ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి రుణాలు తీరి మానసిక ప్రశాంతత

First Published | Aug 31, 2022, 4:33 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  పెట్టుబడులలో తగిన లాభాలు పొందుతారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు . మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు.

Daily Horoscope 2022 New 02

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 

పంచాంగం : 
   
సంవత్సరం : శుభకృతునామ 
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్షఋతువు
వారము: బుధవారం
పక్షం : శుక్లపక్షము
తిథి : చవితి మ.01.57ని. వరకు 
నక్షత్రం : చిత్ర రా.11.48ని. వరకు
వర్జ్యం : ఉ.07.47ని. నుండి ఉ.09.22ని.వరకు తిరిగి తె.వ.5.17 ల
దుర్ముహూర్తం :మ. 11.35ని. నుండి మ.12.25ని. వరకు.   
రాహుకాలం: మ. 12.00ని.నుండి మ. 1.30ని.వరకు
యమగండం: ఉ. 07.30ని. నుండి ఉ. 9.00ని. వరకు
సూర్యోదయం : ఉదయం 5:48ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:13ని.ల వరకు.   
వినాయక చతుర్థి  
 


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.  ఆరోగ్య వాహన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పై అధికారుల నుండి ఒత్తిడి. అనవసర ఖర్చులు. గృహ నిర్మాణ సంబంధిత పనులలో ఆటంకాలు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. 

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
బంధుమిత్రుల నుండి అనుకోని ఆహ్వానాలు.పెట్టుబడులలో తగిన లాభాలు పొందుతారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు . మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.   విద్యార్థులకు అనుకూలం. 


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
 ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన మిత్రులు పరిచయమై కొత్త పనులకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. పెట్టుబడులలో లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాల్లో ధన లాభం.  కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి.


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
 ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు అందుతుంది. శ్రమ పడ్డ ఫలితం కష్టమే. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.  వృత్తి వ్యాపారాలలో ప్రతికూల వాతావరణం . కోపతాపాలకు, తగాదాలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళన. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం.

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
 ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహన సౌఖ్యం. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుండి అనుకొని ఆహ్వానాలు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ముఖ్యమైన  పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు.సంఘంలో తెలివిగా వ్యవహరించాలి. ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు. వాహన ప్రయాణాల్లో నిర్లక్ష్యం తగదు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలు సామాన్యం.అనుకోని ఖర్చులు.మానసిక ఒత్తిడి.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
 శుభకార్యాలలో  పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సంఘంలో గౌరవం. వివాహ ప్రయత్నాలకు అనుకూలం.
 కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. వాహన సౌఖ్యం.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
భూ వివాదాలు తీరి లబ్దిపొందుతారు. అనుకోని విధంగా ధన వస్తు లాభాలు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల నుండి నుండి ఆహ్వానాలు. ముఖ్యమైన నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. రుణాలు తీరి ఉపశమనం పొందుతారు.దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు.

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలలో స్వల్ప లాభాలు.సంఘంలో ఆదరణ పొందుతారు. భూ గృహ క్రయ విక్రయాలకు అనుకూలం.గృహంలో అనుకూలమైన వాతావరణం. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.విందు వినోదాలు.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు తొలగి ఉపశమనం పొందుతారు. పనులు సాఫీగా సాగుతాయి వృత్తి వ్యాపారాలో లాభాలు.  సంతానమునకు విద్యా ఉద్యోగ అవకాశాలు.  క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.
 

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
సన్నిహితుల సహకారంతో తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు అందుతుంది. శ్రమాధిక్యత. కుటుంబంలో ఏర్పడినచికాకులు తొలగుతాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు.  వృత్తి,వ్యాపారాల స్వల్ప లాభాలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
 


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు.సంఘంలో పేరు ప్రతిష్టలు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. వాహన, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.

Latest Videos

click me!