Today Horoscope: ఓ రాశివారికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి

First Published | Jul 1, 2024, 5:30 AM IST

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

telugu astrology


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- ఇచ్చిన బకాయిలు సరైన సమయానికి అందక ఇబ్బంది పడతారు. విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. పనిభారం ఎక్కువ అవుతుంది. రుణ ప్రయత్నాలు అనుకూలించవు. వృత్తి వ్యాపారాల్లో పని ఎక్కువగా ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగులు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. పొరుగువారితో గొడవలువుతాయి. 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-భూమికి సంబంధించిన క్రయ విక్రయాలు లాభాదాయకంగా ఉంటాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. అధికారుల చొరవతో ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. సొంత నిర్ణయాల వల్ల ముఖ్యమైన పనులను తొందరగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. 


telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- వ్యాపార వ్యవహారాల్లో బంధుమిత్రుల చొరవ ఉంటుంది. ఇది మీకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది. వృత్తి వ్యాపారాలను విస్తరిస్తారు. సమాజ సేవ మీ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచుతుంది. దైవ చింతనలో పాల్గొంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ఈరోజు వారు చేయాల్సిన పనులన్నింటినీ పూర్తి చేస్తారు. 
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శత్రువుల భయం తొలగిపోతుంది. విలువైన వస్తు, వాహనాలను కొనే యోగం ఉంది. మొదలుపెట్టని పనులను అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యం చేసే ఆలోచన ఉంటుంది. వృత్తి, ఉద్యోగులకు సోహోద్యోగుల సహాయ సహకారాలు ఉంటాయి. 
 

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:-ఉద్యోగులకు పనిభారం బాగా పెరుగుతుంది.  కానీ అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయరు.  ఇంట్లో వాతావరణం చిరాకు కలిగిస్తుంది. నిరుద్యోగులు ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం ఉండదు. పిల్లల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వ్యాపారంలో నష్టపోవాల్సి వస్తుంది. 
 

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కొనే అవకాశం ఉంది. ఈ రోజు ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అవసరానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలు ఎదురైనా ఇంట్లో దేనికీ లోటు లేకుండా చూసుకుంటారు. భూమికి సంబంధించిన వివాదాలు ఒకరి జోక్యంతో పరిష్కారమవుతాయి. 
 

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-చిన్ననాటి స్నేహితులతో మంచి, చెడు విషయాలను పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబానికి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేస్తారు. మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. భూ క్రయ, విక్రయాలు మంచి లాభాదాయకంగా ఉంటాయి. వ్యాపారులు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. 
 

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-అవసరమైన వారికి మీ సహాయ సహకారాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు.  ఆదాయంతో పాటుగా ఖర్చు కూడా పెరుగుతుంది. మొదలుపెట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. వృత్తి, ఉద్యోగులు మంచి పదవులు పొందుతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. 
 

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవు. మీరు ఊహించని విధంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇది అలసటను కలిగించడం తప్ప ఎలాంటి లాభాన్ని చేకూర్చదు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. వ్యాపారం అంతంత మాత్రమే సాగుతుంద. డబ్బుకు సంబంధించిన ఒత్తిడి పెరుగుతుంది. 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు మీకు కలిసి వస్తాయి. మొదలుపెట్టిన పనులు ముందుకు సాగవు. బంధుమిత్రుల రాకతో ఇంట్లో ఖర్చు పెరుగుతుంది.  పిల్లలు కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. వ్యాపార విస్తరణ ఆలోచన ముందుకు సాగదు. 
 

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:- మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు కలగడంతో చిరాగ్గా ఉంటారు. బంధుమిత్రులతో గొడవలు అవుతాయి. అప్పుల వాళ్ల వేధింపులు ఎక్కువ అవుతాయి. ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో అనుకోని సమస్యలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాలు అంతంత మాత్రమే సాగుతాయి. 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- చిన్ననాటి స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్న రోజు వస్తుంది. వ్యాపారులు కొత్త పద్దతులను ప్రవేశపెడతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
 

Latest Videos

click me!