ఈరోజు రాశిఫలాలు: నిరుద్యోగు లైన ఓ రాశివారికి ఈరోజు కలిసొస్తుంది.

First Published | Apr 9, 2023, 4:53 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  బంధవర్గం వారితోటి మాట పట్టింపులు రాగలవు. తలపెట్టిన పనులలో ఊహించని విధంగా ఆటంకాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

09  ఏప్రియల్  2023 ఆది వారం  మీ  రాశి ఫలాలు 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
    
పంచాంగం    
తేది : 9ఏప్రిల్ 2023
సంవత్సరం :- శోభకృత్
ఆయనం :-ఉత్తరాయణం
మాసం :- చైత్రం
ఋతువు :- వసంత ఋతువు
పక్షం :-కృష్ణపక్షము                                                                                       
వారము:-ఆదివారం
తిథి :-  తదియ ఉదయం 9.20 ని.వరకు
నక్షత్రం :    విశాఖ మధ్యాహ్నం 1.50ని.వరకు
యోగం:- సిద్ధి రాత్రి 10: 07 ని.వరకు
కరణం:- భద్ర(విష్టి) ఉ॥9.20 బవ రాత్రి 8.46 ని.వరకు
అమృత ఘడియలు:-తె.3.09.ని.ల4.43 ని.వరకు
వర్జ్యం:-.    5.45 ని.ల7.19 ని.వరకు
దుర్ముహూర్తం:-సా.04.31ని. నుండి సా.05.20ని. వరకు                             
  రాహుకాలం:సా.04.30ని నుండి సా.06.00ని వరకు.                                                                  
యమగండం:మ.12.00ని. నుండి మ.01.30ని. వరకు.  

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
చేయ వృత్తి వ్యాపారముల సామాన్యంగా ఉంటాయి. ప్రతి విషయం నందు మనసునందు భయాందోళనగా ఉండుట. సమాజము నందు అపనిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  బంధవర్గం వారితోటి మాట పట్టింపులు రాగలవు. తలపెట్టిన పనులలో ఊహించని విధంగా ఆటంకాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును. నూతన సమస్యలు రాగలవు. ఆందోళన కలిగించే సంఘటనలు ఏర్పడను. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. ఉద్యోగమనందు అధికారుల తోటి ఒత్తిడిలు పెరగగలవు. ఈరోజు ఏ రాశి వారు ఓం దుర్గా జయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

ఉద్యోగమునందు అధికారుల తోటి గౌరవం మర్యాదలు పొందగలరు. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. చేయ పనులలో ఆలోచన ఆసక్తి పెరిగి పనులన్నీ సక్రమంగా నిర్వహిస్తారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. నూతన ఉత్సాహంతోటి వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహమునందు సంతోషకరమైన వాతావరణము. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారమగును. శక్తికి మించిన సాహస కార్యాలు చేస్తారు అందు ఊహించని లాభాలు కూడా ఈ రాశి వారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం బృహస్పతియే నమః అని చూపించండి.
 

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ప్రభుత్వ అధికారులతోటి గౌరవ మర్యాదలు పొందగలరు. కృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. చేయ పని యందు మంచి ఆలోచన శక్తితోటి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభించును. చేయు వ్యవహారములు నూతన ఉత్సాహముతోటి చేస్తారు. మీరు అనుకున్న చోటు నుండి లాభాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభించును. విందు వినోదాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ గురు రాఘవేంద్రయ నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
చేయ వ్యవహారమనందు అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగును. శారీరకంగా అత్యధిక శ్రమ ఏర్పడుతుంది. సంతానం నుండి ప్రతికూలత వాతావరణ. ఇతరులతోటి అనవసర విరోధాలు ఏర్పడవచ్చు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. చేయు పని వారి తోటి ఇబ్బందులు తలెత్తుతాయి. వృత్తి వ్యాపారములు యందు ధన నష్టం రాగలదు. అనవసరమైన ఆలోచనతోటి కాలయాపన చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడను. సమాజంలో అపవాదములు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ జపం చేయండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
అకారణ  కోపాల వల్ల అన్ని విధాల నష్టాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలందు రాణింపు తగ్గును. మానసిక భయాందోళనలు ఇబ్బందులు ఏర్పడను. కుటుంబ సభ్యులు తోటి ఉద్రేకంగా వ్యవహరించారు. ఉద్యోగవనందు అధికారుల తోటి విరోధాలు సమస్యలు ఏర్పడగలవు. ఆదాయం అంతంత మాత్రమే లభించును. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ప్రభుత్వ మూలక ఇబ్బందులు కలుగును.  నిరుద్యోగులు, చేతి వృత్తుల వారికి కలిసి వస్తుంది. అనవసరమైన అధిక ఖర్చులు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
మానసిక కోరికలు తీరగలవు. ఉద్యోగమనందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతాన వృద్ధి ఆనందం కలిగిస్తుంది. ధనాధాయ మార్గాలు బాగుంటాయి. మానసిక ప్రశాంతత లభించును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. చేయు వృత్తి వ్యాపారములు అన్ని రంగములు వారికి అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. ఈరోజు వారు ఈరోజు ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారమనందు ధన లాభం కలుగును. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన అభివృద్ధి వ్యాపార విషయాల గూర్చి చర్చిస్తారు. మనసునందుకు ఉత్సాహంగా ఉంటుంది. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆరోగ్యం బాగుండను. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్లగలరు. భార్య భర్తల మధ్య సరైన అవగాహన ఏర్పడి ఆనందంగా గడుపుతారు. సమాజము నందు మీ  శక్తి సామర్థ్యాలు తెలియగలవు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం లక్ష్మీ నరసింహాయ నమః శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
వృత్తి వ్యాపారములు అధిక ధన లాభం చేకూరుతుంది. సమాజము నందు మీ మాటకు గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వాక్చాతుర్యంతోటి అందరిని ఆకట్టుకుంటారు. నూతన అభివృద్ధి ప్రణాళికలు గూర్చి చర్చలు జరుపుతారు. ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల తోటి పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఇతరుల  సహాయ సహకారాలు పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది అలంకార వస్తువుల కొంటారు. మనసునందుకు ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటికా జరుగును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ముఖ్యమైన సమస్యల నుండి బయటపడతారు. దైవ సంబంధ కార్యాలు చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం చండీకాయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఊహించని రీతిలో అధిక ఖర్చులు ఏర్పడగలవు. ఉద్యోగమునందు ప్రభుత్వ అధికారులతోటి సమస్యలు ఏర్పడతాయి. బంధుమిత్రుల తోటి అకారణంగా విరోధాలు రాగలవు. వృత్తి వ్యాపారం నందు శ్రమకు తగిన ఫలితం పొందగలరు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. ఇష్టమైన వారికి దూరం అవుతారు జాగ్రత్తలు తీసుకొనవలెను. ప్రతి విషయం నందు భయాందోళనగా ఉంటుంది. సమాజము నందు అవమానాలు అపవాదములు ఏర్పడగలవు. దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
అధికమైన కోపం చేత చేయ పని యందు ఆటంకాలు ఏర్పడి చికాకు పుట్టించును. ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. అవసరానికి తగ్గ ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. కుటుంబమునందు తీవ్ర వ్యతిరేకతలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో సఖ్యత గానం ఉండవలెను. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతోటి అకారణంగా కలహాలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):ఉద్యోగము నందు ప్రభుత్వ అధికారులతోటి సమస్యలు ఏర్పడగలవు. చేయి ఖర్చు యందు ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. తల పట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వచ్చును. ముఖ్యమైన వస్తువులు ఎందుకు జాగ్రత్త అవసరము. ఇతరులతోటి అనవసరపు  గొడవలకు దూరంగా ఉండవలెను. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. శారీరక శ్రమ పెరుగుతుంది. చిన్నపాటి విషయాల కూడా ఇతరులతోటి వివాదాలు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం గణాధిపాయ నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి

Latest Videos

click me!