జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశివారు ఎలాంటి ప్రేమికుల్ని కోరుకుంటారో తెలుసా..?

Published : Jun 01, 2022, 11:29 AM IST

తమకు అలాంటి వ్యక్తి రావాలి... ఇలాంటి వ్యక్తి రావాలి అంటూ చాలా మంది కలలు కంటూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశివారు ఎలాంటి ప్రేమికులు తమ జీవితంలోకి రావాలని అనుకుంటారో ఓసారి చూద్దాం..

PREV
113
జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశివారు ఎలాంటి ప్రేమికుల్ని కోరుకుంటారో తెలుసా..?


ఒక్కొక్కరికి ఒక్కోలాంటి ఆలోచనలు ఉంటాయి. ఒక్కోరకం అభిరుచి ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. తమకు అలాంటి వ్యక్తి రావాలి... ఇలాంటి వ్యక్తి రావాలి అంటూ చాలా మంది కలలు కంటూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశివారు ఎలాంటి ప్రేమికులు తమ జీవితంలోకి రావాలని అనుకుంటారో ఓసారి చూద్దాం..

213

1.మేష రాశి..
ఈ రాశివారు.. తాము పెద్దగా కష్టపడకుండానే, పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండానే తమను అర్థం చేసుకునే వ్యక్తి తమ జీవితంలో కి రావాలని కోరుకుంటారు. అలాంటి వారు వస్తే తమ జీవితం ఆనందంగా ఉంటుందని వారు నమ్ముతారు.

313

2.వృషభ రాశి..

ఈ రాశివారు  తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి.. లైఫ్ లాంగ్  ఉండాలని అనుకుంటారట. కొద్ది కాలం మాత్రమే వచ్చి వెళ్లిపోయే వ్యక్తి తమకు వద్దని అనుకుంటారు.

413

3.మిథున రాశి..
ఈ రాశివారు తమ రిలేషన్ షిప్ సాదాసీదాగా సాగడం నచ్చదు. కాస్త డ్రామా, మరికొంత స్పైసీ, ఉత్సాహం ఇలా అన్నీ ఉండాలని అనుకుంటూ ఉంటారు. వాటన్నంటినీ అందించే వ్యక్తి తమ జీవితంలోకి రావాలని అనుకుంటారు.

513

4.కర్కాటక రాశి..
ఈ రాశివారు ఎమోషన్స్ కి  ఎక్కువ విలువ ఇస్తారు. కాబట్టి తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి తమకు నిజమైన ప్రేమ, ఎఫెక్షన్ , బహుమతులు ఇచ్చే వ్యక్తి రావాలని అనుకుంటారు.

613

5.సింహ రాశి..
ఈ రాశివారు.. తమను నిజంగా ప్రేమించే వ్యక్తి... తమను ఆరాధించే వ్యక్తి తమ జీవితంలోకి రావాలని కోరుకుంటారు. అలాంటివారు వస్తే.. వారు అమితంగా ప్రేమిస్తారు.

713

6.కన్య రాశి..
కన్య రాశివారు.. తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి చాలా తెలివిగల వారు, లక్ష్యంపై ఎక్కువ దృష్టి పెట్టేవారు రావాలని కోరుకుంటారు. ఈ లక్షణాలు ఉన్నవారిని వీరు ఎక్కువగా ఇష్టపడతారు.

813

7.తుల రాశి..
ఎవరైతే తమ జీవితానికి,  లగ్జరీ లైఫ్, సహజత్వానికి ఒకేలాంటి విలువ ఇస్తూ... అచ్చం తమలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి వస్తే బాగుంటుందని వీరు కోరుకుంటారు.

913

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారికి తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి పై అంచనాలు చాలా ఎక్కువ. తమ అంచనాలను అందుకోగలిగిన వ్యక్తి ఎదురైనప్పుడు.. ఈ రాశివారు ఆటోమెటిక్ గా కనెక్ట్ అయిపోతారు.
 

1013

9.ధనస్సు రాశి..
ఈ రాశివారు.. తమ జీవితంలోకి వచ్చే వ్యక్తితో మొదట స్నేహం చేయాలని అనుకుంటారు. ఆ తర్వాత... వారితో బాండింగ్ బాగా కుదిరతే.. అప్పుడే ప్రేమించాలని అనుకుంటారు.
 

1113

10.మకర రాశి..
ఈ రాశివారు.. తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి.... తమను ఆరాధించేవారు అయ్యి ఉండాలని అనుకుంటారు. తమను అమితంగా ఆరాధించేవారికి మాత్రమే వీరు తమ జీవితంలోకి చోటు ఇస్తారు.
 

1213

11.కుంభ రాశి..
ఈ రాశివారు.. తమ లైఫ్ ని చాలా ఉత్సాహంగా చేసేవారు... తమ జీవితాన్ని చాలా క్రియేటివిటీగా మార్చేవారు రావాలని కోరుకుంటారు. అలాంటి వారిని వీరు ఎక్కువగా ప్రేమిస్తారు.

1313

12.మీన రాశి..
ఈ  రాశివారు.. తమపై అటెన్షన్, ప్రేమ ఎక్కువగా చూపించే వ్యక్తి తమ జీవితంలోకి రావాలని కోరుకుంటారు. కేవలం తమను మాత్రమే ప్రేమించాలని అనుకుంటారు.

click me!

Recommended Stories