Today Horoscope: ఓ రాశివారి వివాహ, ఉద్యోగయత్నాలు కార్యరూపం

First Published | Jun 2, 2022, 4:41 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఉద్యోగాలలో పనిభారంతో సతమతమవుతారు. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అన్ని పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును.

Daily Horoscope 2022 - 15

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

Daily Horoscope 2022 - 16

పంచాగం

తేది : 02, జూన్  2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్టమాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : గురువారం
పక్షం : శుక్ల పక్షం
తిథి : తదియ రాత్రి.09.11ని.ల వరకు
నక్షత్రం :ఆరుద్ర మధ్యాహ్నం 01.48ని.ల వరకు తదుపరి పునర్వసు
వర్జ్యం : తె.03:04ని॥ నుంచి తె. 04:51 ని॥ వరకు 
దుర్ముహూర్తం : ఉదయం 09:47ని.ల నుంచి ఉదయం 10:39ని.లవరకు తిరిగి మధ్యాహ్నం 02:59ని.ల నుండి 03:51ని.ల వరకు
పితృ తిథి తదియ.
రాహుకాలం : మధ్యాహ్నం 01:30 ని.ల నుంచి  మధ్యాహ్నం 03: 00 ని.ల వరకు
యమగండం : ఉదయం 06:00ని.ల నుంచి ఉదయం 07:30ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5:28 ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:27ని.ల వరకు


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
చేయు పనులయందు ఆటంకాలు. ఎక్కువగా కష్టపడతారు. పాతమిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి.అనవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో అపనిందలు . వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. అనవసరమైన పనుల యందు ఆసక్తి కనబరుస్తారు. శారీరక కష్టం. కోర్టు వ్యవహారాలలో నిరాశ.
 

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్థి వృద్ధి చేస్తారు. ఉద్యోగాలలో పనిభారంతో సతమతమవుతారు. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అన్ని పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో పెద్ద వారి ఆదరణ పొందుతారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. దేవాలయ దర్శనం. దానధర్మాలు చేస్తారు.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
వ్యాపార సంబంధ వ్యవహారాలలో ధన లాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న విధుల్లో చేరతారు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. ప్రయాణాలు కలిసి వస్తాయి. మంచి వ్యక్తులను కలుస్తారు.శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాలకు అనుకూలం. గృహము నందు శుభకార్యములు. బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి.ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే మెరుగుపడతాయి. మీ ఆలోచనలు కుటుంబసభ్యులకు సైతం నచ్చడం విశేషం. పలుకుబడి, హోదాలు ఉన్న వ్యక్తులు పరిచయమవుతారు.  కళలయందు ఆసక్తి చూపుతారు. స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అనుకోని కలహాలు. ప్రయాణాలు. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. కష్టపడి చేసిన పనులలో విజయం సాధిస్తారు. 

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభం. వ్యాపారాలు విస్తరించడంలో పురోగతి. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామికవర్గాల ఆశలు ఫలించి ముందుకు సాగుతారు. బంధుమిత్రుల కలయిక. ఇతరులకు సహాయం చేస్తారు. గృహము నందు సుఖసంతోషాలు. శుభవార్తా శ్రవణం. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. అనేకరకాల ఆలోచనలతో విసుగు చెందుతారు. శుభకార్యానికి శ్రీకారం. తలపెట్టిన పనులలో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత.


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
అనవసరమైన గొడవలు. మానసిక ఒత్తిడి.  సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు అందినా సంతృప్తినిస్తాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ధన నష్టం. స్థిరాస్తి క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో చోర భయం.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. పై అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. ప్రయాణాల్లో లాభాలు.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
బంధుమిత్రులతో కలహాలు.విధుల్లో కొంత అప్రమత్తత అవసరం. రాజకీయవర్గాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. మానసిక అశాంతి.  చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలు కు అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగండి. రుణ శత్రుబాధలు. ఉద్యోగాలలో చికాకులు. సంఘాల్లో తెలివిగా వ్యవహరించండి. అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి.
 

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
అధికారుల ఒత్తిడి. అకారణంగా కోపం.ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగ విధుల్లో అవాంతరాలు. అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత.  వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట.దేవాలయ సందర్శన. సేవకుల వలన కొద్దిగా ఇబ్బందులు. సంఘంలో వాదోపవాదములు. గృహ సంబంధిత పనులలో ఆటంకాలు.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.  గౌరవప్రతిష్టలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మునుపటి కంటే అనుకూలించి లాభాలు అందుకుంటారు.ఆకస్మిక ధన లాభం. కొత్త వ్యక్తుల పరిచయాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. రావలసిన బకాయిలు వసూలగును. సంఘంలో కీర్తి ప్రతిష్టలు.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.ఉద్యోగులకు పని ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు సామాన్యస్థితి. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం సహోద్యోగులతో సఖ్యతగా మెలుగుతారు. మిత్రుల సహకారంతో చేయు పనులలో ఇబ్బందులు ఏర్పడతాయి. స్వయంకృషితో కష్టపడిన పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల యందు సానుకూలత. మిత్రులతో చర్చాగోష్టి. కోర్టు వ్యవహారాల యందు విజయం సాధిస్తారు.
 

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఇతరులసహాయం తీసుకుంటారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు వివాదాలు కొంత పరిష్కారమవవుతాయి.వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో గొడవలు. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. ధనాదాయ మార్గాల అన్వేషణ చేస్తారు. కఠినంగా వ్యవహరిస్తారు. చేయు పనుల యందు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆటంకాలు ఎదుర్కొంటారు.

Latest Videos

click me!