ఫ్లర్టింగ్ లో వీరికి ఓనమాలు కూడా తెలీవు...!

Published : Oct 05, 2022, 09:33 AM IST

కొందరికి మాత్రం ఈ ఫ్లర్టింగ్ లో కనీసం అ,ఆ లు కూడా రావు. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింద రాశులవారికి కనీసం ఫ్లర్ట్ చేడయంలో కాస్త కూడా అవగాహన లేదు. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...  

PREV
15
ఫ్లర్టింగ్ లో వీరికి ఓనమాలు కూడా తెలీవు...!

ఫ్లర్టింగ్ చేయడం అంత సులువేమీ కాదు. అది కూడా ఒక ఆర్ట్. మనకు నచ్చిన వ్యక్తి ని ఫ్లర్ట్ చేస్తూ.... వారిని మన వైపు తిప్పుకోవడం అంటే మామూలు విషయం కాదు. కొందరు ఈ పని చాలా సులభంగా చేయగలరు. కొందరికి మాత్రం ఈ ఫ్లర్టింగ్ లో కనీసం అ,ఆ లు కూడా రావు. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింద రాశులవారికి కనీసం ఫ్లర్ట్ చేడయంలో కాస్త కూడా అవగాహన లేదు. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

25

1.మకర రాశి..

మకరరాశి వారు  చాలా  తెలివైనవారు. ఏ విషయాన్నైనా చాలా షార్ప్ గా ఆలోచించగలరు. అందరితో చాలా సరదాగా, ఫన్నీగా ఉంటారు. కానీ ఫ్లర్టింగ్ లో మాత్రం వీరికి ఓనమాలు కూడా తెలియవు. ఫ్లర్ట్ చేయాల్సిన సందర్భమే వస్తే... వీరు చాలా సిగ్గుపడిపోతారు.  అసమంజసమైన సంభాషణను ఎలా నిర్వహించాలో వారికి తెలియదు. తాము ప్రేమించిన వారితో ఫేస్ టూ ఫేస్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా వారికి ఏం మాట్లాడాలో తెలీదు. వాళ్ల గురించి తప్ప అన్నీ మాట్లాడతారు. కనీసం తమ ప్రేయసి ఎదురుగా ఉంటే అందంగా ఉన్నావనే కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా వీరికి చేతకాదు.

35

2.కుంభ రాశి..
మకర రాశిలాగానే కుంభ రాశివారికి కూడా ఫ్లర్టింగ్ లో కాస్త కూడా అవగాహన లేదు. వీరికి ఇతర విషయాలపై అవగాహన చాలా ఎక్కువ. వాటి గురించి ఎంతైనా మాట్లాడగలరు. ఇతరులను పరిశీలించి.. ఎవరు ఎలాంటి వ్యక్తులు అని చెప్పడంలోనూ వీరు నేర్పరులు. కానీ.... ఫ్లర్టింగ్ విషయానికి వస్తే మాత్రం బోల్తా పడిపోతారు. ఎవరికీ తెలియని విషయాలనైనా వివరంగా చెప్పగల వీరు... ఫ్లర్టింగ్ లో మాత్రం నిత్యం బోల్తా పడుతూనే ఉంటారు.

45

3.కర్కాటక రాశి..

కర్కాటక రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీరికి ఫ్లర్టింగ్ లో కాస్త కూడా అవగాహన లేదు. ఎవరినైనా ఫ్లర్ట్ చేయాల్సి వచ్చినా వీరు ఎమోషనల్ అవుతారు. దానిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మాత్రం వీరికి అస్సలు తెలీదు. అది వారితో పాటు... ఎదుటివారిని సైతం ఇబ్బంది పడుతుంది. ఎదుటివారి మనసుకు నచ్చేలా మాట్లాడటం వీరికి కాస్త కష్టమనే చెప్పాలి. 

55

4.వృషభరాశి..

వృషభం పరిహసము చేయగలదు కానీ వారు చాలా భిన్నమైన విధానాన్ని కలిగి ఉంటారు. వారు సాంప్రదాయ వ్యక్తులు కాబట్టి వారు నేరుగా ఫ్లర్టింగ్ చేస్తూ ఎదుటి వ్యక్తిని సంప్రదించరు. మామూలుగా మాట్లాడగలరు. కానీ ఫ్లర్ట్ చేయలేరు. ఒకవేళ ఫ్లర్ట్ చేయాలని ప్రయత్నించినా పెద్దగా సక్సెస్ కాలేరు. అది వారికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. 

click me!

Recommended Stories