ఆర్థికంగా ఎదగాలంటే.. మీ వ్యాలెట్ అస్సలు ఉంచకూడదనిది ఇదే..!

First Published | Apr 10, 2024, 11:15 AM IST

ఆ ఖర్చు చేసిన తర్వాత వచ్చిన బిల్లలును కూడా చాలా మంది.. తమ వ్యాలెట్ లోనే పెట్టేస్తూ ఉంటారు. అవి కూడా వ్యాలెట్ లో అస్సలు పెట్టకూడదట. దాని వల్ల.. కూడా మన ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోతుందట.
 

మన అందరి దగ్గరా వ్యాలెట్ ఉంటుంది. ఈ వ్యాలెట్ లో మనం ఏవేవో వస్తువులు పెట్టుకుంటూ ఉంటాం. డబ్బులతో పాటు, ఏవేవో కార్డులు, ఫోటోలు లాంటివి పెడుతూ ఉంటాం.  కొన్ని అవసరం రిత్యా పెట్టుకుంటూ ఉంటాం.. మరి కొన్ని.. మనం ఇష్టంతోనే, ప్రేమతోనో పెట్టుకుంటాం.. అయితే.. మనం తెలియక చేసే కొన్ని పొరపాట్ల కారణంగా.. మన ఆర్థిక పరిస్థితి నాశనం అవుతుందట. ఏవి పడితే అవి  వ్యాలెట్ లో ఉంచకూడదట. ఎలాంటి వస్తువులు ఉంచకూడదో ఇప్పుడు చూద్దాం..

1.సాధారణంగా మనం.. వ్యాలెట్ లో డబ్బులు పెడుతూ ఉంటాం. అయితే.. డబ్బులను ఎలా పడితే అలా నలిపేసి.. పొరపాటున కూడా పెట్టకూడదట. డబ్బులను నీట్ గా.. ఎలాంటి మడతలు లేకుండా పెట్టాలి. అప్పుడే  మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.


2.మనం ఉదయం లేస్తే ఎన్నో ఖర్చులు చేస్తూ ఉంటాం. ఆ ఖర్చు చేసిన తర్వాత వచ్చిన బిల్లలును కూడా చాలా మంది.. తమ వ్యాలెట్ లోనే పెట్టేస్తూ ఉంటారు. అవి కూడా వ్యాలెట్ లో అస్సలు పెట్టకూడదట. దాని వల్ల.. కూడా మన ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోతుందట.

3.ఇక మనం.. వ్యాలెట్ లో ఏటీఎం కార్డులు పెడుతూ ఉంటాం. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు పెట్టుకోవచ్చు. కానీ... ఎక్స్ పైర్ అయిపోయిన కార్డులను మాత్రం పొరపాటున కూడా వ్యాలెట్ లో పెట్టకూడదు.

4.చాలా మందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. అది కామన్. అయితే.. బయటకు వెళ్లినప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోతాం అని.. వాటిని వ్యాలెట్ లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. కానీ.. పొరపాటున కూడా ట్యాబ్లెట్స్ ని మనం.. వ్యాలెట్ లో పెట్టుకోకూడదట.

wrappers

5.చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. తినేసిన తర్వాత.. చాక్లెట్స్ ర్యాపర్స్ ని పాడేయకుండా.. వ్యాలెట్స్ లో దాచుకుంటూ ఉంటారు. కానీ.. పొరపాటున కూడా ఇలాంటి పని చేయకూడదట. ఇవి కూడా.. మీ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోతుంది.


6.మనకు మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా .. తమ కుటుంబ సభ్యులపై ప్రేమ చావదు. వారి కోసం గుర్తుగా..  వారి ఫోటోలను మనం వ్యాలెట్ లో పెట్టుకుంటూ ఉంటాం. మన కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టుకోవచ్చు. కానీ... చనిపోయిన తర్వాత మాత్రం వాళ్ల ఫోటోలను అస్సలు పెట్టుకోకూడదు. ఇది కూడా మంచి సంకేతం కాదు.

డబ్బును ఆకర్షించడానికి, మీరు కొంత గౌరవాన్ని చూపించాలి. డబ్బుకు కొంత గౌరవం చూపించడానికి , దానిని మరింతగా ఆకర్షించడానికి ఒక మార్గం, ప్రతికూల శక్తులను ఆకర్షించే లేదా విడుదల చేసే ఈ వస్తువులతో పాటు దానిని ఉంచకూడదు. ఈ విషయాలు ప్రతికూలతను ఆకర్షిస్తాయి. కాబట్టి... పైన చెప్పినవన్నీ వ్యాలెట్ లో పెట్టకూడదు. ఇవి ప్రతికూలతను కలిగిస్తాయి. వీటిని కనుక మార్చుకుంటే... మీరు ఆర్థికంగా ఎదుగుతారు.

Latest Videos

click me!