేదాలు రాకుండా జాగ్రత్త  రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు తగిన రాబడిని పొందుతారు.  ఆర్థిక లావాదేవీల విషయాలలో ఇతరులకు హామీలు ఉండటం మంచిది కాదు.  ముఖ్య కార్యక్రమాలు ఆలస్యంగా నైనా పూర్తిగా గలవు.వ్యవహారాల్లో ఆలోచన ఒత్తిడికి గురి అవుతారు. ఏదో ఒక పని మీద ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాన్ని చూపిస్తారు.తలపెట్టిన పనులలో సునాయాసముగా విజయం సాధిస్తారు.

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

వ్యాపారమునందు జాగ్రత్త అవసరం . సంఘములో అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారములో కోపం అధికంగా ఉండును. ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో విభేదాలు రాగలవు.  వచ్చిన అవకాశాలు  చేజారవచ్చు. కుటుంబ బాధ్యతలపై  దృష్టి సారించాలి. మీ భావాలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు.వ్యాపారులకు ఆశించిన లాభాలు కష్టసాధ్యంగా ఉంటుంది.
 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

వ్యాపారాల్లో అదనపు రాబడి పెరుగుతుంది. చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖుల పరిచయాలు ఏర్పడతాయి.విద్యార్థుల విద్యపై శ్రద్ధ వహిస్తారు. బృందమిత్రులు సహాయ సహకారాలు స్వీకరిస్తారు.   మీ మీద ఉన్న విమర్శలు తొలగుతాయి.
 

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

ప్రతి చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం.వ్యవహారంలో ప్రతి బంధకములు ఏర్పడ గలవు. ఈరోజు ఓర్పు సహనం అవసరం. ఆర్థిక కార్యకలాపాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండును. ప్రతి పని తేలికగా పూర్తి అవుతున్నట్లుగా ఉన్నప్పటికీ అవి సరిగ్గా పూర్తికాక ఇబ్బంది పడతారు. ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవుజాగ్రత్త వహించవలెను. వ్యాపారాల్లో ధన నష్టము రాకుండా జాగ్రత్త పడాలి.
 

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)

ఉద్రిక్త స్వభావాన్ని  అదుపులో ఉంచుకోవాలి .శారీరికంగా మానసికంగా ఇబ్బందులు ఉండవచ్చు. చేస్తున్న ప్రయత్నాలు ఆశించినంతగా ఫలితాలు ఉండవు. సంతానానికి సంబంధించి ఆందోళన చెందుతారు. వృత్తిపరమైన బాధ్యతలు పెరుగుతాయి.మానసికంగా భయాందోళనగా ఉంటుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము.

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రాలు (యే-యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

పట్టుదల ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఖర్చులు అదుపు చేసుకోవాలి. విద్యావకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. భూవివాదాల పరిష్కారం. శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు.జాగ్రత్త వహించవలెను . పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.వ్యాపారులు ఆశించిన లాభాలు పొందగలరు. ఉద్యోగాల్లో పనిభారమైనా అవలీలగా అధిగమిస్తారు.
 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

వృత్తి వ్యాపారాల్లో సమర్ధవంతంగా పనిచేస్తారు. కార్య సాధన చేయు ప్రయత్నంలో ఒత్తిడికి లోనవుతారు. సమాజంలో అపవాదములు రాగలవు.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉండును. యంత్రాగారంలో లేదా పనిముట్లతో జాగ్రత్త వహించాలి.
 

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపార విషయాలలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యవహారాలలో బంధుమిత్రుల సహకారం అందుతుంది. కొన్ని పనులు ఎంతో శ్రమించిన పూర్తికాని పనులు ఈరోజు సునాయాసముగా సాధిస్తారు. బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చ)

కొద్ది రోజులుగా ఉన్న సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. ధైర్య సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన పరచ పరిచయాలు ఏర్పడతాయి. నమ్మిన వారి వలన మోసం జరిగే అవకాశం. ఉద్యోగ వ్యాపార విషయాలు అనుకూలంగా ఉండును. విద్యార్థులకు అనుకూల స్థితి. స్నేహితులతో అవమానకర ఘటనలు చోటు చేసుకుంటాయి.
 

Latest Videos

click me!