ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి

First Published Oct 6, 2022, 4:50 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. 

Durga Puja Horoscope

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

పంచాంగం:                                                                                                                                                                                                                      
  
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజ
ఋతువు : శరదృతువు
పక్షం : శుక్లపక్షము                                                                                          
వారము: గురువారం
తిథి : ఏకాదశి ఉ.08.56ని.ల వరకు
నక్షత్రం :ధనిష్ఠ రా.08.05ని.ల వరకు   
వర్జ్యం: రా.02.54ని.ల నుండి తె.04.25ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉ. 09.50ని.ల నుండి ఉ.10.38ని.ల వరుకు తిరిగి మ.02.34ని.ల నుండి మ.3.22ని.ల వరకు.
రాహుకాలం: మ. 1.30ని.నుండి మ. 3.00ని. వరకు
యమగండం:  ఉ. 6.00ని. నుండి ఉ. 7.30ని.  వరకు
సూర్యోదయం : ఉదయం 5:54ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 05:44ని.లకు

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శ్రమ అధికం. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశను కలిగిస్తాయి. ఆరోగ్యక ఇబ్బందుల వలన కొంతమేర రుణాలు చేయవలసొస్తుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన ప్రయాణాలు.

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
 

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసుకుంటారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.నిరుద్యోగుల ప్రయత్నాలు పలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు పెట్టుబడికి తగిన లాభాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భూ గృహ స్థిరాస్తి క్రయవిక్రయాలలొ లాభాలు పొందుతారు.
 

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ముఖ్యమైన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనవసరమైన కలహాలు.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.ఆదాయానికి మించిన ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుండి బయటపడతారు.అనుకోని కొన్ని అవకాశాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు ధనం సమకూరుతుంది.సంఘంలో సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక వ్యహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఉద్యోగాలలో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆకస్మిక ధనలాభం. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.విలువైన వస్తు ఆభరణాలు కొనుగొలు చేస్తారు. సన్నిహితులతో కలిసి అందంగా గడుపుతారు. ఉద్యోగులకు పై అధికారుల మన్నన.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. తలపెట్టిన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు పై అధికారుల మన్నన. వ్యాపారాలలో లాభాలు.
 

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
దైవ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. తలపెట్టిన పనులు విజయం సాధిస్తారు.వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. దూర ప్రాంతాల నుండి వచ్చిన శుభవార్తలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పుణ్య‌‌క్షేత్రాలు సందర్శిస్తారు.వాహన సౌఖ్యము.దూరప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యం.విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి ఆర్థిక సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.
ఋణ సమస్యలు తీరి ఉప సంమనం పొందుతారు.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ముఖ్యమైన పనుల్లో అవరోధాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్ధికపరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. సంతాన విషయంలో శ్రద్ధ అవసరం. బంధుమిత్రులతో మాట పట్టింపులు. ఆకస్మిక ప్రయాణం సూచనలు.

click me!